Manali
-
మనాలీ కిటకిట.. మూడు రోజుల్లో 50 వేల మంది పర్యాటకులు
వేడి వాతావరణం నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు చల్లని ప్రదేశాలకు చేరుకుంటున్నారు. ఈ కోవలో హిమాచల్ ప్రదేశ్‌లోని పర్యాటక నగరం మనాలి పర్యాటకులతో సందడిగా మారింది.మనాలీలో వారాంతాల్లో పర్యాటకుల సంఖ్య రెండింతలు పెరిగింది. గత రెండు వారాలతో పోలిస్తే ఈ వారాంతంలో అధికంగా పర్యాటకులు మనాలికి తరలివచ్చారు. మూడు రోజుల్లో 50,000 మందికి పైగా పర్యాటకులు మనాలికి వచ్చారు. పర్యాటకులతో కూడిన 7,500 వాహనాలు మనాలికి చేరుకున్నాయి.మనాలిలోని హిడింబ దేవాలయం ఆదివారం పర్యాటకులతో నిండిపోయింది. అమ్మవారి దర్శనం కోసం పర్యాటకులు పెద్ద ఎత్తున బారులు తీరారు. రద్దీ కారణంగా కొందరు పర్యాటకులు బయటి నుండే అమ్మవారిని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు. రోహ్తంగ్, లాహౌల్ వ్యాలీతో పాటు, మనాలిలోని మాల్ రోడ్లో ప్రభుత్వం పర్యాటక ప్రదర్శన నిర్వహించింది. గ్రీన్ ట్యాక్స్ బారియర్ వద్ద బయట రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటక వాహనాల సంఖ్య 2,500 దాటింది.మనాలిలో హోటల్ గదులు 70 నుండి 90 శాతం వరకు బుక్ అయ్యాయి. పర్యాటకులు ఇక్కడి నుంచి సోలంగ్నాల, సిస్సు, కోక్సర్, రోహ్తంగ్, హిడింబ ఆలయం, వశిష్ఠలను చూసేందుకు వెళుతున్నారు. సాయంత్రం కాగానే మనాలిలోని మాల్ రోడ్డు పర్యాటకులతో నిండిపోతోంది.హోటళ్లన్నీ పర్యాటకులతో నిండిపోయాయని హోటళ్ల సంఘం అధ్యక్షుడు ముఖేష్ ఠాకూర్ తెలిపారు. రానున్న రోజుల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అన్నారు. హిమాచల్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ బీఎస్ ఓక్తా మాట్లాడుతూ వారాంతపు రోజుల్లో మనాలీకి వచ్చే టూరిస్టుల సంఖ్య పెరుగుతున్నదని, కార్పొరేషన్‌లోని హోటళ్లు దాదాపుగా నిండిపోయాయని పేర్కొన్నారు. -
స్కేట్‌బోర్డ్‌పై మనాలి టు కన్యాకుమారి
‘మనాలి నుంచి కన్యాకుమారికి ఎలా వెళతాం?’ అనే ప్రశ్నకు ‘స్కేట్‌బోర్డ్ మీద’ అని ఎవరూ చెప్పరు. ‘మీరు చెప్పకపోతేనేం... నేనైతే స్కేట్‌బోర్డ్ మీదే వెళ్లాను’ అంటున్నాడు రితిక్. ప్రెషనల్ స్కేట్ బోర్డర్ అయిన రితిక్ క్రాడ్జెల్ మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్‌బోర్డ్ మీద వెళ్లాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నెట్లోకాన్ని అబ్బురపరుస్తున్నాయి. చిన్న బ్యాక్‌ప్యాక్‌తో బయలుదేరిన రితిక్ 100 రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రీల్స్, వీడియోలలో తనకు ఎదురైన అనుభవాలను నెటిజనులతో పంచుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం నుంచి దట్టమైన ΄పొగమంచుతో హైవేల జీరో విజిబిలిటీ వరకు రితిక్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళ్లాడు. రితిక్ సాహసం, ఓపికకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్‌లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్‌కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
విలాసవంతమైన నివాస భవనాల్లో టాప్ నగరాలు ఇవే..
ప్రపంచంలోనే విలాసవంతమైన నివాస భవనాల ధరలు పెరుగుతున్నాయి. అలా ధరలు పెరుగుతున్న జాబితాలో గ్లోబల్‌గా ముంబయి నాలుగోస్థానంలో ఉంది. అందుకు సంబంధించి నైట్ ఫ్రాంక్ ఇండియా ‘ప్రైమ్ గ్లోబల్ సిటీస్ ఇండెక్స్ క్యూ3 2023’ నివేదికలను విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ముంబయి రియల్ ఎస్టేట్ మార్కెట్ నాలుగో స్థానంలో ఉంది. ఈ నివేదిక లగ్జరీ గృహాల సగటు వార్షిక ధరల వృద్ధిని సూచిస్తుంది. ఇదీ చదవండి: దీపావళికి ముందే అంబానీ క్రెడిట్ కార్డులు దేశంలోని ముంబయి(నాలుగోస్థానం), దిల్లీ పదో స్థానం, బెంగళూరు 17వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని 46 నగరాల్లో సర్వే చేసి ఈ నివేదికను రూపొందించారు. గతేడాది ముంబయి 22వ స్థానం ఉంది. ఏడాది కాలంలో ప్రైమ్ రెసిడెన్షియల్ ధరలలో 6.5 శాతం పెరిగాయి. దాంతో 18 స్థానాలు ఎగబాకింది. దిల్లీ, బెంగళూరు సైతం వాటి ఇండెక్స్‌ను మెరుగుపరుచుకున్నాయి. గ్లోబల్ ఇండెక్స్‌లో తొలి మూడు స్థానాల్లో మనీలా(ఫిలిప్పీన్స్), దుబాయ్(యూఏఈ), షాంఘై(చైనా) నిలిచాయి. -
విజయ్ దేవరకొండ తల్లిని ఏడిపించేసిన రౌడీ ఫ్యాన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్‌స్టేటస్ అందుకున్న విజయ్ గత ఐదేళ్ల నుంచి ‘దేవరశాంటా’(Deverasanta) పేరుతో ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇంకాస్త డిఫరెంట్‌గా ప్లాన్ చేసిన విజయ్ తన అభిమానుల్లో 100మందిని మనాలికి హాలీడే ట్రిప్‌కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ఓ స్పెషల్ వీడియోను షేర్చేసుకున్నాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్‌కి వెళ్లిన సంగతులని గుర్తుచేసుకుంటూ.. 'నాకు 21 ఏళ్లున్నప్పుడు అనుకుంటా. మొదటిసారి నా ఇద్దరు ఫ్రెండ్స్‌తో కలిసి హంపి ట్రిప్‌కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్‌కు సరిపడా డబ్బులన్నీ నా స్నేహితుడే భరించాడు. నా ఫస్ట్ హాలీడే వెకేషన్ అదే. నాలాగే అలాంటి సంతోసాన్ని మీ అందరికి కూడా పంచాలనుకున్నా' అంటూ విజయ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ దేవర శాంటాలో భాగంగా మనాలి ట్రిప్‌కు వెళ్లిన అభిమానులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ విజయ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ ట్రిప్‌కు చివర్లో తన తల్లిదండ్రులతో వెళ్లి విజయ్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ చేయడం విశేషం. -
మాట నిలబెట్టుకున్న విజయ్! వందమంది ఫ్యాన్స్ సర్ప్రైజ్ ట్రిప్ వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంతో యూత్‌లో ఆయన విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల కంటే కూడా తన ప్రవర్తనతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. హిట్..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. అలాగే విజయ్ కూడా తరచూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. చదవండి: నాపై అలాంటి కామెంట్స్ చేశారు.. దానికి కారణం ఇదే: ఎస్వీ కృష్ణారెడ్డి గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరుతో ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని మనాలి విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు. చదవండి: పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్ జోరు ఇప్పటికే ఈ 100 మంది పేర్లు ప్రకటించిన విజయ్ ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాత్ర కొనసాగనుందని వెల్లడించాడు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 17న) వారి జర్నీ స్టార్ట్. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ పంపిన వీడియోని విజయ్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఈ రోజు ఉదయం వాళ్లు ఫ్లైట్‌లో ఉన్న వీడియోను నాకు పంపించారు. పర్వతాల్లోకి హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ విజయ్ రాసుకొచ్చాడు. Cutest ❤️ they sent me a video from their flight this morning. And they are off on their holiday to the mountains! 100 from across the country, makes me so happy 🥰#Deverasanta2022 pic.twitter.com/BF4DX5PIyG — Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2023 And here are the 100 of you, randomly selected this year :) Travel dates - February 17- 20. Will do a call group call and speak soon ❤️ pic.twitter.com/syOaRfvsXa — Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2023 -
విజయ్ దేవరకొండ బంపరాఫర్.. 100 మంది అభిమానులకు ఫ్రీగా మనాలి ట్రిప్
సినిమాల కంటే వాళ్ల ప్రవర్తనతో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న అతి తక్కువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. హిట్..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. విజయ్ కూడా తరచూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరును ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు. క్రిస్మస్ సందర్భంగా విజయ్ తన సోషల్ మీడియాలో ‘మీలోని 100 మంది హాలిడే ట్రిప్‌కి పంపించాలనుకుంటున్నాను. ఏ ప్రదేశాలు అయితే బాగుంటుందో చెప్పడంటూ భారత్‌లోని చారిత్రక ప్రదేశాలు.. పర్వతాలు.. బీచ్‌లు,ఎడారిని సూచించాడు. వాటిలో ఎక్కువ మంది పర్వతాలను ఎంచుకున్నారు. తాజాగా ఈ హాలిడే ట్రిప్‌కి సంబంధించిన అప్డేట్ని ఓ వీడియో రూపంలో ఇచ్చాడు విజయ్. ‘నేను మీలో 100మందిని ఐదు రోజుల పాటు మనాలి టూర్‌కి పంపుతున్నాను. అక్కడ ఫుడ్, ట్రావెల్‌తో పాటు అన్నింటిని నేనే చూసుకుంటాను. మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాల ను చూసి ఎంజాయ్ చేయండి. మీ యాత్రకు సంబంధించిన ప్రణాళికను మేం సిద్ధం చేస్తాం. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ యాత్రకు అర్హులు. దీనికి మీరు చేయాల్సిన పనేంటంటే.. దేవరశాంట ఫారమ్ నింపి..నన్ను ఫాలో అవ్వండి. మీలో 100 మందిని ఎంపిక చేసి విహారయాత్రకు పంపిస్తాం. నేను మీ ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నాను. ట్రిప్‌ని ఎంజాయ్ చేయండి’అని విజయ్ చెప్పుకొచ్చాడు. విజయ్ ఇచ్చిన ఆఫర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వంద మందిలో తాము కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేస్తున్నారు. 100 of you go to the mountains ❤️ Update! Happy new year. Big kisses and lots of love to all of you.https://t.co/3e0wE3ECNt https://t.co/a5vLqeQXze pic.twitter.com/wTyZGH0JOt — Vijay Deverakonda (@TheDeverakonda) January 8, 2023 -
‘మనాలీ స్వింగ్’.. ‘మహా ఊయల’తో పర్యటకులకు వింత అనుభూతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన మనాలీకి ఏటా వేలాది మంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈ క్రమంలో పర్యటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది అక్కడి అంకుర సంస్థ. ఎత్తయిన ప్రాంతంలో గాలిలో ఊగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మహా ఊయల (జెయింట్ స్వింగ్) జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే ఈ జెయింట్ స్వింగ్‌ను ఐఐటీ మండీ వద్ద ఏర్పాటైన ‘మనాలీ స్వింగ్’ అంకుర సంస్థ రూపొందించింది. ప్రపంచంలోనే ఇలాంటి తరహా ఊయల ఇదే మొదటిదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పర్వతారోహణపై ఆసక్తి ఉండి, సాహసాలను ఇష్టపడే నలుగురు ఇంజినీరింగ్ మిత్రులు ఈ అంకుర సంస్థను స్థాపించారు. ఈ ఊయల ఆకృతి, కాన్సెప్టులపై 5 పేటెంట్లు పొందేందుకు అవసరమైన ప్రక్రియను కూడా వీరు ప్రారంభించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు రూ.3,000 చెల్లిస్తే.. రవాణా ఛార్జీలు, ఫొటో, వీడియోలకు అయ్యే ఖర్చులన్నీ అందులో కలిసే ఉంటాయని తెలిపారు. -
మనాలీలో.. యాక్షన్
‘యోధ’ కోసం మనాలీ వెళ్లారు హీరోయిన్ రాశీఖన్నా. బాలీవుడ్ యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా సాగర్ అంబ్రే, పుష్కర్ ఓజా ద్వయం తెరకెక్కిస్తున్న సినిమా ‘యోధ’. ఈ యాక్షన్ ఫిల్మ్‌లో దిశా పటానీ, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. అయితే కొంత ప్యాచ్‌వర్క్ కోసం మనాలీ వెళ్లింది ‘యోధ’ చిత్రబృందం. షూట్లో పాల్గొంటున్న విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్ స్టా ద్వారా తెలిపారు రాశీ ఖన్నా. ఇందులో రాశీ ఖన్నా కొన్ని యాక్షన్ సీన్ కూడా చేశారన్నది బాలీవుడ్ సమాచారం. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం కాకుండా తమిళంలో కార్తీ ‘సర్దార్’, తెలుగులో శర్వానంద్‌తో ఓ సినిమా చేస్తున్నారు రాశీ ఖన్నా. -
బహుముఖం: ‘జెమ్’వాల్
చిన్నప్పటి నుంచి ఎంతోమంది సాహసికుల గురించి వింటూ పెరిగింది ఇషానిసింగ్ జమ్వాల్. అయితే ఆ సాహసాలు ఆమె చెవికి మాత్రమే పరిమితం కాలేదు. ‘ఛలో... మనమెందుకు చేయకూడదు’ అని అనిపించేలా చేశాయి. తాజాగా కార్గిల్‌లోని కున్ శిఖరాన్ని అధిరోహించి ‘జెమ్’ అనిపించుకుంది... ఇండియన్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (ఐఎంఎఫ్)కు చెందిన తొమ్మిదిమంది సభ్యులు కార్గిల్‌లోని 7,077 మీటర్ల ఎత్తయిన కున్ శిఖరాన్ని అధిరోహించడానికి గత నెల చివరి వారంలో బయలుదేరారు. తాజాగా కున్ శిఖరాన్ని అధిరోహించిన ఇషానిసింగ్ జమ్వాల్ జేజేలు అందుకుంటుంది. ‘ఈ సాహసయాత్రలో భాగం అయినందుకు గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని పర్వతారోహణ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నాను’ అంటుంది ఇషా. హిమాచల్‌ప్రదేశ్‌లోని పహ్నల గ్రామానికి చెందిన ఇషానిసింగ్కు చిన్నప్పటి నుంచి ఎడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆరవతరగతి నుంచే రకరకాల సాహసక్రీడల్లో పాల్గొనేది. స్కీయింగ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మన దేశం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్యం వహించింది. పర్వతారోహణపై ఆసక్తితో మనాలిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌లో శిక్షణ తీసుకుంది. చిన్నప్పుడు ఇషా తన పుస్తకాలలో రాసుకున్న ‘ఎడ్వెంచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ’ ‘నెవర్ గివ్ అప్’ ‘లైఫ్ ఈజ్ యాన్ ఎడ్వెంచర్’లాంటి వాక్యాలను చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. ఎడ్వెంచర్ స్పోర్ట్స్‌కు సంబంధించిన రకరకాల విషయాలను ఇషాకు చెబుతుండేవారు. పద్దెనిమిది సంవత్సరాల వయసులోనే పర్వతారోహణలో రికార్డ్ సృష్టించిన ఫ్రెంచ్ మహిళ మేరీ ప్యారడైస్ నుంచి ఆల్ఫ్లోని మ్యాటర్‌హార్న్ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళ లూసీ వాకర్ వరకు ఎంతోమంది సాహహికులైన మహిళలు గురించి చెబుతుండేది తల్లి నళినీసింగ్. పుస్తకాల విషయానికి వస్తే అలనాటి ‘నో పిక్నిక్ ఆన్ మౌంట్ కెన్యా’ నుంచి ఇప్పటి ‘నో షార్ట్ కట్స్ టు దీ టాప్’ వరకు ఇషాకు ఎన్నో ఇష్టం. విన్న మాట కావచ్చు, చదివిన అక్షరం కావచ్చు తనను తాను తీర్చిదిద్దుకోవడానికి ఇషానిసింగ్కు ఉపయోగపడ్డాయి. ‘ఇషా కున్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించడం ఆనందంగా, గర్వంగా ఉంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం’ అంటున్నారు తండ్రి శక్తిసింగ్. ఇషానిలోని మరోకోణం... మోడలింగ్. ఎన్నో ప్రముఖ బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఇషాని ‘తనిష్క్’ కోసం చేసిన ఒక యాడ్‌లో ఆమెను ‘మౌంటెనీర్’ ‘అథ్లెట్’ ‘మోడల్’ అంటూ పరిచయం చేస్తారు. అయితే ఆ వరుసలో చేర్చాల్సిన మరో విశేషణం... మోటివేషనల్ స్పీకర్. ఆమె ఉపన్యాసాలు ఆకట్టుకోవడమే కాదు స్ఫూర్తిని ఇస్తాయి. ‘మనకు మనం కొత్తగా కనిపించే ప్రయత్నం చేయాలి’ అంటుంది ఇషానిసింగ్. అప్పుడే కదా విజయాలు మన దరి చేరేవి! -
మనాలీలో రష్మికతో రణ్‌బీర్.. పెళ్లి తర్వాత ఇదే ఫస్ట్ మూవీ
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం 'యానిమల్' అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కోసం మూవీ టీం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ల్యాండ్ అయ్యింది. పెళ్లి తర్వాత రణ్‌బీర్ కపూర్ చేస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. ఇటీవలో అలియాతో పెళ్లి పీటకెక్కిన రణ్‌బీర్ ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్లో పాల్గొన్నారు. చదవండి: మాజీ భార్యపై రూ. 380కోట్ల పరువునష్టం దావా వేసిన హీరో ఇక మనాలి వెళ్లిన మూవీ టీంకు అక్కడి స్థానిక యంత్రాంగం సాంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్ కుమార్, ప్రణవ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్ పాత్ర విభిన్నంగా ఉంటుందని మూవీ టీం పేర్కొంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.చదవండి: ‘పుష్పరాజ్’ పై బాలీవుడ్ నటి ప్రశంసలు..విషయం ఏమిటంటే -
మనాలి నుంచి లేహ్ వరకూ..చిరుతలా పరిగెత్తింది
అల్ట్రా రన్నర్ సూఫియా ఖాన్. లక్ష్యం 480 కిలోమీటర్లు. కాని మామూలు దారి కాదు. సముద్ర మట్టానికి 2000 మీటర్ల నుంచి 3000 మీటర్ల ఎత్తున. చలి, మంచు, పర్వతాల దారి. కాని 146 గంటల్లో సాధించింది. ఈ దారిలో పరిగెత్తిన మొదటి మహిళ ఆమె. ‘ప్రపంచం మొత్తం పరిగెత్తాలని ఉంది’ అంటోందామె. అందుకు లేసులు కూడా బిగిస్తోంది. సంప్రదాయ మారథాన్ గరిష్టంగా 42 కిలోమీటర్లు ఉంటుంది. దానికి మించిన మారథాన్‌ను ఆల్ట్రా మారథాన్ అంటారు. సూఫియా ఖాన్ ఆల్ట్రా రన్నర్. అంటే ఏకధాటిగా వందల కిలోమీటర్ల మారథాన్ చేసే రన్నర్ అన్నమాట. ప్రపంచంలో ఆమెలా పరిగెడుతున్నవారు... రికార్డ్స్ సృష్టిస్తున్నవారు బహుశా మరొకరు లేరు. ఎందుకంటే ఆమె కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తి ఒక రికార్డు, గోల్డెన్ ట్రయాంగిల్ (జైపూర్, ఢిల్లీ, ఆగ్రా)లో పరిగెత్తి ఒక రికార్డు, తాజాగా మనాలి నుంచి లేహ్‌కు పరిగెత్తి ఒక రికార్డు నమోదు చేసింది. 35 ఏళ్ల వయసులో చిరుతలా పరిగెత్తే ఈమెను అందుకోవడం కష్టమేమి కాదు. కాకపోతే అందుకు మనమూ పరిగెత్తాల్సి ఉంటుంది. అజ్మీర్ అమ్మాయి అజ్మీర్‌లో పుట్టి పెరిగిన సూఫియాకు 16 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోయాడు. తల్లి ఆమెను పెంచింది. డిగ్రీ చేశాక ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం చూసుకోమ్మా అంది. కాని సూఫియాకు ఏవియేషన్ రంగంలో పని చేయాలనిపించి ఒక ప్రయివేట్ ఎయిర్‌లైన్స్‌లో గ్రౌండ్స్టాఫ్గా చేరింది. అక్కడ బండ చాకిరీ. సంవత్సరాలు గడిచిపోతుండేవి. దానికి తోడు ఆరోగ్యం, ఉత్సాహం సన్నగిల్లడం కూడా. ‘నన్ను నేను ఒకరోజు అద్దంలో చూసుకుంటే నా ఫిట్నెస్ అంతా పోయిందనిపించింది. డ్యూటీ చేస్తూనే ఆరోగ్యం కాపాడుకోవాలంటే రోజూ ఒక 15 నిమిషాలన్నా పరిగెత్తాలని అనుకున్నాను. అలా పరిగెత్తడం మొదలెట్టాను. అప్పటి వరకూ నాకు ఆటలంటే ఇష్టం లేదు. కాని పరిగెడుతుంటే నా శరీరం చిరుతలా మారేది. నాకు పరుగు సరిౖయెనది అని ఇంకా సాధన చేశాను’ అంటుంది సూఫియా. మారథాన్‌లో సూఫియా సందేశం కోసం పరుగు పరుగులో ఆనందం తెలిశాక రొడ్డకొట్టుడు ఉద్యోగాన్ని వదిలేసింది సూఫియా. ఒక సందేశం కోసం తన పరుగును దేశానికి చూపాలనుకుంది. ‘మానవత్వమే ముఖ్యం’ అనే సందేశంతో 2018లో మొదట ఇండియన్ గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య పరిగెత్తింది. 720 కిలోమీటర్ల ఈ దూరాన్ని 16 రోజుల్లో ముగించి రికార్డు స్థాపించిందామె. దాంతో ఆమె పరుగు మీద అందరి దృష్టి పడింది. ఆ తర్వాత 2019లో అంతకు మించి సాహసం చేసింది సూఫియా. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 4000 కిలోమీటర్ల దూరం– శ్రీనగర్‌తో మొదలయ్యి లూధియానా మీదుగా గజియాబాద్, కోట, ఇండోర్, ముంబై, బెలగామ్, బెంగళూరు, మదురైలను దాటి కన్యాకుమారి వరకూ ఆమె పరిగెత్తింది. ఏప్రిల్ చివరి వారంలో మొదలెట్టి రోజుకు 50 కిలోమీటర్ల లెక్కన పరిగెడుతూ దాదాపు 90 రోజులలో ఆమె ఈ పరుగును పూర్తి చేసి మరో రికార్డును స్థాపించింది. ఇప్పుడు ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో మనాలి, లేహ్‌ల మధ్య పరిగెత్తింది. ‘నీ హద్దుల్ని దాటు’ స్త్రీలకు అన్నీ హద్దులే. స్త్రీలు చేసే సాహసాలకు అన్నీ ఆటంకాలే. అందుకే సూఫియా ‘నీ హద్దుల్ని దాటు’ అనే సందేశంతో సెప్టెంబర్ 25, 2021 ఉదయం తన ‘హిమాలయన్ ఆల్ట్రా రన్ ఎక్స్‌పెడిషన్’ మనాలి నుంచి మొదలెట్టింది. 480 కిలోమీటర్ల దూరాన్ని అక్టోబర్ 1న లేహ్‌లో ముగించింది. ఇలా ముగించడం సామాన్యం కాదు. ఇలా ముగించిన మహిళ గతంలో లేదు. అందుకే సూఫియా సాహసం గొప్ప స్ఫూర్తిదాయకం అయ్యింది. మనాలి సముద్ర మట్టానికి 6,700 అడుగుల ఎత్తు ఉంటుంది. లేహ్ 11, 500 అడుగుల ఎత్తు. ఈ రెండు ఎత్తుల మధ్య పరిగెత్తాలి. చలి ఈ దారిలో ఒక్కోసారి మైనస్ 5 డిగ్రీలు ఉంటుంది. ఆక్సిజన్ గాలిలో అరవై శాతమే ఉంటుంది. పెద్ద సవాలు. ‘అయినా నేను పరిగెత్తాను. దీనికి ముందు ఒక పదిహేను రోజులు ఈ పర్వతాల్లో క్యాంప్ వేసి ఇక్కడి వాతావరణానికి నా శరీరం అలవాటు పడేలా చేసుకున్నాను.’ అంది సూఫియా. ప్రాణాపాయం లెక్కచేయక మనాలి, లేహ్‌ల మధ్య రోడ్లు బాగుండవు. ఆ దారిలో వాహనాల్లో వెళుతున్నవాళ్లే ఆక్సిజన్ చాలక ఒక్కోసారి మరణిస్తారు. ‘నాక్కూడా ఆ దారిలో ఉండే గ్రామీణులు, ఆర్మీ వాళ్లు చాలా జాగ్రత్తలు, ప్రాణాపాయ పరిస్థితులు చెప్పారు. ప్రాణాయామం, యోగా వల్ల నా లంగ్స్‌ను గట్టి పరుచుకోవడం వల్ల నేను ధైర్యం చేశాను. కాని ఆ ధైర్యం చేయడం వల్ల ఎన్నో మనోహర దృశ్యాలు చూశాను. లడాఖ్ లోయ ముఖద్వారం ‘సర్చూ’, సింధూ నది ప్రవాహం, తంగ్లంగ్ లా పాస్... ఇవన్నీ జీవితంలో ఒక్కసారైనా చూడాలి’ అందామె. సూఫియాకు సపోర్ట్ టీమ్ ఉంటుంది. అది ఆమె వెంట ఉండి ఆ పరుగును, రాత్రి బసను ప్లాన్ చేస్తుంది. రెండుసార్లు గిన్నెస్‌బుక్‌లో ఎక్కిన సూఫియా తర్వాతి అంకం ‘ప్రపంచాన్ని పరుగుతో చుట్టి రావడమే’. ఆ రోజు కూడా బహుశా చూస్తాం. తథాస్తు. -
వైరల్: నలుగురు టూరిస్టులు కత్తులతో హల్చల్
మనాలి: నలుగురు టూరిస్టులు నడిరోడ్డుపై కత్తులతో హల్చల్ చేశారు. రోడ్డు మీద ఉన్న వాళ్లపై దాడి చేయడానికి యత్నించారు. ఈ ఘటన కులు జిల్లాలోని మనాలిలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు ఓ కారులో మనాలి బస్‌స్టాండ్ నుంచి రంగ్రీ ప్రాంతంలో ప్రయాణిస్తూ.. మరో వాహనాన్ని ఓవర్టేక్ చేశారు. అంతటితో ఆగకుండా తమ కారును నడిరోడ్డు మీద నిలిపి ట్రాఫిక్ జామ్‌కు పాల్పడ్డారు. ఇతర వాహనాలకు చెందినవారు కారును రోడ్డు మీద నుంచి వెంటనే తొలగించమనడంతో తమ వద్ద ఉన్న కత్తులతో వారిని బెదిరిస్తూ దాడికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. వారి దాడిలో ఒకరికి గాయాలు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన కులు జిల్లా ఎస్పీ గురుదేవ్ చంద్‌శర్మా మాట్లాడుతూ.. పంజాబ్‌లోని సంగ్రూర్ స్థానికులైన రవీందర్, దల్బీర్ సింగ్, అమన్‌దీప్ సింగ్, జస్రాజ్ను అదులోకి తీసుకొని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని ఆయన వెల్లడించారు. Manali Viral Video: One More Video Surfaces, See how a man carrying sword running around the People.#HimachalPradesh pic.twitter.com/kz5cYYRXvv — Ajay Banyal (@iAjay_Banyal) July 15, 2021 -
రెండో వేవ్ ముగియలేదు.. కాస్త తగ్గండి, ముందుంది అసలు కథ!
కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ తగ్గి లాక్డౌన్ ఎత్తివేయగానే.. ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు. ఒకవైపు ఉద్యోగాలు, చిరువ్యాపారులు నిత్యజీవితంలోకి అడుగుపెట్టారు. మరోవైపు సరదాల కోసం పాకులాడేవాళ్లు సైతం రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలో కొన్ని వీడియోలు, ఫొటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. మాస్క్‌లను మరిచి గుంపులుగా తిరుగుతున్న జనసందోహాన్ని చూసి ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. న్యూఢిల్లీ: తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూరిస్ట్ స్పాట్ మనాలిలో గుంపులుగా జనాలు తిరుగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కార్లు, మంచు రోడ్లపై వెహికిల్స్ క్యూ, ముస్సోరీ కెంప్టీ జలపాతం దగ్గర ఆదమరిచి ఆస్వాదిస్తున్న ఫొటోలు దర్శనమిస్తున్నాయి. సోషల్ డిస్టెన్స్ మాట పక్కనపెట్టినా.. అందులో మాస్క్‌లు లేన్నోళ్లే ఎక్కువ. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ పర్వం కొనసాగుతోంది. ‘మెంటల్ పీస్ కోసం పోతే.. రెస్ట్ ఇన్ పీస్ అయిపోతారు’ అని సెటైర్లు పేలుస్తున్నారు. ఈ తరుణంలో ‘యూరో 2020’ ప్రస్తావన తెస్తూ.. ఇకనైనా జాగ్రత్త పడాలని ప్రజలకు సూచిస్తోంది కేంద్ర ప్రభుత్వం. Tourists ‘watering down’ all #COVID19 norms at kempty Falls Mussorie … A steep fall straight into the ‘deep waters’ of #ThirdWave !#Covididiots #coronavirus #Covid #Mussorie Video- Scoopwhoop pic.twitter.com/LBruU0k3Xp — RAHUL SRIVASTAV (@upcoprahul) July 7, 2021 సగం జనాభాకి వ్యాక్సిన్, అయినా.. కిందటి ఏడాది జరగాల్సిన యూరో 2020 ఛాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఏడాది జరుగుతోంది. అయితే ఆశగా ఎదురుచూసిన లక్షల మంది సాకర్ కోసం.. గేట్లు తెరిచింది లండన్ వాంబ్లే స్టేడియం. నాకౌట్ టోర్నీల కోసం 2 లక్షల మంది ఫ్యాన్స్ స్టేడియంలో అడుగుపెట్టగా.. చివరి రెండు సెమీఫైనల్స్ కోసమే లక్షా 22 వేలమంది హాజరుకాగా, ఇక ఆదివారం జరగబోయే ఫైనల్ కోసమని 60 వేలమందికి అనుమతి దొరికింది. అయితే ఫ్యాన్స్‌ను పరిమిత సంఖ్యలో అనుమతించాలనే ఆలోచన చేస్తున్నారు నిర్వాహకులు. ఎందుకంటే.. బ్యాక్ టు బ్యాక్ వేవ్‌తో, ప్రమాదకరమైన వేరియెంట్లతో ఇంగ్లండ్‌పై విరుచుకుపడుతోంది కరోనా. జనవరి నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్న తరుణంలో.. ఆంక్షలు ఎత్తేశాక కేసులు నిదానిస్తూ వచ్చాయి. కానీ, యూరో 2020 మొదలయ్యాక కేసుల సంఖ్యలో స్వల్ఫంగా పెరుగుదల కనిపిస్తూ వస్తోంది. జులై 8న 30 వేల కేసులు(జనవరి నుంచి ఇదే హయ్యెస్ట్?!) నమోదు అయ్యాయి. ఇంగ్లండ్‌లో ఇప్పటికే 51.1 శాతం జనాభాకు పూర్తి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రపంచంలో ఇదే మెరుగైన వ్యాక్సినేషన్ రేటు కూడా. పైగా వ్యాక్సినేషన్ తీసుకున్న ఫ్యాన్స్‌నే స్టేడియంలోకి అనుమతించినట్లు ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. కానీ.. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. స్టేడియంలోకే కాదు.. స్టేడియం బయట ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. మాస్క్‌లు లేకుండా గుంపులుగా పార్టీలు చేస్తున్న దృశ్యాలు ప్రతీరోజూ కనిపిస్తున్నాయి. అయితే ఈ అత్యుత్సాహం-అభిమానం మధ్య చివరి మ్యాచ్ ఇంకెన్ని కేసులకు దారితీస్తోందో అనే ఆందోళనలో ఉండింది అక్కడి అధికార యంత్రాంగం. మరోవైపు డెల్టా వేరియెంట్.. కొనసాగింపుగా వస్తున్న వేరియెంట్ల ముప్పు తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తం అయ్యింది. యూరో సాకర్ అభిమానులు ‘సూపర్స్పెడ్రర్లు’గా మారే అవకాశం లేకపోలేదని, వాళ్లను నిశీతంగా పరిశీలించాలని ఇంగ్లండ్ ప్రభుత్వానికి సూచించింది. మరి మన పరిస్థితి.. మన దేశంలో జనాభా పరంగా ఇప్పటికే ఐదు శాతం జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి అయ్యింది. సింగిల్ డోసుల లెక్కలపై ప్రభుత్వ గణాంకాల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కొంటున్నాయి. పైగా మార్చి-మే మధ్యలో ఎన్నికలు, మహా కుంభమేళా నేపథ్యాలతో కేసులు పెరిగాయనే విమర్శలు ప్రభుత్వాలపై ఉండనే ఉన్నాయి. ఈ తరుణంలో మరోసారి విమర్శలను తట్టుకునే స్థాయిలో ప్రభుత్వం లేన్నట్లుంది. అందుకే గుంపులుగా జనాల కదలికలు, మూడో వేవ్ ముప్పు పొంచి ఉండడంతో అవగాహన ప్రచారాన్ని ముమ్మరం చేసింది కేంద్రం. ‘యూరో 2020 పరిస్థితులు చూస్తున్నాంగా. వాళ్లే భయపడుతున్నారు. మనం మరింత అప్రమత్తంగా ఉండాలి.మీరే కాదు.. మీ వల్ల అవతలి వాళ్లూ ఇబ్బందిపడతారని గుర్తించండి. మాస్క్‌లు ధరించండి.. జాగ్రత్తలు పాటించండి’ అనే సందేశంతో ప్రచారం నిర్వహిస్తోంది. అసలు కరోనా రెండో వేవ్ కథే ముగియలేదన్న ప్రభుత్వ ప్రకటన.. నెలకొన్న ఆందోళన స్థాయిని ప్రతిబింబిస్తోంది. ‘కరోనా యుద్ధం ఇంకా ముగియలేదు. అసలు రెండో వేవ్ ఉధృతే అయిపోలేదు. కొవిడ్ ప్రొటోకాల్‌ను జాగ్రత్తగా పాటిస్తేనే.. దానిని పూర్తిగా ఎదుర్కొగలిగిన వాళ్లం అవుతాం. సరదాలు కొంతకాలం వాయిదా వేసుకుంటే మంచిది. మాస్క్‌లు ధరించండి. ’’ అని అని కొవిడ్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ శుక్రవారం చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. -
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇల్లు చూసేద్దామా?
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌కు హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఓ ఇల్లు ఉన్న విషయం తెలిసిందే కదా! 30 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్న ఆమె అందులో సకల సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. 7 బెడ్రూంలు, 7 బాత్రూమ్లతో పాటు విశాలమైన హాల్ ఉన్న ఆ ఇంటి అద్దాల కిటికీలో నుంచి బయటకు చూస్తే హిమాలయాలు దగ్గరగా కనిపిస్తాయి. 2017లో ఇంటీరియర్ డిజైనర్ శబ్నం గుప్తా కంగనా ఇంటి బాధ్యతలను తన చేతుల్లోకి తీసుకున్నాడు. గృహంలోని ప్రతి భాగాన్ని కూడా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా పలు జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేపట్టాడు. ఈ ఇంద్రభవనంలోకి కంగనా 2018లో గృహప్రవేశం చేసింది. ఈ ఇంటికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట గింగిరాలు తిరుగుతున్నాయి. ఈ సందర్భంగా కంగనా ఇల్లు ఎలా ఉందో చూసేద్దాం.. ఇంటికి సమీపంలో పర్వతాలు కనువిందు చేస్తూ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వర్క్ షెడ్యూల్ నుంచి ఫ్రీ అవగానే తన అలసట హుష్ కాకి అయ్యేలా బెడ్రూమ్ను డిజైన్ చేశారు. హిమాలయాలను మంచు కప్పినట్లుగా ఈ బెడ్రూమ్లో తెలుపు రంగు డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. గోడల మీద స్వహస్తాలతో వేసిన పెయిటింగ్‌లు చూడముచ్చటగా కనిపిస్తాయి. అలాగే ఇంటి లోపల నుంచి ఉన్న మెట్లు కూడా ఏదో సాదాసీదాగా కాకుండా గ్రాండ్‌గా ఏర్పాటు చేయించారు. కంగనా ఎక్కువగా ఎక్కడికి షికారుకు వెళుతుందో ఆ ఏరియాకు సంబంధించిన ఫొటోలు గోడల మీద దర్శనమిస్తాయి. లివింగ్ రూమ్‌లో పుస్తకాలు నిండిన షెల్ఫ్‌లు దర్శనమిస్తాయి. ఏదైనా ఊసుపోనప్పుడు లేదా సాయంత్రం వేళ టీ తాగుతూ బుక్ చదువుకోవాలన్నా ఇదే పర్ఫెక్ట్ ప్లేస్. లివింగ్ రూం గుండా నడుచుకుంటూ వెళ్తే ఓ అద్దాల గది కనిపిస్తుంది. ఇందులో గోడలు, పై కప్పు అంతా అద్దాలమయమై ఉంటుంది. ప్రకృతి అందాలను తనివితీరా ఆస్వాదించేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. లివింగ్ రూమ్‌కు మరో పక్క ఆనుకుని ఉండేది బార్ గది. ఇందులో లైటింగ్ బాగుంటుంది. చదవండి: మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్ -
మంచుకొండల్లో కల తీర్చుకుంటున్న బాలీవుడ్ క్వీన్
హిందీ సినీ పరిశ్రమలో క్వీన్‌గా పేరొందిన కంగనా రనౌత్ వ్యాపార రంగంలోకి దిగారు. అది కూడా మంచుకొండల్లో సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టింది. తను పుట్టిన రాష్ట్రంలో తన కలను సాకారం చేసుకోనుంది. హిమాచల్ ప్రదేశ్‌లో కేఫ్, రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తన కల నెరవేరుతున్నందుకు ఆనందంగా ఉందని ట్వీట్ చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని సూరజ్‌పూర్‌కు చెందిన కంగనా రనౌత్ మహారాష్ట్రకు వచ్చి హిందీ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా నిలిచింది. క్వీన్‌గా మారేందుకు చాలా కష్టాలు పడింది. ఇప్పుడు బాలీవుడ్ ఐకాన్‌గా నిలుస్తోంది. ఎన్నో సినిమాలు, అవార్డులు పొందిన ఆనందం కన్నా తాను కలలు కన్న ప్రాజెక్టు ప్రారంభించడం ఆనందంగా ఉందని పేర్కొంది. ‘నా కలను నెరవేర్చుకోతున్న విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. నాకు సినిమాల తర్వాత ఎంతో ఇష్టమైన రంగం హోటల్ రంగం. ఈ రంగంలో తొలి అడుగు పడింది. మనాలీలో నా తొలి కేఫ్, రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నా. అందంగా తీర్చిదిద్దుతున్న నా బృందానికి కృతజ్ఞతలు’ అని కంగనా ఫొటోలు పంచుకుంటూ షేర్ చేసింది. Sharing my new venture my dream with you all,something which will bring us closer,other than movies my other passion food, taking baby steps in to FnB industry,building my first cafe and restaurant in Manali, thanks to my terrific team dreaming of something spectacular. Thanks 🙏 pic.twitter.com/AJT0NVPAV2 — Kangana Ranaut (@KanganaTeam) February 23, 2021 -
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్
ఫ్యాషన్ డిజైనర్ మనాలి జగ్తాప్ ఆఫ్ క్యాన్సర్ సర్వైవర్. ముంబైలో క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ కూడా డ్రెస్ డిజైనర్‌గా కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తూ, అవార్డులూ పొందుతోంది. ‘సంతోషంగా ఉండటం వల్లే వ్యాధిని ఓడించగలుగుతున్నాను’ అంటోంది మనాలి. ముంబయికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ మనాలి కిందటి సంవత్సరం క్యాన్సర్ చికిత్సలో భాగంగా 12 కెమోథెరపీలు చేయించుకున్నది. ఇప్పుడు ఆమె మరోసారి తన డిజైనింగ్ నైపుణ్యంతో ప్రజలను ప్రభావితం చేస్తోంది. క్యాన్సర్ రోగులందరికీ జీవితాన్ని వదులుకోకుండా ముందుకు సాగాలని మనాలి తన జీవితం ద్వారా నిరూపిస్తోంది. 2018 ఏప్రిల్‌లో తన గర్భాశయంలో ఏదో తేడా ఉందని మనాలికి అర్ధమైంది. ఈ కారణంగానే ప్రతి నెలా భారీగా రక్తస్రావం జరిగేది. ఆపరేషన్ చేసి, తన గర్భాశయాన్ని తొలగించాలని ఆమె డాక్టర్ని కోరింది. దీంట్లో భాగంగా బయాప్సీ టెస్ట్ చేయడంతో ఆమెకు క్యాన్సర్ ఉందని తేలింది. క్లినికల్ భాషలో, దీనిని ఎండోమెట్రియల్ స్ట్రోమల్ సార్కోమా అంటారు. ప్రతిరోజూ సంతోషంగా.. మనాలికి క్యాన్సర్ ఉందని కుటుంబంలో అందరూ భయపడ్డారు. అదే సమయంలో, ఆమె ఫ్యాషన్ షో కోసం దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ఆమె తల్లిదండ్రులు మనాలికి క్యాన్సర్ అనే విషయం ఆమెకు చెప్పకుండా దాచారు. కాని, వారి విచారకరమైన ముఖాలను చూడటంతో ఆమెకు తన స్థితిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. గతంలో మనాలి కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేదు. అందుకే, అది క్యాన్సర్‌కు దారి తీస్తుందని వారూ గుర్తించలేదు. తన చావో బతుకో ఏదైనా జరగవచ్చని మనాలికి తెలుసు. దీంతో బతికి ఉన్నన్నాళ్లూ తన కుటుంబంతో సంతోషంగా ఉంటూ జీవితాన్ని ఆస్వాదించాలనుకుంది. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా, ప్రతిరోజూ సంతోషంగా గడపాలని కోరుకుంది. ఈ అనారోగ్యం సమయంలో కూడా మనాలి తన ఆలోచనను సానుకూలంగా మార్చుకుంది. ముంబయ్‌లోని సహారా స్టార్ హోటల్లో ఇటీవల జరిగిన లోక్మత్ లైఫ్‌స్టైల్ ఐకాన్ 2020 అవార్డు వేడుకలో ఫ్యాషన్ డిజైనర్ ఐకాన్ 2020 అవార్డును అందుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మనాలి..‘కుటుంబం, స్నేహితులే నా బలం. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా క్యాన్సర్ నెమ్మదిగా చంపేస్తుంది. జుట్టు పోతుంది, అందం తగ్గుతుంది. అన్నీ తెలుసు. కానీ, మన కల మనల్ని బతికించాలి. లక్ష్యం వైపుగా ప్రయత్నించాలి అనుకున్నాను. అప్పుడే నన్ను నేను మార్చుకోవాలనుకున్నాను. విగ్గు పెట్టుకుంటాను, డిజైనర్ డ్రెస్సులు ధరిస్తాను. అలాగే సంతోషంగా నా జీవితాన్ని తిరిగి మొదలుపెట్టాను. ఇప్పుడు సమస్య లేదని అనను. కానీ, డిజైనర్‌గా నా పనిని నేను కొనసాగిస్తూనే ఉంటాను. ఫ్యాషన్ షోలలో పాల్గొంటాను. కెరియర్లో ఎదుగుతాను. మూడేళ్లుగా నా పనుల్లో ఎక్కడా అంతరాయం రాకుండా చూసుకున్నాను. క్యాన్సర్ పేషంట్స్‌కు రోగం పట్ల అవగాహన కల్గిస్తూ మరింత సంతృప్తిగా జీవిస్తాను’ అని తెలిపారు మనాలి. క్యాన్సర్ అనగానే బతుకు భయంతో కుంగిపాటుకు లోనయ్యేవారికి మనాలి చెప్పే మాటలు ఉత్తేజాన్ని నింపుతాయి. ఆమె జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. క్యాన్సర్ చికిత్స సమయంలో..; ఫ్యాషన్ డిజైనర్‌గా అవార్డు అందుకుంటూ.. -
విజయ్ వర్మ .. ఆన్ మిషన్
నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆఫీసర్ విజయ్ వర్మ తన టీమ్‌తో ఏదో మిషన్ మీద ఉన్నట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం మనాలీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. 20 రోజుల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అక్కడి రోహ్తంగ్ పాస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ ఆరంభమై ఇప్పటికి వారం అవుతోంది. -
ఏడు నెలల తర్వాత...
