
‘‘ప్రజెంట్ జనరేషన్ మూవ్ అవుతున్న జోనర్‌లో ఓ సినిమా చేయాలనుకున్నాను. ‘దేవ్’ సినిమా ఇప్పటి జనరేషన్ వారికి సరిగ్గా సూట్ అవుతుంది. ప్రేమ, స్నేహం చుట్టూ తిరిగే అందమైన కథ. ఈ సినిమాకి అందరూ కనెక్ట్ అవుతారు’’ అని కార్తీ అన్నారు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దేవ్’. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తెలుగు హక్కులను నిర్మాత ‘ఠాగూర్’ మధు సొంతం చేసుకున్నారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమా రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘దేవ్’ ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ మాట్లాడుతూ– ‘‘రెండు వేర్వేరు ఆలోచనలున్న వ్యక్తుల ప్రేమకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయన్నదే ఈ సినిమా కథ. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు పాడిన పాట సినిమాకే హైలైట్.
ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నా. మళ్లీ సక్సెస్ మీట్‌లో మీ అందర్నీ(ప్రేక్షకులు) కలుస్తా’’ అన్నారు. ‘‘అడ్వెంచర్, ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ , యాక్షన్... ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది’’ అన్నారు రజత్ రవిశంకర్. ‘‘కార్తీలాంటి హీరోతో ఇలాంటి ఫీల్ గుడ్ సినిమా చేసినందుకు హ్యాపీ. రజత్ ఏం చెప్పాడో స్క్రీన్‌లో అదే చూపించాడు’’ అని లక్ష్మణ్ కుమార్ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నా పాత్ర పేరు మేఘన. స్వతంత్ర భావాలున్న పవర్‌ఫుల్ అమ్మాయి పాత్ర. మీ అందరికీ నా పాత్ర నచ్చుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది’’ అని రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment