
ప్రతీకాత్మక చిత్రం
సిమ్లా : పారాగ్లైడింగ్ సరదా ఓ యువకుడి నిండు జీవితాన్ని బలిగొంది. ఈ విషాదకర ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. పంజాబ్‌కు చెందిన అమన్‌దీప్ సింగ్(24) అనే యువకుడు టూర్ నిమిత్తం మనాలికి వచ్చాడు. ఇందులో భాగంగా తన స్నేహితురాలితో కలిసి శనివారం సోలాంగ్ వ్యాలీకి చేరుకున్నాడు. అక్కడ పారాగ్లైడింగ్ చేస్తున్న క్రమంలో పైలట్ కంట్రోల్ తప్పడంతో అమన్‌దీప్ కిందపడిపోయాడు. ఈ ఘటనలో అక్కడిక్కడే అతడు మృతి చెందగా.. పైలట్ తీవ్రగాయాలపాలయ్యాడు.
కాగా ఈ ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. అమన్ బాడీని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. పంజాబ్ నుంచి అతడి కుటుంబం రాగానే శవాన్ని అప్పగిస్తామని పేర్కొన్నారు.