Israeli woman
-
ఇజ్రాయెలీ సహా ఇద్దరిపై గ్యాంగ్ రేప్
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చారిత్రక హంపి పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌కు చెందిన మహిళతోపాటు వారికి ఆతిథ్యమిస్తున్న స్థానిక మహిళపై దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతోపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అడ్డుకున్న ముగ్గురు పురుష పర్యాటకులపై దుండగులు దాడి చేసి, తీవ్రంగా కొట్టారు. తుంగభద్ర కాలువలోకి నెట్టివేయగా వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. పరారీలో ఉన్న మరొకరి కోసం గాలింపు చేపట్టారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో గంగావతి సమీపంలోని సన్నాపుర వద్ద ఉన్న తుంగభద్ర కాలువ ఒడ్డున ఈ దారుణం చోటుచేసుకుంది. ఒడిశాకు చెందిన బిదా‹Ù, మహారాష్ట్ర వాసి పంకజ్, అమెరికా పౌరుడు డానియెల్‌తోపాటు, ఇజ్రాయెల్ పర్యాటకురాలు, వీరికి ఆతిథ్యమిచి్చన 29 ఏళ్ల స్థానిక మహిళ..వీరంతా కలిసి తుంగభద్ర కాలువ ఒడ్డున గిటారు వాయిస్తూ సరదాగా కాలక్షేపం చేస్తున్నారు. అదే సమయంలో, కొందరు దుండగులు వీరి వద్దకు వచి్చ, పెట్రోల్ బంక్ ఎక్కడుందంటూ ప్రశ్నించారు. సనపూర్కు వెళ్లాలని బదులివ్వడంతో రూ.100 ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. తెలుగు, కన్నడలో వారిని దూషించడం మొదలుపెట్టారు. దుండగుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ మహిళతోపాటు ఆతిథ్యమిచి్చన స్థానిక మహిళపైనా అత్యాచారానికి పాల్పడ్డారు మూడో వ్యక్తి ముగ్గురు పురుషులను తుంగభద్ర కాలువలోకి నెట్టివేశాడు. దీంతో, వీరిలో డానియెల్, పంకజ్‌లు ప్రాణాలతో బయటపడగా గల్లంతైన బిదాష్ మృతదేహం శనివారం ఉదయం కాలువలో దొరికింది. దుండగులు అంతటితో ఆగక స్థానిక మహిళను తీవ్రంగా కొట్టారు. ఆమె బ్యాగులో ఉన్న రెండు సెల్ఫోన్లు, రూ.9,500 నగదును దోచుకున్నారు. అనంతరం దుండగులు బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం బాధితుల ఫిర్యాదు మేరకు గంగావతి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధిత మహిళలిద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని కొప్పాల్ ఎస్పీ రామ్ ఎల్ సిద్ధి చెప్పారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు నిందితులను గంగావతి పట్టణానికి చెందిన మల్లేశ్, చేతన్ సాయి, మోహన్, చన్నదాసర అనే వారిని పట్టుకున్నామన్నారు. ఐదో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఆరు పోలీస్ బృందాలను రంగంలోకి దించామని చెప్పారు. -
ఆ సమయంలో ఊపిరాడక ప్రియురాలి మృతి..
ముంబై : ఓ ఇజ్రాయిల్ దేశస్తుడిపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తన ప్రియురాలి మరణానికి అతనే కారణమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓరియన్ యాకోవ్(23) అనే ఇజ్రాయిల్ దేశస్తుడు 20 ఏళ్ల తన ప్రియురాలితో గతేడాది పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఈ ఇజ్రాయిల్ జంట దక్షిణ ముంబై, కొలోబా ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. అయితే ఓ రోజు తన ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని యాకోవ్ హోటల్ సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్ రిపోర్ట్ ఇటీవల పోలీసులకు అందింది. ఈ రిపోర్ట్‌లో వారికి విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఇజ్రాయిల్ జంట లైంగిక చర్యలో ఉండగా.. యాకోవ్ ఆమె గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్ట్‌లో వెల్లడైందని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో ఏడాది అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు ఇజ్రాయిల్‌లో ఉన్నాడు. -
మనాలీలో ఇజ్రాయెల్ మహిళపై గ్యాంగ్ రేప్!
మనాలీ: హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వచ్చిన ఓ ఇజ్రాయెల్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. మనాలీ సమీపంలో ఆమెపై ఇద్దరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై 25 ఏళ్ల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాధిత యువతి ఆదివారం ఉదయం స్పిటీ వ్యాలీలోని ఖజా ప్రాంతాన్ని సందర్శించాలని అనుకుంది. అక్కడికి వెళ్లేందుకు ఆమె ట్యాక్సీ కోసం ఆమె ఎదురుచూస్తుండగా ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి మనాలీ వరకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. అక్కడి నుంచి ట్యాక్సీ తీసుకొని ఖాజా వెళ్లవచ్చునని ఆమెను నమ్మబలికారు. ఆమె కారు ఎక్కిన తర్వాత నిర్మానుష్య ప్రాంతానికి వాహనాన్ని తీసుకెళ్లి ఇద్దరు వ్యక్తులపై ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారని, అందులో ఇద్దరు తనపై అఘాయిత్యం చేశారని బాధితురాలు తన ఫిర్యాదులో తెలిపింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. నిందితులను పట్టుకొనేందుకు పెద్ద ఎత్తున గాలింపులు చేస్తున్నారు.