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఇటీవలే మొదలైంది. ఈ షూటింగ్లో జాయిన్ అయిన నాగార్జున అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయి ప్రేక్షకులతో తన ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘హాయ్.. ఇది రోహ్తంగ్ పాస్ (రోహ్తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇక్కడ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత (హైదరాబాద్) వచ్చేస్తాను. లవ్ యు ఆల్. సీ యు’’ అని పేర్కొన్నారాయన. ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్నారు. దియా మీర్జా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఎ¯Œ .ఎం. పాషా, జగన్మోహన్ వంచా, కెమెరా: షానీల్ డియో. -
అందుబాటులోకి అటల్ టన్నెల్
రోహ్తాంగ్: హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గా(టన్నెల్)న్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపో తుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దేశ భద్రతా ప్రయోజనాలపై రాజీ పడిందని దుయ్యబట్టారు. అటల్ సొరంగం, తేజాస్ యుద్ధ విమానాల తయారీ మొదలైన వాటిని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ‘మాకు దేశ భద్రతే అత్యంత ముఖ్యం. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. 26 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనిని మా ప్రభుత్వం ఆరేళ్లలో చేసింది. కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’అని మోదీ అన్నారు. అటల్ టన్నెల్‌గా పేరు మార్పు 2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ టన్నెల్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. సొరంగం విశేషాలు ► సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు. ► ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ. ► సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. ► భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది. -
ముంబైని వీడిన కంగన; కుక్క తోక వంకరే!
ముంబై: బాలీవుడ్ నటి కంగన రనౌత్‌ను ఉద్దేశించి శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నేక్ ఘాటు విమర్శలు చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన తన వ్యాఖ్యలను సమర్థించుకున్న ‘క్వీన్’తీరును తప్పుబట్టారు. ఈ మేరకు.. ‘‘ ఎంత ప్రయత్నించినా కుక్క తోకను సరిచేయడం ఎవరితరం కాదనే సామెత నాకు ఈరోజు బాగా అర్థమైంది’’అంటూ మరాఠీలో ట్వీట్ చేశారు. కంగన ముంబైని విడిచి వెళ్లిపోయిందని, గత వారం రోజులుగా ఆమెను సమర్థిస్తూ శివసేన ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ల ముఖాలు ఇప్పుడు మాడిపోయాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కూడా ఇంకా గట్టిగా అరవండి అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించారు. కాగా కంగన- శివసేనల మధ్య మాటల యుద్ధానికి దారితీసిన వివాదం చినికి చినికి గాలివానలా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు తీవ్ర స్థాయిలో పరస్పర విమర్శలకు దిగుతున్నాయి. (చదవండి: మనాలి చేరుకున్న కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్!) ఈ క్రమంలో సోమవారం ముంబైని వీడిన కంగన స్వస్థలం, హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చండీగఢ్ ఎయిర్‌పోర్టులో మాట్లాడుతూ.. ‘‘ఇది వరకు ముంబైలో అడుగుపెడితే కన్నతల్లిని తాకిన అనుభూతి కలిగేది. ఇప్పుడు మాత్రం అక్కడికి వెళ్లిన తర్వాత కూడా నేను బతికి ఉంటాననంటే అదృష్టంగా భావించాల్సిన పరిస్థితి తలెత్తింది. శివసేన సోనియా సేనగా మారిన వేళ ముంబై పాలన భయంకరంగా మారింది’’ అంటూ మండిపడ్డారు. అదే విధంగా.. ముంబైలో తనకు ఎదురైన అనుభవాలు తాను చేసిన పీఓకే వ్యాఖ్యలు సరైనవేనని నిరూపించేలా ఉన్నాయంటూ మరోసారి ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో శివసేన నేత ప్రతాప్ సర్నేక్ కంగనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో కంగనపై విచారణ జరిపించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈ విషయంపై దృష్టి సారించాల్సిందిగా మహా సర్కారు ముంబై పోలీసులను శుక్రవారం ఆదేశించింది. -
మనాలికి కంగన.. ‘సోనియా సేన’పై ఫైర్!
డెహ్రాడౌన్: బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్, శివసేన మధ్య తలెత్తిన రగడ ఇప్పట్లో చల్లారేలా కనపడటం లేదు. ఇరు వర్గాలు మాటల తూటాలతో పరస్పరం దాడికి దిగుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై కంగన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి సోనియాపై విమర్శలు ఎక్కుపెట్టారు. స్వస్థలానికి చేరుకున్న అనంతరం.. ‘‘ఈ ఏడాది ఢిల్లీ గుండె కోతకు గురైంది. అక్కడ రక్తం ప్రవహించింది. సోనియా సేన ముంబైలో ఆజాద్ కశ్మీర్ అని నినాదాలు చేస్తోంది, ఈ రోజు స్వేచ్చ ఉందని భావించగలిగే విషయం అంటే గొంతెత్తడం ఒకటే, నాకు మీ గొంతు ఇవ్వండి, లేదంటే స్వేచ్ఛ అంటే రక్తం చిందించడమే అవుతుంది’’అంటూ ట్విటర్ వేదికగా మండిపడ్డారు. గతేడాది దేశ రాజధాని ఢిల్లీలోని జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘర్షణలను వ్యతిరేకిస్తూ ముంబైలో.. ‘ఫ్రీ కశ్మీర్’ ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఈ సందర్భంగా కంగన ప్రస్తావించారు. (చదవండి: కంగనా రనౌత్‌కు బీఎంసీ మరో షాక్) బరువెక్కిన హృదయంతో మంబైని వీడుతున్నా శివసేన ఎంపీ సంజయ్ రౌత్- కంగనల మధ్య సోషల్ మీడియాలో చోటుచేసుకున్న వాగ్వాదం నేపథ్యంలో భారీ భద్రత నడుమ ఆమె బుధవారం ముంబైలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అప్పటికే పాలిలోని ఆమె కార్యాలయంలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వాటిని కూల్చివేశారు. అంతేగాక కంగనకు సంబంధించిన మరో నివాసం కూడా అక్రమ కట్టడం అని పేర్కొంటూ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీతో భేటీ అయిన ఆమె.. సోమవారం స్వస్థలం హిమాచల్ ప్రదేశ్‌కు పయనమయ్యారు. మనాలిలోని తన నివాసానికి చేరుకునే క్రమంలో.. ‘‘బరువెక్కిన హృదయంతో ముంబైని వీడుతున్నాను. నాపై వరుస దాడులు, వేధింపులు, నా ఇంటిని, ఆఫీసును కూల్చేందుకు జరిగిన ప్రయత్నాలు నన్ను భయాందోళనకు గురిచేసిన తీరు, నా చుట్టూ సాయుధులతో కల్పించిన భద్రత.. నేను పీఓకేతో పోల్చినట్లుగా అన్న మాటలు సరైనవేనని నిరూపించేలా ఉన్నాయి’’ అంటూ మరోసారి సంచలన ట్వీట్ చేశారు. ఇక కంగన ముంబైని వీడి వెళ్లడంపై స్పందించిన శివసేన నేత ప్రతాప్ సర్నాయక్.. ‘‘తనను సమర్థించిన వాళ్ల ముఖాలను కంగన నల్లముఖాలు చేసింది. తను వెళ్లిపోయింది.. ఇప్పుడు అరవండి.. జై మహారాష్ట్ర’’అని పేర్కొన్నారు. (కంగన వెనుక ప్రధాని నరేంద్ర మోదీ!) -
కంగనా నివాసానికి ఐబీ, పోలీసు అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ నటి కంగనా రనౌత్ ఈనెల 9న ముంబై పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల (సీఆర్పీఎఫ్) డిప్యూటీ కమాండెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), హిమాచల్‌ప్రదేశ్ పోలీసు అధికారులు మనాలీలోని ఆమె నివాసాన్ని మంగళవారం సందర్శించారు. శివసేన నుంచి బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పించడంతో కంగనా ఇంటి వద్ద పోలీస్ బృందాలను మోహరించారు. చదవండి : ‘క్వీన్’కు కేంద్రం రక్షణ! ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)తో పోల్చుతూ కంగనా చేసిన ప్రకటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అభ్యంతరంతో ఇరువురి మధ్య వివాదం ముదిరిన సంగతి తెలిసిందే. ఈనెల 9న ముంబైలో అడుగుపెడతానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని కంగనా సవాల్ విసిరారు. కాగా హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బాలీవుడ్ క్వీన్‌కు బాసటగా నిలిచారు. కంగనా రనౌత్ హిమాచల్‌ప్రదేశ్ ముద్దుబిడ్డని వ్యాఖ్యానించారు. కంగనా భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆమె తండ్రి తనకు లేఖ రాసిన మీదట దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరానని తెలిపారు. మనాలీలో ఆమె ఇంటివద్ద పోలీస్ టీమ్‌ను నియమించామని చెప్పారు. -
కంగనా ఇంటి వద్ద కాల్పుల కలకలం
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇంటి వద్ద తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడం కలకలం రేకెత్తించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో కంగనా తన సొంతింట్లో ఉన్నపుడు శుక్రవారం రాత్రి పదకొండున్నరకు తుపాకీ చప్పుళ్ళు వినిపించడంతో పోలీసులకు సమాచార మిచ్చారు. దీంతో వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ కాల్పులకు కారణాలేమిటో తెలియరాలేదు. అయితే ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో తాను ఇచ్చిన స్టేట్మెంట్తో, తనను భయపెట్టేందుకే ఇలా చేసి ఉంటారని కంగనా అభిప్రాయపడ్డారు. ఇటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. కావాలనే కాల్పులు జరిపారనీ, తన గదికి ఎదురుగా ఉన్న సరిహద్దు గోడకి ఆవల ఎవరో ఉన్నట్లు అనిపించిందని ఆమె చెప్పారు. మరోవైపు, సుశాంత్æ ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ రియాచక్రవర్తిపై పట్నాలో నమోదైన కేసుని ముంబైకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో రియాచక్రవర్తి దాఖలుచేసిన పిటిషన్ ఆగస్టు 5న విచారణకు రానుంది. పట్నాలో నమోదైన కేసు విచారణ కోసం బిహార్ పోలీసు బృందం ముంబైకి చేరుకుంది. -
కంగనా రనౌత్ ఇంటివద్ద కాల్పుల కలకలం
సాక్షి, ముంబై: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ఇంటివద్ద శుక్రవారం అర్థరాత్రి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. మనాలీలోని కంగనా నివాసం సమీపంలో తుపాకీ శబ్దాలు వినిపించటంతో ఆమె పోలీసులకు సమాచారం అందించారు. నటుడు సుశాంత్ సింగ్ మరణం తరువాత బాలీవుడ్ తీరుతెన్నులపై విమర్శలు గుప్పిస్తున్నకంగనా ముఖ్యమంత్రి కుమారుడిని ‘‘బేబీ పెంగ్విన్’’అని సంబోధిస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన తరువాత రోజు ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆమె అభిమానుల్లో ఆందోళన రేపుతోంది. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్ ) ఈ ఘటనపై నటి కంగనా రనౌత్ ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం రాత్రి 11.30 గంటలకు పెద్ద శబ్దం వినిపించిందని, వెంటానే తాను తన సెక్యూరిటీ ఇన్‌ఛార్జిని పిలిచినట్లు తెలిపారు. అయితే, ఆపిల్ తోటల్లో గబ్బిలాలను భయపెట్టడానికి ఎవరైనా తుపాకీతో కాల్పులు జరిపి ఉంటారని పోలీసులు అనుమానించారని కానీ పొరుగువారిని అడిగినప్పుడు, వారు దీన్ని ఖండించారని వెల్లడించారు. ఎనిమిది సెకన్ల వ్యవధిలో రెండు షాట్లను విన్నాననీ, తుపాకీ కాల్పులు ఎలా ఉంటాయో తనకు తెలుసంటూ ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. (కంగన రనౌత్ సంచలన వ్యాఖ్యలు) స్థానికుల ద్వారా తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, కేవలం ఏడు, ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఇలాంటి చేయించడం ముంబైలో పెద్ద కష్టమేమీ కాదని కంగనా వ్యాఖ్యానించారు. అంతేకాదు బహుశా సుశాంత్ ను కూడా ఇలాగే భయపెట్టి ఉంటారని పేర్కొన్నారు. అయినా తాను భయపడేది లేదని ప్రశ్నిస్తూనే ఉంటానని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కొడుకు గురించి వ్యాఖ్యలు చేసిన తర్వాత తనను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కంగనా అభిప్రాయపడ్డారు. తన ఫిర్యాదు మేరకు బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారని కంగనా తెలిపారు.