
కార్తీ
తాజా చిత్రం ‘దేవ్’ కోసం ఫుల్ స్పీడ్‌తో రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు కార్తీ అండ్ టీమ్. ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్’. మనాలీలో వచ్చిన వరదల వల్ల ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆగిపోయిన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారట. అలాగే ఎవరెస్ట్ శిఖరం దగ్గర కొంత భాగం షూట్ చేయనున్నారట చిత్రబృందం. ‘‘మనాలీతో పాటు ఎవరెస్ట్ శిఖరం దగ్గర్లో, నేపాల్ వంటి మంచు ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment