టైటిల్: దీనమ్మ జీవితం
నటీనటులు: దేవ్, ప్రియ చౌహాన్, సరిత..తదితరులు
నిర్మాతలు: వై. మురళి కృష్ణ, వై. వెంకటలక్ష్మీ, డి. దివ్య సంతోషి, బి. సోనియా
రచన, దర్శకత్వం: మురళి రామస్వామి
సంగీతం: ఆర్ ఎస్
ఎడిటర్: జానీ బాష
విడుదల తేది: జనవరి 5, 2024
కథేంటంటే..
క్రిష్ అలియాస్ కృష్ణ(దేవ్ బల్లాని)కు సినిమాలు అంటే పిచ్చి. ఎప్పటికైనా గొప్ప దర్శకుడు కావాలని కలలు కంటుంటాడు. భార్య రాధ (ప్రియా చౌహాన్), ఓ కూతుర్ని పట్టించుకోకుండా సినిమాల్లో డైరెక్షన్ అవకాశాలకోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి మహి అలియాస్ మహిమ (సరిత చౌహాన్) తో వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. మహిమ మాయలో పడి భార్యతో తరచు గొడవ పడుతుంటాడు. కెరీర్ పరంగా కూడా సెటిల్ అవ్వలేకపోతాడు.
ఇక తన భర్త మరో అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలుసుకున్న రాధ.. ఎలాగైన అతన్ని దారికి తెచ్చి సంసారాన్ని చక్కదిద్దుకోవాలనుకుంటుంది. క్రిష్ కూడా మహిని వదిలించుకొని భార్య పిల్లలతో కలిసి ఉండాలని భావిస్తాడు. అయితే మహి మాత్రం క్రిష్‌ని వదిలిపెట్టదు. మరి మహిని వదిలించేందుకు క్రిష్ ఏం చేశాడు? అసలు క్రిష్‌కి మహి ఎలా పరిచయం అయింది? రాధతో క్రిష్ పెళ్లి ఎలా జరిగింది? భర్తను కాపాడుకోవడం కోసం రాధ ఏం చేసింది? చివరకు క్రిష్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
అన్యోన్యంగా ఉండే ఇద్దరు భార్యా భర్తల మధ్య మరో ఆమ్మాయి ఎంటర్ అయితే ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులకు గురవుతుంది? దాని వల్ల కెరీర్ ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది? అనేది కాస్త బోల్డ్‌గా, రాగా ఈ చిత్రలో చూపించారు. కథనం కామెడీగా సాగినా..ఓ మంచి మెసేజ్‌ని ఇచ్చే ప్రయత్నం చేశారు. క్షణిక సుఖం కోసం పెళ్లైన ఓ వ్యక్తి వివాహేతర సంబంధాలు పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు పడ్డారనేది చాలా ఎమోషనల్ గా చూపించాడు దర్శకుడు మురళి స్వామి. ఫస్టాఫ్ లో బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి... సెకండ్ హాఫ్ లో హీరో, హీరోయిన్స్ ఫ్లాష్ బ్యాక్ చూపించి పాత్రలకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. అయితే కొన్ని సన్నివేశాలు, సంభాషనలు మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇబ్బందిని కలిగిస్తాయి. కొన్ని బోల్డ్ సీన్స్ యానిమల్ సినిమాని తలపిస్తాయి.
ఎవరెలా చేశారంటే..
ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయిగా..కెరీర్ లో స్టిరపడాలనుకునే అప్ కమింగ్ డైరెక్టర్ క్రిష్‌గా వేవ్ బల్లాని చక్కగా నటించాడు. మహి పాత్రలో సరిత చౌహాన్ బోల్డ్ రొమాన్స్ చేసి యూత్ ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. గృహిణి పాత్రలో ప్రియా చౌహాన్ కూడా తన పాత్రకి న్యాయం చేసింది. పరాయి అమ్మాయి మోజులో దారి తప్పిన భర్తను ఎలా దారికి తెచ్చుకునే ఓ సిన్సియర్ గృహిణి పాత్రలో ఒదిగిపోయింది. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేతికంగా సినిమా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. సంగీతం పర్వాలేదు.. ఐటెం సాంగ్ యూత్ కి కనెక్ట్ అవుతుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది.నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment