Ranbir Kapoor and Rashmika Mandanna’s Leaked Pics From Animal Shoot Go Viral, See Here - Sakshi
Sakshi News home page

Ranbir-Rashmika : ఫస్ట్‌ డే షూటింగ్‌లోనే లీకైన ఫోటోలు.. నెట్టింట హల్‌చల్‌

Published Sat, Apr 23 2022 6:20 PM | Last Updated on Sat, Apr 23 2022 7:35 PM

Ranbir Kapoor And Rashmika Mandanna Leaked Pics From Animal Shoot Goes Viral - Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటిస్తున్న సినిమా యానిమల్‌. అర్జున్‌ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ మనాలీ‌లో పూజ కార్యక్రమాలతో ఏప్రిల్ 22న ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడి స్థానిక యంత్రాంగం మూవీ టీంకు ఘన స్వాగతం పలికింది.

అయితే యానిమల్‌ షూటింగ్‌ ప్రారంభమైన మొదటి రోజే రణ్‌బీర్‌, రష్మికల ఫోటోలు లీక్‌ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో రణ్‌బీర్‌ వైట్‌ కుర్తాలో కనిపించగా, రష్మిక వైట్‌ అండ్‌ రెడ్‌ చీరలో తళుక్కుమంది. ఇక ఈ చిత్రంలో రష్మిక గీతాంజలి అనే పాత్రలో కనిపించనుంది. యి. టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్‌పై ప్రముఖ హిందీ నిర్మాత భూషణ్‌ కుమార్‌, ప్రణవ్‌ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement