‘దేవ్‌’ టీజర్‌ రెడీ అవుతోంది! | Karthi DEV Movie Teaser May Be Comes On Diwali | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 2 2018 4:01 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Karthi DEV Movie Teaser May Be Comes On Diwali - Sakshi

‘చినబాబు’ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు హీరో కార్తీ. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చినబాబు తమిళనాట హిట్‌గా నిలిచింది. అయితే కార్తీ ఈసారి మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. 

ఖాకీ సినిమాతో హిట్‌ పెయిర్‌గా నిలిచిన కార్తీ, రకుల్‌ ప్రీత్‌ జంటగా రాబోతోన్న దేవ్‌ ఫస్ట్‌లుక్‌ను ఇటీవలె విడుదల చేశారు. ఈ లుక్‌కు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దీపావళికి రిలీజ్‌చేయాలని చిత్రబృందం ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రకాష్‌ రాజ్‌, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీని రజత్‌ రవిశంకర్‌ తెరకెక్కిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement