Manali tourism
-
మంచు కురిసే వేళలో మనాలి విహారం
మనాలి, కులులోయ... ఈ రెండు పర్యాటక ప్రదేశాలను విడిగా చెప్పుకోవడం మనకు అలవాటు లేదు. కులూమనాలిగా కలిపేస్తాం. ఎందుకంటే ఈ రెండింటినీ ఒకే ట్రిప్‌ల కవర్ చేయవచ్చు. మనాలి పక్కనే ఉన్న లోయ ప్రాంతం కులు. ఈ శీతల ప్రదేశాల పర్యటనకు వేసవి ఒక ఆప్షన్. స్నో ఫాల్‌ని కళ్లారా చూడాలంటే నవంబర్ రెండవ వారం నుంచి టూర్ ప్లాన్ చేసుకోవాలి. నవంబర్ నుంచి మంచు కురవడం మొదలవుతుంది. డిసెంబర్లో పతాకస్థాయికి చేరుతుంది. చెట్ల ఆకులు మంచుతో బరువుగా వంగిపోతాయి. నేల కనిపించనంత దట్టంగా ఉంటుంది. మనాలి నుంచి కేబుల్‌కార్‌లో విహరిస్తూ కులు లోయను చూడవచ్చు. తెల్లటి హిమాలయాలను ఆస్వాదించడానికి ఇదే సరైన సమయం. ఇంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ ద గాడ్స్ అంటారు. ఇక్కడ మనువు గుడి ఉంది. మనువు ఆలయం అనే పేరు మీదనే దీనికి మనాలి అనే పేరు వచ్చింది. ఇదీ చదవండి: చలికాలంలో చుండ్రు బాధ, ఒళ్లు పగులుతుంది ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే! -
మాట నిలబెట్టుకున్న విజయ్! వందమంది ఫ్యాన్స్ సర్ప్రైజ్ ట్రిప్ వీడియో వైరల్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంతో యూత్‌లో ఆయన విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాల కంటే కూడా తన ప్రవర్తనతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు విజయ్. హిట్..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. అలాగే విజయ్ కూడా తరచూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. చదవండి: నాపై అలాంటి కామెంట్స్ చేశారు.. దానికి కారణం ఇదే: ఎస్వీ కృష్ణారెడ్డి గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరుతో ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని మనాలి విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించాడు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు. చదవండి: పెళ్లి తర్వాత కూడా ఏమాత్రం తగ్గని కాజల్ జోరు ఇప్పటికే ఈ 100 మంది పేర్లు ప్రకటించిన విజయ్ ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు ఈ యాత్ర కొనసాగనుందని వెల్లడించాడు. ఇక శుక్రవారం (ఫిబ్రవరి 17న) వారి జర్నీ స్టార్ట్. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో పట్టరాని ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఫ్యాన్స్ పంపిన వీడియోని విజయ్ తన ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. ‘ఈ రోజు ఉదయం వాళ్లు ఫ్లైట్‌లో ఉన్న వీడియోను నాకు పంపించారు. పర్వతాల్లోకి హాలీడే ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచీ 100 మంది ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది’ అంటూ విజయ్ రాసుకొచ్చాడు. Cutest ❤️ they sent me a video from their flight this morning. And they are off on their holiday to the mountains! 100 from across the country, makes me so happy 🥰#Deverasanta2022 pic.twitter.com/BF4DX5PIyG — Vijay Deverakonda (@TheDeverakonda) February 17, 2023 And here are the 100 of you, randomly selected this year :) Travel dates - February 17- 20. Will do a call group call and speak soon ❤️ pic.twitter.com/syOaRfvsXa — Vijay Deverakonda (@TheDeverakonda) February 2, 2023 -
