
అన్నదమ్ములిద్దరిలో ఎవరూ బెస్ట్ యాక్టరో చెప్పమంటే.. అసలు అలాంటి ప్రశ్నకు తావే లేదంటున్నారు నటి రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం తమిళంలో కార్తీతో నటించిన ‘దేవ్’ చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా గురువారం విడుదల కానుంది. అదేవిధంగా సూర్యతో జత కట్టిన ‘ఎన్‌జీకే’ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి రానుంది. రెండు చిత్రాలు ఇదే ఏడాది విడుదల అవుతుండటంతో డబుల్ హ్యాపీగా ఉన్నాను అంటున్నారు రకుల్.
ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం హిందీలో అజయ్‌దేవ్‌గన్ చిత్రంలో నటిస్తున్నాను. ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటించడం చాలా బాగుంది. అలానే ఒకేసారి అన్నదమ్ములు సూర్య, కార్తీలతో నటించడం మంచి అనుభవం. వారితో కలిసి పని చేయడం జాలీగా ఉంది. వారిద్దరిలో ఎవరు ఉత్తమ నటులు అన్న ప్రశ్నకు తావు లేదు. ఇద్దరూ పాత్రలకు ప్రాణం పోయడానికి శ్రమిస్తార’ని చెప్పుకొచ్చారు రకుల్ ప్రీత్ సింగ్.
Comments
Please login to add a commentAdd a comment