అలాగైతే ముందుకెళ్లలేం అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్. తను నటించిన రెండు చిత్రాలు వరుసగా తెరపైకి రావడానికి ముస్తాబవుతుండడంతో ఈ అమ్మడు చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తోంది. అందులో ఒకటి దేవ్. నటుడు కార్తీతో రెండవ సారి జత కట్టిన ఈ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ఆ తరువాత సూర్యతో రొమాన్స్ చేసిన ఎన్‌జీకే సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది.
ఈ రెండు చిత్రాల్లో నటించడం చాలా మంచి అనుభవం అంటున్న రకుల్‌ప్రీత్‌సింగ్ ఒక ఇంటర్వ్యూలో దేవ్ చిత్రం గురించి తెలుపుతూ ఇదో ఎడ్వెంచర్ కథా చిత్రం అని తెలిపింది. అదే విధంగా ఈ సినిమాతో పాటే ఎన్‌జీకే చిత్రంలోనూ నటించినట్లు తెలిపింది. ఈ చిత్ర దర్శకుడు సెల్వరాఘవన్, దేవ్ చిత్ర దర్శకుడు రజత్ రవిశంకర్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవం అని చెప్పుకొచ్చింది.
ఎప్పుడైతే మనం కథను నమ్మి కష్టపడి నటిస్తామో అప్పుడు ఇక ఇతర విషయాల గురించి చింతించాల్సిన అవసరం లేదని అంది. కథలను ఎలా ఎంచుకుంటారన్న ప్రశ్నకు బదులిస్తూ నిజం చెప్పాలంటే ప్రారంభ దశలో కథలను ఎలా ఎంపిక చేసుకోవాలో తనకు అసలు తెలిసేది కాదని చెప్పింది. చిన్నతనంలో తాను సినిమాలే చూసేదాన్ని కాదని, హైస్కూల్‌లో చదువుకుంటున్నప్పుడే చిత్రాలను చూడడం మొదలెట్టానని చెప్పింది.
ఎప్పుడైతే సినిమాల్లో నటించడానికి వచ్చానో అప్పటి నుంచే సినిమా రంగం గురించి తెలుసుకోవడం ప్రారంభించానని చెప్పింది. కాగా తాను ఇక్కడ తెలుసుకుందేమిటంటే ప్రారంభ దశను వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక ముందుకు సాగలేవన్నదని అంది. ఇప్పుడు తనకేం కావాలో అర్థమైందని, చేసిన తప్పులు తెలుసుకోవడంతో పాటు, ఏం కావాలో తెలుసుకున్నానని చెప్పింది. ఏది మంచి, ఏది చెడు అన్నది తెలుసుకునే పరిపక్వత వచ్చిందని అంది. దీంతో తన ప్రవర్తనలో మార్పు వచ్చిందని అంటున్న రకుల్‌ప్రీత్‌సింగ్ కోసం మరిన్ని బిగ్ చాన్స్ కోలీవుడ్‌లో ఎదురుచూస్తున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment