మనాలీలో ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్! | Israeli woman gangraped after six men offer her ride to Manali | Sakshi
Sakshi News home page

లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకొని..

Jul 25 2016 1:20 PM | Updated on Sep 4 2017 6:14 AM

మనాలీలో ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్!

మనాలీలో ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్!

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వచ్చిన ఓ ఇజ్రాయెల్ యువతికి చేదు అనుభవం ఎదురైంది.

మనాలీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వచ్చిన ఓ ఇజ్రాయెల్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. మనాలీ సమీపంలో ఆమెపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై 25 ఏళ్ల బాధితురాలు పోలీసులకు  ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..

బాధిత యువతి ఆదివారం ఉదయం స్పిటీ వ్యాలీలోని ఖజా ప్రాంతాన్ని సందర్శించాలని అనుకుంది. అక్కడికి వెళ్లేందుకు ఆమె ట్యాక్సీ కోసం ఆమె ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి మనాలీ వరకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని ఖాజా వెళ్లవచ్చునని ఆమెను నమ్మబలికారు. ఆమె కారు ఎక్కిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులపై ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, అందులో ఇద్దరు తనపై అఘాయిత్యం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. నిందితులను పట్టుకొనేందుకు పెద్ద ఎత్తున గాలింపులు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement