ఆ సమయంలో ఊపిరాడక ప్రియురాలి మృతి..  | Mumbai Police Has Booked a Israeli National in Connection With The Death of His Girlfriend  | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 3 2018 4:13 PM | Last Updated on Tue, Jul 3 2018 4:16 PM

Mumbai Police Has Booked a Israeli National in Connection With The Death of His Girlfriend  - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ముంబై : ఓ ఇజ్రాయిల్‌ దేశస్తుడిపై ముంబై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తన ప్రియురాలి మరణానికి అతనే కారణమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఓరియన్‌ యాకోవ్‌(23) అనే ఇజ్రాయిల్‌ దేశస్తుడు 20 ఏళ్ల తన ప్రియురాలితో గతేడాది పర్యాటక వీసా మీద భారత్‌కు వచ్చాడు. ఈ ఇజ్రాయిల్‌ జంట దక్షిణ ముంబై, కొలోబా ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. అయితే ఓ రోజు తన ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని యాకోవ్‌ హోటల్‌ సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే  ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్‌ రిపోర్ట్‌ ఇటీవల పోలీసులకు అందింది. ఈ రిపోర్ట్‌లో వారికి విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ఆ ఇజ్రాయిల్‌ జంట లైంగిక చర్యలో ఉండగా.. యాకోవ్‌ ఆమె గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్ట్‌లో వెల్లడైందని పోలీసులు మీడియాకు తెలిపారు. దీంతో ఏడాది అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం నిందితుడు ఇజ్రాయిల్‌లో ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement