Ranbir Kapoor, Rashmika Mandanna Begins Shoot of "Animal' Movie in Manali - Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: షూటింగ్‌లో పాల్గొన్న కొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్‌ కపూర్‌

Published Fri, Apr 22 2022 3:05 PM | Last Updated on Fri, Apr 22 2022 6:51 PM

Ranbir Kapoor, Rashmika Mandanna Animal Goes On Floors - Sakshi

అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ప్రస్తుతం 'యానిమల్‌' అనే క్రేజీ ప్రాజెక్టును తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ కోసం మూవీ టీం హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీలో ల్యాండ్‌ అయ్యింది. పెళ్లి తర్వాత రణ్‌బీర్‌  కపూర్‌ చేస్తున్న ఫస్ట్‌ ప్రాజెక్ట్‌ ఇది. ఇటీవలో అలియాతో పెళ్లి పీట‌కెక్కిన రణ్‌బీర్‌ ఏ మాత్రం గ్యాప్‌ తీసుకోకుండా వెంటనే షూటింగ్‌లో పాల్గొన్నారు. చదవండి: మాజీ భార్యపై రూ. 380కోట్ల పరువునష్టం దావా వేసిన హీరో


ఇక మనాలి వెళ్లిన మూవీ టీంకు అక్కడి స్థానిక యంత్రాంగం సాంప్రదాయబద్దంగా ఘనస్వాగతం పలికింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రణ్‌బీర్‌ పాత్ర విభిన్నంగా ఉంటుందని మూవీ టీం పేర్కొంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.చదవండి:  ‘పుష్పరాజ్‌’ పై బాలీవుడ్‌ నటి ప్రశంసలు..విషయం ఏమిటంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement