Dev
-
ఇంట్లో నుంచే ‘దేవ్ దిపావళి’ని చూడండిలా..
వారణాసి: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో నవంబర్ 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవ్ దీపావళి వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆరోజు దశాశ్వమేధ ఘాట్‌లో అత్యంత వైభవంగా జరిగే గంగా హారతిని చూసేందుకు దేశవిదేశాల నుంచి లక్షలాదిమంది తరలిరానున్నారు.ఈసారి దేవ్ దీపావళికి కాశీకి వెళ్లలేనివారు ఇంట్లో కూర్చొని గంగాహారతిని, దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. తొలిసారిగా దేవ్ దీపావళి నాడు జరిగే గంగా హారతి వేడుకలు ‘గంగా సేవా నిధి’ వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఢిల్లీ నుంచి ఈ వేడుకలను వీక్షించనున్నారు.గంగా సేవా నిధి వెబ్‌సైట్‌ను నవంబర్ 15న ప్రారంభిస్తున్నామని గంగా సేవా నిధి అధ్యక్షుడు సుశాంత్ మిశ్రా తెలిపారు. విదేశాలలోని వారు కూడా gangasevanidhi.in వెబ్సైట్ ద్వారా దేవ్ దీపావళి వేడుకలను వీక్షించవచ్చు. గంగా హారతి సందర్భంగా ‘ఏక్ సంకల్ప్ గంగా కినారే’ పేరుతో కార్యక్రమానికి హాజరయ్యే లక్షలాది తాము గంగా నదిని పరిశుభ్రంగా ఉంచుతామని, పర్యావరణాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేయనున్నారు.నవంబర్ 15న దశాశ్వమేధ ఘాట్‌లో 21 మంది పండితులు వైదిక ఆచారాల ప్రకారం భగవతీ దేవికి పూజలు నిర్వహిస్తారు. దేవ్ దీపావళి వేళ వారణాసిలోని 84 ఘాట్లను దీపాలతో అందంగా అలంకరించనున్నారు. పురాణాల ప్రకారం త్రిపురాసురుని దౌర్జన్యాల నుంచి దేవతలు విముక్తి పొందిన సందర్భంలో, వారు శివుని నివాసమైన కాశీ నగరానికి వచ్చి దీపాల పండుగను జరుపుకున్నారు. నాటి నుంచి ప్రతియేటా ఇక్కడ దేవ్ దీపావళి వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
‘దీనమ్మ జీవితం’ ఎలా ఉందంటే..
టైటిల్: దీనమ్మ జీవితం నటీనటులు: దేవ్, ప్రియ చౌహాన్, సరిత..తదితరులు నిర్మాతలు: వై. మురళి కృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా రచన, దర్శకత్వం: మురళి రామస్వామి సంగీతం: ఆర్ ఎస్ ఎడిటర్: జానీ బాష విడుదల తేది: జనవరి 5, 2024 కథేంటంటే.. క్రిష్ అలియాస్ కృష్ణ(దేవ్ బల్లాని)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా గొప్ప దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. భార్య రాధ (ప్రియా చౌహాన్), ఓ కూతుర్ని పట్టించుకోకుండా సినిమాల్లో డైరెక్షన్ అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి మహి అలియాస్ మహిమ (సరిత చౌహాన్) తో వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. మహిమ మాయలో పడి భార్యతో తరచు గొడవ పడుతుంటాడు. కెరీర్ పరంగా కూడా సెటిల్ అవ్వలేకపోతాడు. ఇక తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న రాధ.. ఎలాగైన అతన్ని దారికి తెచ్చి సంసారాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటుంది. క్రిష్ కూడా మహిని వదిలించుకొని భార్య పిల్లలతో కలిసి ఉండాలని భావిస్తాడు. అయితే మహి మాత్రం క్రిష్‌ని వదిలిపెట్టదు. మరి మహిని వదిలించేందుకు క్రిష్ ఏం చేశాడు? అసలు క్రిష్‌కి మహి ఎలా పరిచయం అయింది? రాధతో క్రిష్ పెళ్లి ఎలా జరిగింది? భర్తను కాపాడుకోవడం కోసం రాధ ఏం చేసింది? చివరకు క్రిష్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. అన్యోన్యంగా ఉండే ఇద్దరు భార్యా భర్తల మధ్య మరో ఆమ్మాయి ఎంటర్ అయితే ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది? దాని వల్ల కెరీర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది? అనేది కాస్త బోల్డ్‌గా, రాగా ఈ చిత్రలో చూపించారు. కథనం కామెడీగా సాగినా..ఓ మంచి మెసేజ్‌ని ఇచ్చే ప్రయత్నం చేశారు. క్షణిక సుఖం కోసం పెళ్లైన ఓ వ్యక్తి వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు మురళి స్వామి. ఫస్టాఫ్ లో బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి... సెకండ్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ చూపించి పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. అయితే కొన్ని సన్నివేశాలు, సంభాషనలు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని బోల్డ్ సీన్స్ యానిమల్ సినిమాని తలపిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా..కెరీర్ లో స్టిరపడాలనుకునే అప్ కమింగ్ డైరెక్టర్ క్రిష్‌గా వేవ్ బల్లాని చక్కగా నటించాడు. మహి పాత్రలో సరిత చౌహాన్ బోల్డ్ రొమాన్స్ చేసి యూత్ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. గృహిణి పాత్రలో ప్రియా చౌహాన్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది. పరాయి అమ్మాయి మోజులో దారి తప్పిన భర్తను ఎలా దారికి తెచ్చుకునే ఓ సిన్సియర్ గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు.. ఐటెం సాంగ్ యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు బాగున్నాయి. -
వదంతులు ప్రచారం చేస్తున్నారు : రకుల్
తనను ఎవరూ అడ్డుకోలేరు అంటోంది నటి రకుల్ ప్రీత్‌సింగ్. సినిమా ఎవరిని ఎప్పుడు ఉన్నత స్థాయికి తీసుకెళుతుందో, ఎవరిని ఎప్పుడు కింద పడేస్తుందో తెలియదు. ఇవాళ అవకాశాలు లేని వారు రేపు చేతినిండా చిత్రాలతో బిజీ అవ్వొచ్చు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ పరిస్థితి ఇప్పుడు అలానే ఉంది. ఈ అమ్మడు మొదట్లో కోలీవుడ్‌లో ఐరన్లెగ్గా ముద్ర వేసుకుంది. కానీ టాలీవుడ్లో సక్సెస్ అయ్యింది. వరుస పెట్టి యంగ్ స్టార్స్‌తో నటించేసింది. అంతే టాప్ హీరోయిన్ ఇమేజ్ను తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తో మళ్లీ కోలీవుడ్‌లో పాగా వేసింది. తాజాగా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఫ్లాప్‌లు వెంటాడాయి. ముఖ్యంగా తమిళంలో కార్తీతో రెండోసారి రొమాన్స్ చేసిన దేవ్ చిత్ర ఫ్లాప్ ఆమె కెరీర్‌కు పెద్ద ఎఫెక్ట్ అయ్యింది. దీంతో కొత్త అవకాశాలేమీ రకుల్‌ప్రీత్‌సింగ్ దరిదాపులకు కూడా రావడం లేదు. ప్రస్తుతం సూర్య సరసన నటించిన ఎన్జీకే చిత్రం, శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న మరో చిత్రాలనే నమ్ముకుంది. అంతే కాదు టాలీవుడ్లో ఫ్లాప్‌ల కారణంగా అంగీకరించిన చిత్రాలు కూడా చేజారుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రకుల్‌ప్రీత్‌సింగ్ పారితోషికం పెంచిందనే ప్రచారం హల్చల్ చేస్తోంది. అయితే రకుల్‌ప్రీత్‌సింగ్ మాత్రం ఇలాంటి ప్రచారాన్ని పట్టించుకోనక్కర్లేదు అంటోంది. దీని గురించి తను చెబుతూ తన గురించి ఎన్ని కట్టుకథలను ప్రచారం చేసినా తన ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరని పేర్కొంది. బహు భాషా నటిగా రాణిస్తున్న ఈ అమ్మడు తమిళం, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ నటిస్తోంది. అక్కడ అక్షయ్‌కుమార్‌కు జంటగా ఒక చిత్రంలో నటిస్తోంది. మూడు భాషల్లో నటించే అతి కొద్ది మందిలో తాను ఒకరిని కావడం సంతోషంగా ఉందని రకుల్‌ప్రీత్‌సింగ్ అంది. అయితే తన ఎదుగుదలను అడ్డుకోవడానికి కొందరు సామాజిక మాధ్యమాల్లో వదంతులు ప్రచారం చేస్తున్నారని ఆరోపించింది. అలాంటి వారి ప్రయత్నాలు ఫలించవని, అయినా అలాంటి తప్పుడు ప్రచారం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంది. తాజాగా ఈ అమ్మడికి తెలుగులో నాగార్జునకు జంటగా మన్మథుడు 2 చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టిందన్న టాక్ వినిపిస్తోంది. -
రకుల్‌కు గట్టి షాక్!
అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్టా. ఏంటీ ఆ పాత మధుర గీతాల గురించి చెబుతున్నట్లు భావిస్తున్నారా? అంత సాహసం చేయడం లేదు గానీ, నటి రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఇలాంటి షాకే కొట్టిందట. అదీ తనే కోరి తగిలించుకున్న షాక్. రకుల్ ప్రీత్‌సింగ్ స్టార్ హీరోయిన్. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ అమ్మడు కార్తీతో రొమాన్స్ చేసిన దేవ్ చిత్రం తెరపైకి వచ్చింది. తదుపరి సూర్యకు జంటగా నటించిన ఎన్జీకే చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మరో అరడజను చిత్రాల్లో నటిస్తోందట. అయితే అంత మాత్రాన ఈ బ్యూటీకి షాక్ తగలకూడదనేం లేదు. అదే జరిగింది. ఆ విషయం గురించి రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక ఇంటర్వూ్యలో పేర్కొంటూ ఆ మధ్య ఒకసారి నా స్నేహితులతో కలిసి లండన్ వెళ్లాను. అక్కడ ఒక స్టార్ హోటల్లో స్నేహితులందరికీ పార్టీ ఇచ్చాను. పార్టీ అంటే విందు మాత్రమే. మేము 10 మందే. బిల్ ఎంత అయి ఉంటుందని అనుకుంటున్నారు? అక్షరాలా రూ.10 లక్షలు. ఏంటీ షాక్ అయ్యారా? నేను అంతకంటే పెద్ద షాక్‌కు గురయ్యాను. ఏం చేస్తాను. మాట్లాడకుండా ఆ మొత్తాన్ని చెల్లించి బయటపడ్డాను. అప్పుడు అనుకున్నాను. జీవితంలో మళ్లీ ఆ హోటల్‌కు వెళ్లకూడదని అని ఒట్టేసుకున్నాను. అలా ఫ్రెండ్స్‌కు ట్రీట్ ఇద్దామని అనుకుని తనే షాక్ తిందట రకుల్ ప్రీత్‌సింగ్. జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎవరికైనా తప్పవు మరి. -
‘దేవ్’ మూవీ రివ్యూ
టైటిల్ : దేవ్ జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : కార్తి, రకుల్ ప్రీత్ సింగ్, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ సంగీతం : హారిస్ జయరాజ్ దర్శకత్వం : రజత్ రవిశంకర్ నిర్మాత : ఎస్ లక్ష్మణ్ కుమార్, బి. మధు కోలీవుడ్ హీరో అయినా తెలుగులో కూడా కార్తికి మంచి మార్కెట్ ఉంది. ముఖ్యంగా తెలుగులో తన సినిమాను ప్రమోట్ చేయటం విషయంలో కార్తి ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటాడు. అందుకే కార్తి ప్రతీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. అదే బాటలో తాజాగా దేవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తి. చినబాబు సినిమాలో ఊరమాస్ లుక్‌లో కనిపించిన కార్తి, ఈ సారి స్టైలిష్ లుక్‌లో దేవ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రజత్ రవిశంకర్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది. కథ : దేవ్ రామలింగం (కార్తి)కి సాహసాలు చేయటం అంటే ఇష్టం. ఎప్పటికైనా ఎవరెస్ట్‌ను ఎక్కాలని కలలు కంటుంటాడు. ఎప్పుడూ ట్రావెల్ చేస్తూ ఏదో ఒక సాహసం చేస్తూనే ఉంటాడు. అంతేకాదు తనతో పాటు చిన్ననాటి స్నేహితులు విఘ్నేష్, నిషాలను కూడా ప్రతీ చోటికి వెంట తీసుకెళుతుంటాడు. దేవ్ చేసే సాహసాలకు బ్రేక్ వేయాలంటే తనని ప్రేమలో పడేయాలని భావించిన విఘ్నేష్, నిషా ఫేస్బుక్ ప్రొఫైల్స్ చూసి ఓ అమ్మాయి సెలెక్ట్ చేసి ప్రేమించమని దేవ్‌కు సలహా ఇస్తారు. అలా ఫేస్బుక్ చూస్తుండగా కనిపించిన మేఘ్న పద్మావతి(రకుల్ ప్రీత్ సింగ్)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు దేవ్. మేఘ్న, పాతికేళ్ల వయసులోనే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమ్మాయి. తన తల్లి జీవితంలో జరిగిన సంఘటనల కారణంగా మగాళ్ల మీద ద్వేశం పెంచుకొని డబ్బు సంపాదించటమే జీవిత లక్ష్యంగా నిర్ణయించుకుంటుంది. ప్రతీది తన వైపు నుంచి, స్వార్థంతో ఆలోచించే మేఘ్నను, జీవితంలో చేసే ప్రతీ పనిలోనే అడ్వంచర్ ఉండాలని భావించే దేవ్ ఎలా ప్రేమలో పడేశాడు.? వారి ఇద్దరి ప్రయాణంలో ఎదురైన సమస్యలేంటి..? అన్నదే మిగతా కథ. నటీనటులు : దేవ్ పాత్రలో కార్తి నటన బాగుంది. తనదైన నేచురల్ పర్ఫామెన్స్తో పాటు స్టైలిష్ లుక్‌లోనూ ఆకట్టుకున్నాడు. డ్యాన్స్‌లు, యాక్షన్స్ సీన్స్‌లో మరింతగా మెప్పించాడు. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. మేఘ్న పాత్రలో రకుల్ ఆకట్టుకోలేకపోయింది. చాలా సన్నివేశాల్లో రకుల్ నటన కాస్త అతిగా అనిపిస్తుంది. లుక్స్ పరంగా మాత్రం రకుల్‌కు మంచి మార్కులు పడతాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటులు ఉన్న వాళ్లకు పర్ఫామెన్స్‌కు పెద్దగా అవకాశం లేదు. కేవలం ఒకటి రెండు సీన్స్‌కు మాత్రమే పరిమితమయ్యారు. వారి పాత్రలకు వేరే వారితో చెప్పించటంతో ఆ పాత్రలు మరింతగా తేలిపోయాయి. హీరో ఫ్రెండ్స్‌గా కనిపించిన విఘ్నేష్, అమృతలు అక్కడక్కడా కాస్త నవ్వించే ప్రయత్నం చేసినా వారి పాత్రలు కూడా ఆకట్టుకునే స్థాయిలో లేవు. విశ్లేషణ : దేవ్ కథలో రొమాన్స్, అడ్వంచర్, ఫ్రెండ్షిప్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉండేలా తయారు చేసుకున్న దర్శకుడు.. ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో తడబడ్డాడు. ముఖ్యంగా దేవ్ కోసం రజత్ ఎంచుకున్న కథనం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసేలా లేదు. క్యారెక్టరైజేషన్స్ ఆసక్తికరంగా లేకపోవటంతో పాటు రొమాంటిక్ సన్నివేశాలు కూడా పెద్దగా వర్క్ అవుట్ కాకపోవటంతో సినిమా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దర్శకుడు.. కథ, పాత్రల స్వభావాల మీద కన్నా లుక్స్, రిచ్‌నెస్, లొకేషన్స్ మీదే ఎక్కువగా దృష్టిపెట్టినట్టుగా అనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ డ్రాబ్యాక్ మ్యూజిక్. హారిస్ జయరాజ్ అందించిన పాటలతో పాటు నేపథ్యం సంగీతం కూడా నిరాశపరుస్తుంది. వేల్రాజ్ సినిమాటోగ్రఫి సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్. ప్రతీ ఫ్రేమ్‌ను తెర మీద అందంగా, రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి లొకేషన్స్ మైనస్ పాయింట్స్ : స్క్రీన్‌ప్లే సంగీతం క్యారెక్టరైజేషన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ఆ ప్రశ్నే లేదంటున్న రకుల్
అన్నదమ్ములిద్దరిలో ఎవరూ బెస్ట్ యాక్టరో చెప్పమంటే.. అసలు అలాంటి ప్రశ్నకు తావే లేదంటున్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తమిళంలో కార్తీతో నటించిన ‘దేవ్’ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం విడుదల కానుంది. అదేవిధంగా సూర్యతో జత కట్టిన ‘ఎన్జీకే’ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదల అవుతుండటంతో డబుల్ హ్యాపీగా ఉన్నాను అంటున్నారు రకుల్. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హిందీలో అజయ్‌దేవ్‌గన్ చిత్రంలో నటిస్తున్నాను. ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం చాలా బాగుంది. అలానే ఒకేసారి అన్నదమ్ములు సూర్య, కార్తీలతో నటించడం మంచి అనుభవం. వారితో కలిసి పని చేయడం జాలీగా ఉంది. వారిద్దరిలో ఎవరు ఉత్తమ నటులు అన్న ప్రశ్నకు తావు లేదు. ఇద్దరూ పాత్రలకు ప్రాణం పోయడానికి శ్రమిస్తార’ని చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్. -
దూకిన తర్వాత భయం వేసింది
‘‘ఈ ప్రేమికుల రోజుకి ప్రత్యేకం అంటూ ఏం లేదు. తొలిసారి మా అమ్మానాన్నలు, ఫ్యామిలీతో కలిసి ప్రేమికుల రోజున (గురువారం) నేను నటించిన ‘దేవ్’ సినిమాను హైదరాబాద్‌లో చూడబోతున్నా. అదే ఈ ప్రేమికుల రోజు ప్రత్యేకం’’ అని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. కార్తీ, రకుల్ జంటగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవ్’. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ‘ఠాగూర్’ మధు ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ∙ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే అందమైన కథ ‘దేవ్’. ఇందులో స్త్రీవాద భావాలున్న మేఘన పాత్రలో నటించా. ప్రేమించడానికి టైమ్ లేదంటూ పనే ప్రపంచంగా ఉంటుంది మేఘన. తన తల్లిని ఓ వ్యక్తి ప్రేమించి మోసం చేయడంతో చిన్నప్పటి నుంచి ప్రేమపై మంచి అభిప్రాయం ఉండదు. అలాంటి భావాలున్న మేఘనని దేవ్ ప్రేమిస్తాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న వ్యక్తులు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందన్న సంఘర్షణే ఈ సినిమా. ఇందులో కార్తీ సాహస యాత్రలు చేసే యువకుడిగా కనిపిస్తారు. ∙నిజ జీవితంలో సాహసాలను ఇష్టపడతా. ఇటీవల దుబాయ్‌లో 15వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవింగ్ చేశా. విమానంలోనుంచి దూకేశాక ప్యారాచూట్ ఓపెన్ కాకుంటే పరిస్థితి ఏంటి? బతుకుతామా? లేదా? చాలా సినిమాలు ఒప్పుకున్నా అనిపించింది (నవ్వుతూ). స్కై డైవింగ్ విషయం ముందే ఇంట్లో చెబితే అమ్మానాన్నలు భయపడతారని చెప్పలేదు. విషయం చెప్పి, వీడియో పోస్ట్ చేశా. ∙తెలుగులో చేస్తున్న ‘వెంకీమామ’ సినిమా షూటింగ్ ఈ వారం ప్రారంభం కానుంది. ఈ ఏడాది నావి ఐదారు సినిమాలు రిలీజవుతాయి. ప్రేమికుల దినోత్సవం అనేది విదేశీ సంస్కృతి. అందుకే నాకు నమ్మకం లేదు. అయినా ప్రేమకు ఒక్క రోజు కేటాయించడం ఏంటి? బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం ఏంటి? ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అవుతుంది. ఒక్కరోజులో ప్రేమ వస్తుందనుకోను. ప్రేమ అన్నది లవర్‌తో, జీవిత భాగస్వామితో మాత్రమే కాదు. తల్లితండ్రులు, సోదరులు, సోదరీమణులు, ఫ్రెండ్స్.. ఇలా అందరిదీ ప్రేమే కదా. -
మళ్లీ సక్సెస్‌మీట్‌లో కలుస్తా
‘‘ప్రజెంట్ జనరేషన్ మూవ్ అవుతున్న జోనర్లో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘దేవ్’ సినిమా ఇప్పటి జనరేషన్ వారికి సరిగ్గా సూట్ అవుతుంది. ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే అందమైన కథ. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు’’ అని కార్తీ అన్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దేవ్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ‘ఠాగూర్’ మధు సొంతం చేసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘దేవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ మాట్లాడుతూ– ‘‘రెండు వేర్వేరు ఆలోచనలున్న వ్యక్తుల ప్రేమకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా కథ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడిన పాట సినిమాకే హైలైట్. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నా. మళ్లీ సక్సెస్ మీట్లో మీ అందర్నీ(ప్రేక్షకులు) కలుస్తా’’ అన్నారు. ‘‘అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ , యాక్షన్... ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది’’ అన్నారు రజత్ రవిశంకర్. ‘‘కార్తీలాంటి హీరోతో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా చేసినందుకు హ్యాపీ. రజత్ ఏం చెప్పాడో స్క్రీన్‌లో అదే చూపించాడు’’ అని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు మేఘన. స్వతంత్ర భావాలున్న పవర్ఫుల్ అమ్మాయి పాత్ర. మీ అందరికీ నా పాత్ర నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది’’ అని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. -
‘దేవ్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక
-
అలాగైతే ముందుకెళ్లలేం!
అలాగైతే ముందుకెళ్లలేం అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. తను నటించిన రెండు చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవుతుండడంతో ఈ అమ్మడు చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తోంది. అందులో ఒకటి దేవ్. నటుడు కార్తీతో రెండవ సారి జత కట్టిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత సూర్యతో రొమాన్స్ చేసిన ఎన్జీకే సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. ఈ రెండు చిత్రాల్లో నటించడం చాలా మంచి అనుభవం అంటున్న రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక ఇంటర్వ్యూలో దేవ్ చిత్రం గురించి తెలుపుతూ ఇదో ఎడ్వెంచర్ కథా చిత్రం అని తెలిపింది. అదే విధంగా ఈ సినిమాతో పాటే ఎన్జీకే చిత్రంలోనూ నటించినట్లు తెలిపింది. ఈ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్, దేవ్ చిత్ర దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం అని చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే మనం కథను నమ్మి కష్టపడి నటిస్తామో అప్పుడు ఇక ఇతర విషయాల గురించి చింతించాల్సిన అవసరం లేదని అంది. కథలను ఎలా ఎంచుకుంటారన్న ప్రశ్నకు బదులిస్తూ నిజం చెప్పాలంటే ప్రారంభ దశలో కథలను ఎలా ఎంపిక చేసుకోవాలో తనకు అసలు తెలిసేది కాదని చెప్పింది. చిన్నతనంలో తాను సినిమాలే చూసేదాన్ని కాదని, హైస్కూల్లో చదువుకుంటున్నప్పుడే చిత్రాలను చూడడం మొదలెట్టానని చెప్పింది. ఎప్పుడైతే సినిమాల్లో నటించడానికి వచ్చానో అప్పటి నుంచే సినిమా రంగం గురించి తెలుసుకోవడం ప్రారంభించానని చెప్పింది. కాగా తాను ఇక్కడ తెలుసుకుందేమిటంటే ప్రారంభ దశను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక ముందుకు సాగలేవన్నదని అంది. ఇప్పుడు తనకేం కావాలో అర్థమైందని, చేసిన తప్పులు తెలుసుకోవడంతో పాటు, ఏం కావాలో తెలుసుకున్నానని చెప్పింది. ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసుకునే పరిపక్వత వచ్చిందని అంది. దీంతో తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటున్న రకుల్‌ప్రీత్‌సింగ్ కోసం మరిన్ని బిగ్ చాన్స్ కోలీవుడ్‌లో ఎదురుచూస్తున్నాయట. -
‘దేవ్’ మూవీ స్టిల్స్
-
విడుదలైన ‘దేవ్’ ట్రైలర్
ఖాకీ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ, రకుల్ ప్రీత్ మరోసారి ‘దేవ్’ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ టీజర్, పోస్టర్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీగా ఉంది. ఈ చిత్ర ట్రైలర్‌ను కాసేపటి క్రితమే హీరో సూర్య రిలీజ్ చేశారు. అడ్వెంచర్స్ ఇష్టపడే వ్యక్తి..ప్రేమలో పడటం.. ఫ్యామిలీ ఎమోషన్స్.. వీటన్నంటిలో అతనేం సాధించాడనే కథాంశంతో తెరకెక్కిన దేవ్.. ప్రస్తుతం టీజర్‌తో ఆకట్టుకుంటోంది. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి హారిష్ జయరాజ్ సంగీతాన్ని సమకూర్చారు. రజత్ రవిశంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమికుల రోజున(ఫిబ్రవరి 14) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. -
లవర్స్ డేకి దేవ్
‘ఖాకి’ వంటి సూపర్ సక్సెస్ మూవీతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్. తాజాగా వారిద్దరూ కలిసి నటించిన చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ‘ఠాగూర్’ మధు సొంతం చేసుకున్నారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘ఠాగూర్’ మధు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. హారిస్ జయరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయగా విశేష స్పందన లభించింది. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ పవర్ఫుల్ రోల్స్‌లో నటచారు. నిక్కీ గల్రాని మరో కథానాయికగా చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఫిబ్రవరి 14న సినిమా విడుదల చేస్తున్నాం’’ అన్నారు. కార్తీక్ ముత్తురామన్, ఆర్.జె. విఘే ్నష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఆర్. వేల్రాజ్, బ్యానర్స్: ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌస్ మూవీ మేకర్స్, రిలయన్స్ ఎంటరై్టన్మెంట్. -
ప్రేమికుల రోజున రాబోతోన్న ‘దేవ్’
‘ఖాకీ’ సినిమాతో హిట్ కొట్టిన కార్తీ, రకుల్ ప్రీత్ జోడి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బైక్ రేసర్‌గా కార్తీ నటిస్తున్న ‘దేవ్’ మూవీ టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఓ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రొమాంటిక్ ఎంటర్టైన్గా రాబోతోన్న ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోసారి ఈ జంట మ్యాజిక్ చేస్తుందో లేదో వేచి చూడాలి. -
ప్రేమికులరోజున ‘దేవ్’
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న దేవ్ సినిమా డేట్ ఫిక్స్ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా నటించిన ధీరన్ అధికారం ఒండ్రు, కడైకుట్టి సింగం చిత్రాలు వరుసగా విజయం సాధించటంతో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం దేవ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రజత్ రవిశంకర్ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ మూవీలో రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ధీరన్ అధికారం ఒండ్రు చిత్రం తరువాత కార్తీతో ఈ బ్యూటీ నటిస్తున్న రెండవ చిత్రం ఇది. రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న దేవ్ చిత్ర షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర తమిళ ఆడియో ఇటీవల విడుదలైంది. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర గీతాలకు మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో దేవ్ చిత్ర విజయంపై చాలా ధీమాగా ఉన్నారు. ఇది లవ్, యాక్షన్ సన్నివేశాలతో కూడిన రోడ్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. దేవ్ చిత్రాన్ని ఫిబ్రవరి తొలివారంలోనే విడుదల చేయాలని చిత్ర వర్గాలు ముందు నిర్ణయించుకున్నారట. అయితే నిర్మాణ కార్యక్రమాలు కాస్త ఆలస్యం కావడంతో చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. -
సంక్రాంతి కానుకగా ‘దేవ్’ ఆడియో
ఖాకీ సినిమాతో మంచి హిట్‌ను సొంతం చేసుకున్నారు కార్తీ, రకుల్ ప్రీత్. మళ్లీ వీరిద్దరు జంటగా కలిసి ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ద్విభాష చిత్రంగా రాబోతోన్న ఈ ‘దేవ్’ సినిమా టీజర్‌ను, ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్ర ఆడియోను విడుదల చేయాలని మేకర్స భావిస్తున్నారు. జనవరి 14న ఈ మూవీ ఆడియోను విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారు. ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
యాక్షన్ దేవ్
‘ఖాకి’ చిత్రంతో మంచి హిట్ పెయిర్ అనిపించుకున్నారు కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా కార్తీ, రకుల్ నటిస్తున్న ‘దేవ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో లక్ష్మణ్ కుమార్, ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది. సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.చెన్నై, హిమాలయాస్, హైదరాబాద్, ముంబైలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. సంక్రాంతికి ఆడియో, ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో నిక్కీ గర్లానీ సెకండ్ హీరోయిన్గా నటించారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జయరాజ్, కెమెరా: వేల్రాజ్, నిర్మాణ సంస్థలు: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్, సమర్పణ: రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్. -
అది నాకు నచ్చదు!
సినిమా: 16@4 హ్యాపీస్ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. దక్షిణాదిని నమ్ముకున్న ఉత్తరాది భామల్లో ఈ బ్యూటీ ఒకరు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే సక్సెస్ కోసం కోలీవుడ్, టాలీవుడ్ అంటూ చక్కర్లు కొట్టిన రకుల్‌కు ఎట్టకేలకు టాలీవుడ్లో స్టాండింగ్ ప్లేస్ దొరికింది. అయితే అక్కడ స్పీడ్ తగ్గడంతో కోలీవుడ్‌లో విజయాలను వెతుక్కుంటోంది. ఇక్కడ కార్తీతో రొమాన్స్ చేసిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంతో దాన్నీ అందుకుంది. ఇప్పుడిక కోలీవుడ్‌నే నమ్ముకుంది. మరోసారి కార్తీకి జంటగా దేవ్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆయన సోదరుడు సూర్యతోనూ ఎన్జీకే చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ మొత్తం కోలీవుడ్‌లో మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇక టాలీవుడ్లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ నాటి అతిలోకసుందరి శ్రీదేవిగా మెరవనుంది. ఇంతకు మించి అవకాశాలు ప్రస్తుతానికి లేవు. ఈ అమ్మడు నటిగా దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు అయ్యిందట. ఈ 4 ఏళ్లలో 16 చిత్రాలు చేసింది. దీంతో హ్యాపీస్ అంటోంది. పైకి అలా అంటున్నా, సినిమాపై నమ్మకం సన్నగిల్లుతోందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ను చదివితే అనిపిస్తోంది. సినిమా నిరంతరం కాదని ఇంతకు ముందే స్టేట్మెంట్ ఇచ్చిన రకుల్ ఇతర వ్యాపారాలపై ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే జిమ్‌ను నడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా హోటల్ వ్యాపారాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. దీని గురించి తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. అదేంటో ఒక లుక్కేద్దామా! సినిమా తరువాత నాకు ఇష్టమైనది ఆహారం. శరీరాన్ని స్లిమ్‌గా ఉంచుకోవడానికి కడుపును కాల్చుకోవాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఇష్టమైన పదార్థాలను తిని కూడా శరీరాన్ని కట్టుబాటులో ఉంచుకోవచ్చు. అందుకు ఉదాహరణ నేనే. వ్యాయామ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్న నేను భోజన ప్రియురాలిని. నగరంలో ఒక్క హోటల్‌నూ వదలను. ఎక్కడ ఏ ఆహార పదార్థం బాగుందని తెలిసే అక్కడకు వెళ్లి లాగించేస్తాను. అలా ఏఏ ఊర్లో రుచికరమైన పదార్థాలు ఉంటాయే నాకు తెలుసు. జిమ్‌ను నడుపుతున్న నాకు ఇప్పుడు ఆహారంపై ప్రియంతో ఒక హోటల్‌ను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. నాకు నచ్చిన ఆహార పదార్థాలన్నీ ఒకే చోట లభించేలా చేయాలన్న ఆశ కలిగింది. ఇప్పటికి 4 ఏళ్లలో 16 చిత్రాల్లో నటించాను చాలా ఉత్సాహంగా ఉన్నాను. విశ్రాంతి అన్నది నాకు నచ్చని విషయం. ఇచ్చిన పనిని పూర్తి చేసే మనస్తత్వం. ఫలితం గురించి ఆలోచించను. నా సంతోషానికి కారణం ఇవే అని నటి రకుల్‌ప్రీత్ సింగ్ పేర్కొంది. అన్నట్టు ఈ అమ్మడికి 2018 అచ్చిరాలేదనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఈమె నటించిన ఒక్క చిత్రం విడుదల కాలేదు. సూర్యతో రొమాన్స్ చేస్తున్న ఎన్జీకే చిత్రం దీపావళికి తెరపైకి రావలసి ఉన్నా, షూటింగ్ జాప్యం కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. -
‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’
ఖాకీ చిత్రంతో హిట్ పెయిర్‌గా నిలిచిన కార్తీ, రకుల్ ప్రీత్‌ల తాజా చిత్రం ‘దేవ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ అభిమానుల్ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీపావళి కానుకగా ఈరోజు(సోమవారం) చిత్ర బృందం టీజర్‌ను విడుదల చేసింది. లవ్.. యాక్షన్.. రొమాన్స్ సీన్స్‌తో కూడిన ఈ టీజర్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ‘ఈ లోకంలో బతకడానికి ఎన్నో దార్లున్నాయి.. ఎవరో చెప్పారని అర్థంగాని చదువు చదివి.. ఇష్టం లేని ఉద్యోగం చేసి.. ముక్కు మొహం తెలియని నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పడి పనిచేసి.. ఈగో, ప్రెషర్.. కాంపిటేషన్‌లో ఇరుక్కుని.. అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతుందో అర్థం కాకుండా బతకడం ఓ దారి. ఇంకోదారి ఉంది..’ అంటూ కార్తీ వాయిస్ ఓవర్‌తో టీజర్ సాగింది. చివర్లో ‘నన్ను వదిలేస్తే అమ్మాయిని తీసుకుపోతూ ఉంటా..’ కార్తీ తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నాడు. టీజర్లో కార్తీ చాలా స్టైలిష్‌గా కనిపించారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని దర్శకుడు రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తున్నారు. హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
‘దేవ్’ టీజర్ రెడీ అవుతోంది!
‘చినబాబు’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చినబాబు తమిళనాట హిట్‌గా నిలిచింది. అయితే కార్తీ ఈసారి మాస్, యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. ఖాకీ సినిమాతో హిట్ పెయిర్‌గా నిలిచిన కార్తీ, రకుల్ ప్రీత్ జంటగా రాబోతోన్న దేవ్ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలె విడుదల చేశారు. ఈ లుక్కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దీపావళికి రిలీజ్చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీని రజత్ రవిశంకర్ తెరకెక్కిస్తున్నారు. .@Karthi_Offl 's #Dev teaser coming soon!!!@Rakulpreet @prakashraaj @meramyakrishnan @RajathDir @lakku76 @Jharrisjayaraj @PrincePictures_ @LightHouseMMLLP @RelianceEnt @TagoreMadhu @shreyasmedia #DevTeaser #DevTeaserSoon pic.twitter.com/vBDWhVYTYE — BARaju (@baraju_SuperHit) November 2, 2018 -
స్టైలిష్ దేవ్
కుర్రాడు వాడే బైక్ మాత్రమే కాదు కుర్రాడు కూడా స్పీడే. మరి.. దేవ్ స్పీడ్‌కు ఎవరైనా బ్రేక్‌లు వేశారా? వేస్తే.. ఆ తర్వాత గేర్ మార్చి దేవ్ ఎలా స్పీడ్‌గా దూసుకెళ్లాడు? అనే ఆసక్తికరమైన అంశాలను తెలుసుకోవాలంటే ‘దేవ్’ సినిమా చూడాల్సిందే. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది. రకుల్‌ప్రీత్ సింగ్, నిక్కీ గల్రానీ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ‘ఠాగూర్’ మధు సొంతం చేసుకున్నారు. గురువారం దేవ్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.‘‘ఖాకీ’ వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత కార్తీ, రకుల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రమిది. చెన్నై, హైదరాబాద్, ముంబై, హిమాలయాస్ వంటి లొకేషన్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. కార్తీక్ ముత్తు రామన్, ఆర్.జె. విఘ్నేష్, రేణుక, అమృత, వంశీ, జయకుమార్ తదితరులు నటించిన ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. -
నో రెస్ట్
తాజా చిత్రం ‘దేవ్’ కోసం ఫుల్ స్పీడ్‌తో రెస్ట్ లేకుండా పని చేస్తున్నారు కార్తీ అండ్ టీమ్. ఎన్ని అడ్డంకులొచ్చినా వెనక్కి తగ్గకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవ్’. మనాలీలో వచ్చిన వరదల వల్ల ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్‌లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆగిపోయిన షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నారట. అలాగే ఎవరెస్ట్ శిఖరం దగ్గర కొంత భాగం షూట్ చేయనున్నారట చిత్రబృందం. ‘‘మనాలీతో పాటు ఎవరెస్ట్ శిఖరం దగ్గర్లో, నేపాల్ వంటి మంచు ప్రాంతాల్లో షూటింగ్ చేయనున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఎంత కష్టం!
సినిమాకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి. ఒక్కోసారి షూటింగ్ లొకేషన్లో ఏర్పడే మనస్పర్థల వల్ల, ఆర్టిస్టుల డేట్స్ విషయంలోనూ, ప్రకృతి వల్ల కూడా అనుకోని ఇబ్బందులు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి అనూహ్య ఇబ్బందిలోనే చిక్కుకుంది ‘దేవ్’ టీమ్. కార్తీ, రకుల్ జంటగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌ను హిమాచల్ ప్రదేశ్‌లోని కులూమనాలిలో ప్లాన్ చేసి, యూనిట్ అక్కడకు చేరుకుంది. సడెన్‌గా కుండపోతగా వర్షం కురవడంతో వరదలు వచ్చాయి. దాంతో షూటింగ్ ప్రదేశమంతా బీభత్సంగా తయారవ్వడంతో పాటు సుమారు 140 మంది యూనిట్ మెంబర్స్ అక్కడ చిక్కుకుపోయారట. ఈ విషయాన్ని కార్తీ షేర్ చేస్తూ – ‘‘మంచు పడుతున్న సీన్స్ షూట్ చేద్దామని హిమాచల్ ప్రదేశ్ వచ్చాం. మాకు అనుగుణంగానే లొకేషన్ ఉండటంతో షూటింగ్ సజావుగా జరుగుతుందనుకున్నాం. హఠాత్తుగా భారీ వర్షం మొదలైంది. కొండ మీదున్న రాళ్లు జారి రోడ్డు మీద పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. షూటింగ్ లొకేషన్లో (కొండ మీద) చిక్కుకుపోయిన వాళ్లతో కమ్యూనికేషన్ లేదు. సేఫ్టీ కోసం నన్ను కొండ కింద ఊర్లోనే ఉండ మన్నారు’’ అన్నారు. ఈ ప్రకృతి వైపరీత్యం నిర్మాతకు సుమారు కోటిన్నరకు పైనే నష్టం మిగిల్చిందట. అలాగే గత 23 ఏళ్లలో హిమాచల్ ప్రదేశ్‌లో ఇంతటి బీభత్సాన్ని చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. -
వరదల్లో చిక్కుకున్న కార్తీ చిత్ర బృందం
కార్తీ, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కుతున్న దేవ్ చిత్ర యూనిట్ వరదల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమనాలిలో జరుగుతుంది. అక్కడ కురుస్తున్న భారీ వర్షాలకు చిత్ర బృందం షూటింగ్‌ను రద్దు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఈ సినిమాకు పనిచేస్తున్న 140 మంది వరదల్లో చిక్కుకున్నారు. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడుతుండటం వల్ల వారు ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. చిత్ర నిర్మాత లక్ష్మణ్‌కు దాదాపు కోటిన్నర రూపాయల నష్టం వాటిలినట్టు తెలుస్తోంది. వారికి ప్రస్తుతానికి తినడానికి ఏం దొరకడం లేదని తెలుస్తోంది. ‘మంచు కురిసేటప్పుడు కొన్ని సీన్లు చిత్రీకరించడానికి.. మేము ఇక్కడికి వచ్చాం. మాకు ఇక్కడున్న వాతావరణం కూడా చాలా బాగా కుదిరింది. ఇక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీచేయలేదు. నిన్నటి వరకు పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడుతుండటం ప్రారంభమైంది. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లడానికి వీలులేకుండా దారులన్నీ మూసుకుపోయాయి. నేను కారులోనే నాలుగైదు గంటలు కూర్చుండిపోయాను. తర్వాత దగ్గరలోని ఓ గ్రామానికి వచ్చాను. కొండపై భాగంలో ఈ చిత్రానికి పనిచేస్తున్న 140 మంది ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా చిక్కుకుపోవడం బాధగా ఉంద’ని కార్తీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై లక్ష్మణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజత్ రవిశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. -
చలో ఉక్రెయిన్
లండన్‌కు బై బై చెప్పారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. నెక్ట్స్ ఉక్రెయిన్‌కు వెళ్తారామె. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రకుల్‌ప్రీత్ సింగ్, టబు ముఖ్య తారలుగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నెల రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లారు రకుల్. ‘‘లండన్ షెడ్యూల్ పూర్తయింది. ‘దేవ్’ సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్తున్నాను. హిందీ టు తమిళ్’’ అని పేర్కొన్నారు రకుల్. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికే రకుల్ ఉక్రెయిన్ వెళ్తున్నారు. ‘దేవ్’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం.