
వైరల్
‘మనాలి నుంచి కన్యాకుమారికి ఎలా వెళతాం?’ అనే ప్రశ్నకు ‘స్కేట్‌బోర్డ్ మీద’ అని ఎవరూ చెప్పరు. ‘మీరు చెప్పకపోతేనేం... నేనైతే స్కేట్‌బోర్డ్ మీదే వెళ్లాను’ అంటున్నాడు రితిక్. ప్రెషనల్ స్కేట్ బోర్డర్ అయిన రితిక్ క్రాడ్జెల్ మనాలి నుంచి కన్యాకుమారికి స్కేట్‌బోర్డ్ మీద వెళ్లాడు. ఈ ప్రయాణానికి సంబంధించిన వీడియోలు నెట్‌లోకాన్ని అబ్బురపరుస్తున్నాయి.
చిన్న బ్యాక్‌ప్యాక్‌తో బయలుదేరిన రితిక్ 100 రోజుల్లో తన ప్రయాణాన్ని పూర్తి చేశాడు. రీల్స్, వీడియోలలో తనకు ఎదురైన అనుభవాలను నెటిజనులతో పంచుకున్నాడు. గూగుల్ మ్యాప్స్ పనిచేయకపోవడం నుంచి దట్టమైన ΄పొగమంచుతో హైవేల జీరో విజిబిలిటీ వరకు రితిక్‌కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
ఎన్ని సవాళ్లు ఎదురైనా ముందుకే వెళ్లాడు. రితిక్ సాహసం, ఓపికకు నెటిజనులు ప్రశంసల వర్షం కురిపించారు.
Comments
Please login to add a commentAdd a comment