ప్రేమికుల రోజున రాబోతోన్న ‘దేవ్‌’ | Karthi Dev Movie Releasing On 14th february | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 28 2019 7:30 PM | Last Updated on Mon, Jan 28 2019 7:32 PM

Karthi Dev Movie Releasing On 14th february - Sakshi

‘ఖాకీ’ సినిమాతో హిట్‌ కొట్టిన కార్తీ, రకుల్‌ ప్రీత్‌ జోడి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బైక్‌ రేసర్‌గా కార్తీ నటిస్తున్న ‘దేవ్‌’ మూవీ టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఓ అప్‌ డేట్‌ వచ్చేసింది. 

ఈ సినిమాను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. రొమాంటిక్‌ ఎంటర్‌టైన్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి రజత్‌ రవిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మరోసారి ఈ జంట మ్యాజిక్‌ చేస్తుందో లేదో వేచి చూడాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement