మనాలి, కులులోయ... ఈ రెండు పర్యాటక ప్రదేశాలను విడిగా చెప్పుకోవడం మనకు అలవాటు లేదు. కులూమనాలిగా కలిపేస్తాం. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకే ట్రిప్‌ల కవర్ చేయవచ్చు. మనాలి పక్కనే ఉన్న లోయ ప్రాంతం కులు. ఈ శీతల ప్రదేశాల పర్యటనకు వేసవి ఒక ఆప్షన్.
స్నో ఫాల్‌ని కళ్లారా చూడాలంటే నవంబర్ రెండవ వారం నుంచి టూర్ ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. డిసెంబర్‌లో పతాకస్థాయికి చేరుతుంది. చెట్ల ఆకులు మంచుతో బరువుగా వంగిపోతాయి. నేల కనిపించనంత దట్టంగా ఉంటుంది. మనాలి నుంచి కేబుల్‌కార్‌లో విహరిస్తూ కులు లోయను చూడవచ్చు.
తెల్లటి హిమాలయాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇక్కడ మనువు గుడి ఉంది. మనువు ఆలయం అనే పేరు మీదనే దీనికి మనాలి అనే పేరు వచ్చింది.
ఇదీ చదవండి: చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే!
Comments
Please login to add a commentAdd a comment