కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్
‘ఖాకి’ చిత్రంతో మంచి హిట్ పెయిర్ అనిపించుకున్నారు కార్తీ, రకుల్ ప్రీత్‌సింగ్. గతేడాది విడుదలైన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. తాజాగా కార్తీ, రకుల్ నటిస్తున్న ‘దేవ్’ సినిమా షూటింగ్ పూర్తయింది. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో లక్ష్మణ్ కుమార్, ‘ఠాగూర్’ మధు నిర్మించిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన చిత్రమిది.
సినిమా ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది.చెన్నై, హిమాలయాస్, హైదరాబాద్, ముంబైలోని పలు ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. సంక్రాంతికి ఆడియో, ఫిబ్రవరిలో సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రంలో నిక్కీ గర్లానీ సెకండ్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జయరాజ్, కెమెరా: వేల్రాజ్, నిర్మాణ సంస్థలు: రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్, ప్రిన్స్ పిక్చర్స్, లైట్ హౌజ్ మూవీ మేకర్స్, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్.
Comments
Please login to add a commentAdd a comment