ప్రేమికులరోజున ‘దేవ్‌’ | Karthi Dev Movie Release Date | Sakshi
Sakshi News home page

Published Sun, Jan 13 2019 12:15 PM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Karthi Dev Movie Release Date - Sakshi

కోలీవుడ్ యంగ్‌ హీరో కార్తీ కథానాయకుడిగా తెరకెక్కుతున్న దేవ్‌ సినిమా డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. కార్తీ కథానాయకుడిగా నటించిన ధీరన్‌ అధికారం ఒండ్రు, కడైకుట్టి సింగం చిత్రాలు వరుసగా విజయం సాధించటంతో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం దేవ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి‌. రజత్‌ రవిశంకర్‌ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్న ఈ మూవీలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం తరువాత కార్తీతో ఈ బ్యూటీ నటిస్తున్న రెండవ చిత్రం ఇది.

రమ్యకృష్ణ, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న దేవ్‌ చిత్ర షూటింగ్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్ర తమిళ ఆడియో ఇటీవల విడుదలైంది. ప్రిన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.లక్ష్మణన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్‌ జయరాజ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర గీతాలకు మంచి స్పందన వస్తోందని చిత్రవర్గాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో దేవ్‌ చిత్ర విజయంపై చాలా ధీమాగా ఉన్నారు.

ఇది లవ్, యాక్షన్‌ సన్నివేశాలతో కూడిన రోడ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలిపారు. దేవ్‌ చిత్రాన్ని ఫిబ్రవరి తొలివారంలోనే విడుదల చేయాలని చిత్ర వర్గాలు ముందు నిర్ణయించుకున్నారట. అయితే నిర్మాణ కార్యక్రమాలు కాస్త ఆలస్యం కావడంతో చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement