అది నాకు నచ్చదు! | Rakul Preet Singh in Karthi Dev Movie | Sakshi
Sakshi News home page

అది నాకు నచ్చదు!

Published Wed, Dec 26 2018 11:58 AM | Last Updated on Wed, Dec 26 2018 11:58 AM

Rakul Preet Singh in Karthi Dev Movie - Sakshi

సినిమా: 16@4 హ్యాపీస్‌ అంటోంది నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌. దక్షిణాదిని నమ్ముకున్న ఉత్తరాది భామల్లో ఈ బ్యూటీ ఒకరు. చాలా మంది హీరోయిన్ల మాదిరిగానే సక్సెస్‌ కోసం కోలీవుడ్, టాలీవుడ్‌ అంటూ చక్కర్లు కొట్టిన రకుల్‌కు ఎట్టకేలకు టాలీవుడ్‌లో స్టాండింగ్‌ ప్లేస్‌ దొరికింది. అయితే అక్కడ స్పీడ్‌ తగ్గడంతో కోలీవుడ్‌లో విజయాలను వెతుక్కుంటోంది. ఇక్కడ కార్తీతో రొమాన్స్‌ చేసిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రంతో దాన్నీ అందుకుంది. ఇప్పుడిక కోలీవుడ్‌నే నమ్ముకుంది. మరోసారి కార్తీకి జంటగా దేవ్‌ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ ఆయన సోదరుడు సూర్యతోనూ ఎన్‌జీకే చిత్రంలో నటిస్తోంది. అదే విధంగా శివకార్తికేయన్‌తో ఒక చిత్రం అంటూ మొత్తం కోలీవుడ్‌లో మూడు చిత్రాలు చేతిలో ఉన్నాయి. ఇక టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఎన్‌టీఆర్‌ బయోపిక్‌ నాటి అతిలోకసుందరి శ్రీదేవిగా మెరవనుంది. ఇంతకు మించి అవకాశాలు ప్రస్తుతానికి లేవు. ఈ అమ్మడు నటిగా దక్షిణాదిలో ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు అయ్యిందట.

ఈ 4 ఏళ్లలో 16 చిత్రాలు చేసింది. దీంతో హ్యాపీస్‌ అంటోంది. పైకి అలా అంటున్నా, సినిమాపై నమ్మకం సన్నగిల్లుతోందని రకుల్‌ప్రీత్‌సింగ్‌ను చదివితే అనిపిస్తోంది. సినిమా నిరంతరం కాదని ఇంతకు ముందే స్టేట్‌మెంట్‌ ఇచ్చిన రకుల్‌ ఇతర వ్యాపారాలపై ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే జిమ్‌ను నడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా హోటల్‌ వ్యాపారాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది. దీని గురించి తనే ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. అదేంటో ఒక లుక్కేద్దామా! సినిమా తరువాత నాకు ఇష్టమైనది ఆహారం. శరీరాన్ని స్లిమ్‌గా ఉంచుకోవడానికి కడుపును కాల్చుకోవాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. ఇష్టమైన పదార్థాలను తిని కూడా శరీరాన్ని కట్టుబాటులో ఉంచుకోవచ్చు. అందుకు ఉదాహరణ నేనే. వ్యాయామ శిక్షణ కేంద్రాన్ని నడుపుతున్న నేను భోజన ప్రియురాలిని. నగరంలో ఒక్క హోటల్‌నూ వదలను. ఎక్కడ ఏ ఆహార పదార్థం బాగుందని తెలిసే అక్కడకు వెళ్లి లాగించేస్తాను.

అలా ఏఏ ఊర్లో రుచికరమైన పదార్థాలు ఉంటాయే నాకు తెలుసు. జిమ్‌ను నడుపుతున్న నాకు ఇప్పుడు ఆహారంపై ప్రియంతో ఒక హోటల్‌ను ప్రారంభించాలన్న ఆలోచన వచ్చింది. నాకు నచ్చిన ఆహార పదార్థాలన్నీ ఒకే చోట లభించేలా చేయాలన్న ఆశ కలిగింది. ఇప్పటికి 4 ఏళ్లలో 16 చిత్రాల్లో నటించాను చాలా ఉత్సాహంగా ఉన్నాను. విశ్రాంతి అన్నది నాకు నచ్చని విషయం. ఇచ్చిన పనిని పూర్తి చేసే మనస్తత్వం. ఫలితం గురించి ఆలోచించను. నా సంతోషానికి కారణం ఇవే అని నటి రకుల్‌ప్రీత్‌ సింగ్‌ పేర్కొంది. అన్నట్టు ఈ అమ్మడికి 2018 అచ్చిరాలేదనే చెప్పాలి. కోలీవుడ్‌లో ఈమె నటించిన ఒక్క చిత్రం విడుదల కాలేదు. సూర్యతో రొమాన్స్‌ చేస్తున్న ఎన్‌జీకే చిత్రం దీపావళికి తెరపైకి రావలసి ఉన్నా, షూటింగ్‌ జాప్యం కారణంగా అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement