రకుల్‌కు గట్టి షాక్‌! | Rakul Preet About An Incident With Her Friends | Sakshi
Sakshi News home page

ట్రీట్‌ కాదు షాక్‌!

Feb 16 2019 7:30 AM | Updated on Feb 16 2019 11:53 AM

Rakul Preet About An Incident With Her Friends - Sakshi

అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్‌ పిట్టా. ఏంటీ ఆ పాత మధుర గీతాల గురించి చెబుతున్నట్లు భావిస్తున్నారా? అంత సాహసం చేయడం లేదు గానీ, నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు ఇలాంటి షాకే కొట్టిందట. అదీ తనే కోరి తగిలించుకున్న షాక్‌. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ స్టార్‌ హీరోయిన్‌. అందులో ఎటువంటి అనుమానం లేదు. ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. రెండు రోజుల క్రితమే ఈ అమ్మడు కార్తీతో రొమాన్స్‌ చేసిన దేవ్‌ చిత్రం తెరపైకి వచ్చింది. తదుపరి సూర్యకు జంటగా నటించిన ఎన్‌జీకే చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇంకా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో  మరో అరడజను చిత్రాల్లో నటిస్తోందట.

అయితే అంత మాత్రాన ఈ బ్యూటీకి షాక్‌ తగలకూడదనేం లేదు. అదే జరిగింది. ఆ విషయం గురించి రకుల్‌ప్రీత్‌సింగ్‌ ఒక ఇంటర్వూ్యలో పేర్కొంటూ ఆ మధ్య ఒకసారి నా స్నేహితులతో కలిసి లండన్‌ వెళ్లాను. అక్కడ ఒక స్టార్‌ హోటల్‌లో స్నేహితులందరికీ పార్టీ ఇచ్చాను. పార్టీ అంటే విందు మాత్రమే. మేము 10 మందే. బిల్‌ ఎంత అయి ఉంటుందని అనుకుంటున్నారు? అక్షరాలా రూ.10 లక్షలు. ఏంటీ షాక్‌ అయ్యారా? నేను అంతకంటే పెద్ద షాక్‌కు గురయ్యాను. ఏం చేస్తాను. మాట్లాడకుండా ఆ మొత్తాన్ని చెల్లించి బయటపడ్డాను. అప్పుడు అనుకున్నాను. జీవితంలో మళ్లీ ఆ హోటల్‌కు వెళ్లకూడదని అని ఒట్టేసుకున్నాను. అలా ఫ్రెండ్స్‌కు ట్రీట్‌ ఇద్దామని అనుకుని తనే షాక్‌ తిందట రకుల్‌ ప్రీత్‌సింగ్‌. జీవితంలో అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు ఎవరికైనా తప్పవు మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement