హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్‌సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది.
తాజాగా ఐఆర్‌సీటీసీ ఒక ట్వీట్‌లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్‌సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్‌లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్‌కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
It's time for a vacation amidst the hills.
— IRCTC (@IRCTCofficial) February 21, 2024
Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram
Book now on https://t.co/9ulobfRHWU
.
.
.#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp
Comments
Please login to add a commentAdd a comment