
మా శవాలపై రిజర్వాయర్ నిర్మించండి
నిర్వాసితులందరికీ తగిన ప రిహారం చెల్లిస్తేనే రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తామని, లేదంటే తమ శవాలపైనే....
► అనంతగిరి ముంపునిర్వాసితుల ఆవేదన
► సంతకాల సేకరణకు వచ్చిన అధికారులపై ఆగ్రహం
► తగిన పరిహారం ఇవ్వాలంటూ బైఠాయింపు
ఇల్లంతకుంట: నిర్వాసితులందరికీ తగిన ప రిహారం చెల్లిస్తేనే రిజర్వాయర్ నిర్మాణానికి సహకరిస్తామని, లేదంటే తమ శవాలపైనే ని ర్మాణం చేసుకోండంటూ ఇల్లంతకుంట మం డలం అనంతగిరిలో నిర్వాసితులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. కాళేశ్వరం ఎత్తిపోతల పదోప్యాకేజీలో భాగంగా 3.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌లో భూ ములు, ఇళ్ళు కోల్పోతున్న నిర్వాసితులు అనంతగిరిలో శనివారం సంతకాల సేకరణ కోసం వచ్చిన భూసేకరణ విభాగం స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ నటరాజ్, తహసీల్దార్ సుమాచౌదరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఎకరాకు రూ.10 లక్షల చొప్పున, ఇళ్లు, బావులు, చె ట్లకు తగిన పరిహారం చెల్లిస్తేనే తాము సహకరిస్తామని నిర్వాసితులు అధికారులకు తేల్చిచెప్పారు. ఎకరాకు రూ. 6 లక్షలతోపాటు ఇళ్ళ కు కొలతల ప్రకారం పరిహారం అందిస్తామ ని, బావులు, బోర్లను కూడా సర్వే చేసి లోతు ను బట్టి పరిహారం ఇస్తామని అధికారులు చెప్పారు. అనంతగిరి రిజర్వాయర్‌లోనే భూ ములు కోల్పోతున్న చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టపల్లి, చల్కలపల్లి, అల్లీపూర్ గ్రామా ల్లో ముంపు నిర్వాసితుల బావులకు రూ. 2 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తున్నారని, ఇళ్ళ కు రూ. 2 లక్షల నుంచి రూ. 5లక్షలు దాటడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు అంగీకరించకపోవడంతో గ్రామపంచాయతీ ఎదుట బైఠాయించి అధికారులను అడ్డుకున్నారు. జెడ్పీటీసీ సిద్ధం వేణు కలుగజేసుకుని కలెక్టర్‌తో మాట్లాడి అందరికీ ఆమోదయోగ్యమైన పరిహారం వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి, ఎంపీటీసీ బాణవ్వ, తదితరులు పాల్గొన్నారు.