విజయ్ దేవరకొండ బంపరాఫర్.. 100 మంది అభిమానులకు ఫ్రీగా మనాలి ట్రిప్
సినిమాల కంటే వాళ్ల ప్రవర్తనతో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న అతి తక్కువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. హిట్..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. విజయ్ కూడా తరచూ అభిమానులను సర్ప్రైజ్ చేస్తుంటాడు. గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరును ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు. క్రిస్మస్ సందర్భంగా విజయ్ తన సోషల్ మీడియాలో ‘మీలోని 100 మంది హాలిడే ట్రిప్‌కి పంపించాలనుకుంటున్నాను. ఏ ప్రదేశాలు అయితే బాగుంటుందో చెప్పడంటూ భారత్‌లోని చారిత్రక ప్రదేశాలు.. పర్వతాలు.. బీచ్‌లు,ఎడారిని సూచించాడు. వాటిలో ఎక్కువ మంది పర్వతాలను ఎంచుకున్నారు. తాజాగా ఈ హాలిడే ట్రిప్‌కి సంబంధించిన అప్డేట్ని ఓ వీడియో రూపంలో ఇచ్చాడు విజయ్. ‘నేను మీలో 100మందిని ఐదు రోజుల పాటు మనాలి టూర్‌కి పంపుతున్నాను. అక్కడ ఫుడ్, ట్రావెల్‌తో పాటు అన్నింటిని నేనే చూసుకుంటాను. మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాల ను చూసి ఎంజాయ్ చేయండి. మీ యాత్రకు సంబంధించిన ప్రణాళికను మేం సిద్ధం చేస్తాం. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ యాత్రకు అర్హులు. దీనికి మీరు చేయాల్సిన పనేంటంటే.. దేవరశాంట ఫారమ్ నింపి..నన్ను ఫాలో అవ్వండి. మీలో 100 మందిని ఎంపిక చేసి విహారయాత్రకు పంపిస్తాం. నేను మీ ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నాను. ట్రిప్‌ని ఎంజాయ్ చేయండి’అని విజయ్ చెప్పుకొచ్చాడు. విజయ్ ఇచ్చిన ఆఫర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వంద మందిలో తాము కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేస్తున్నారు. 100 of you go to the mountains ❤️ Update! Happy new year. Big kisses and lots of love to all of you.https://t.co/3e0wE3ECNt https://t.co/a5vLqeQXze pic.twitter.com/wTyZGH0JOt — Vijay Deverakonda (@TheDeverakonda) January 8, 2023 -
‘మనాలీ స్వింగ్’.. ‘మహా ఊయల’తో పర్యటకులకు వింత అనుభూతి
సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లోని ప్రఖ్యాత పర్యాటక ప్రదేశమైన మనాలీకి ఏటా వేలాది మంది టూరిస్టులు వెళ్తుంటారు. ఈ క్రమంలో పర్యటకులకు వినూత్న అనుభూతిని అందించేందుకు సిద్ధమైంది అక్కడి అంకుర సంస్థ. ఎత్తయిన ప్రాంతంలో గాలిలో ఊగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచే మహా ఊయల (జెయింట్ స్వింగ్) జనవరి నాటికి అందుబాటులోకి తీసుకురానుంది. కృత్రిమ మేథ (ఏఐ)తో పనిచేసే ఈ జెయింట్ స్వింగ్‌ను ఐఐటీ మండీ వద్ద ఏర్పాటైన ‘మనాలీ స్వింగ్’ అంకుర సంస్థ రూపొందించింది. ప్రపంచంలోనే ఇలాంటి తరహా ఊయల ఇదే మొదటిదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పర్వతారోహణపై ఆసక్తి ఉండి, సాహసాలను ఇష్టపడే నలుగురు ఇంజినీరింగ్ మిత్రులు ఈ అంకుర సంస్థను స్థాపించారు. ఈ ఊయల ఆకృతి, కాన్సెప్టులపై 5 పేటెంట్లు పొందేందుకు అవసరమైన ప్రక్రియను కూడా వీరు ప్రారంభించారు. దుబాయ్, స్విట్జర్లాండ్ ప్రాంతాల్లో దీని ఏర్పాటుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. పర్యాటకులు రూ.3,000 చెల్లిస్తే.. రవాణా ఛార్జీలు, ఫొటో, వీడియోలకు అయ్యే ఖర్చులన్నీ అందులో కలిసే ఉంటాయని తెలిపారు. -
ఈ మంచు ప్రాంతాలను చుట్టేసి రండి
భారత్‌లో ఎన్నో అద్భుత పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో మంచు ప్రదేశాలు ప్రత్యేకమైనవి. మంచు ప్రదేశాలను ఇష్టపడని వారు ఉండరు. నూతన సంవత్సర వేడుకలకు వెకేషన్‌కు వెళ్లి ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్రదేశాలు ఎంతో ఆహ్లాదాన్నిఇస్తాయి. జనవరిలో మంచు అధికంగా ఉండటంతో చలికాలంలో పర్యాటానికి మంచు ప్రదేశాలు చక్కని ఆప్షన్. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రదేశాలు భూలోక స్వర్గంలా కనిపిస్తాయి. మరి అలాంటి మంచు ప్రదేశాలు భారత్‌లో ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా.. ఇండియాలో ది బెస్ట్ మంచు ప్రదేశాలేంటో ఓసారి తెలుసుకుందాం.. 1.గుల్మార్గ్(జమ్మూ-కశ్మీర్) కశ్మీర్‌లోని అందమైన ప్రాంతాల్లో ఇదొకటి. గుల్మార్గ్ అంటే మంచు పూలదారి అని అర్థం. బారాముల్లా జిల్లాలోని గుల్మార్గ్ ప్రాంతమంతా శీతాకాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. గుల్మార్గ్ ప్రాంతం అందం వర్ణించలేనిది. ఇక్కడి స్ట్రాబెర్రీ లోయలు, బయో స్పియర్ రిజర్వులు, గోల్ఫ్ కోర్స్, మహారాణి టెంపుల్ తదితర ప్రాంతాలు పర్యాటకులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. జనవరిలో ఇక్కడ మంచు కురిసే అవకాశం ఉంటుంది. అందుకే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని చూడటానికి క్యూ కడతారు. వింటర్ సీజన్లో పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ స్కేటింగ్, స్కీయింగ్ కూడా చేయవచ్చు. 2. ఔలి( ఉత్తరాఖండ్) ఉత్తరాఖండ్‌లో ఉన్న ఔలి ప్రాంతం గర్వాలీ రీజియన్. రాష్ట్రంలో చూడదగ్గ ప్రదేశాల్లో ఔలి ఒకటి. ఔలి అంటే పచ్చిక బయలు అని అని అర్థం. అంటే మంచు కొండల్లో ఉన్న పచ్చిక నేల అని. శీతాకాలంలో ఈ పచ్చదనాన్ని మంచు కప్పేస్తుంది. స్నో ఫాల్ చూడాలనుకునే వారికి ఇది చక్కని గమ్యస్థానం. స్కీ యింగ్ వంటి ఆటలు కూడా ఆడవచ్చు. ఔలి ప్రాంతానికి వెళ్తుంటే దారి వెంబడి ప్రవహించే నదులు కనిపిస్తాయి. ఈ నీరంతా మంచు కరిగిన నీరే. ఈ నదులు ఔలికి చేరుకునే పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. 3.సోనా మార్గ్(జమ్మూ-కశ్మీర్) సోనా మార్గ్ అంటే బంగారు మైదానం అని అర్థం. సోనా మార్గ్ పట్టణం అంతా మంచు పర్వతాలతో కప్పబడి ఉంటుంది. శీతాకాలంలో ఇక్కడ పూసే బంగారు వర్ణపు పువ్వుల వల్ల ఈ ప్రాంతానికి సోనామార్గ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ ట్రెక్కింగ్, హైకింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకుల ఆసక్తిని పెంచుతాయి. జనవరి మొదటి 15 రోజులు ఇక్కడ మంచు కురుస్తుంది. ముఖ్యంగా అన్ని ట్రెక్కింగ్ మార్గాలు సోనామార్గ్ నుంచే మొదలవుతాయి. చుట్టు ఉన్న కొలనులు, పర్వతాలు, సహజ ప్రకృతి సౌందర్యం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. శీతాకాలంలో ఈ ప్రాంతపు ఉష్ణోగ్రత జీరో డిగ్రీల కంటే తక్కువగా నమోదవ్వడం వల్ల వాతావరణమంతా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. 4. మనాలి( హిమచల్ ప్రదేశ్) మనాలి ప్రాంతం రాజధాని షిమ్లా నుంచి 260 కి. మీ దూరంలో ఉంది. అందమైన మనాలి ప్రాంతం మంచు యొక్క స్వర్గధామం. ఇది హనీమూన్ స్పాట్ కూడా. ఇక్కడ స్కీయింగ్, స్కేట్ బోర్డింగ్, స్లోప్ స్లెడ్జింగ్ వంటి మంచు క్రీడలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి. మనాలిలో రోహతాంగ్ పాస్, చంద్రఖని పాస్, సోలాంగ్ లోయ, సుల్తాన్పుర ప్యాలెస్ వంటి ప్రదేశాలు చుట్టేయవచ్చు. 5. యామ్ తాంగ్ ( సిక్కిం) సిక్కిం పర్యాటక ప్రదేశాలలో యామ్తాంగ్ అందమైన పర్వత లోయ ప్రముఖంగా నిలుస్తుంది. దీనిని పువ్వుల లోయ అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 9 వేల అడుగుల ఎత్తులో ఈ వ్యాలీ ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లోనే చైనా, టిబెట్ సరిహద్దులు ఉంటాయి. దేశంలోని ఈశాన్య వైపున ఉన్న ఈ అందమైన ప్రదేశంలో జనవరిలో మంచు కురుస్తుంది. ఇక్కడికి దగ్గర్లోనే జీరో పాయింట్ కూడా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి ప్రత్యేక అనుమతి అవసరం. న్యూ ఇయర్‌కు మంచు పర్వతాలను చుట్టేసి రావడానికి జనవరి సరైన సమయం. ఇక ఆలస్యం ఎందుకు.. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఓ రౌండ్ వేయండి. -
మనాలీలో చిక్కుకున్న వరంగల్‌వాసులు క్షేమం
సీఎం కేసీఆర్ చొరవతో 2 రోజుల్లో స్వస్థలానికి.. సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వెళ్లిన 150 మంది యాత్రికుల బృందం సురక్షితంగా ఛండీగఢ్‌కు చేరుకుంది. రెండురోజులుగా విపరీతమైన మంచు కురుస్తుండడంతో యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు. ఈ బృందం మనాలీ లోని ‘నిషిత’ లాడ్జీలో బస చేసింది. మనాలి నుంచి ఈ బృందం శుక్రవారం రోహతంగ్పాస్కు వెళ్లింది. అక్కడ వీరి వాహనాల్లో ఒక వాహనం పాడైపోయింది. ఈ విష యం తెలుకున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ.. హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్తోపాటు ఆ రాష్ట్ర డీజీపీలతో సంప్రదింపులు జరిపి యాత్రికులను రాష్ట్రానికి తీసుకొచ్చే ఏరాట్లు చేశారు. శుక్రవారం ఈ బృం దం తిరిగి ఛండీగఢ్‌కు చేరుకుందని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. రెండు రోజుల్లో ఈ బృందం తిరిగి వరంగల్‌కు చేరుకోనుంది. బాధితులు సహాయం కోసం అక్కడి జిల్లా కలెక్టర్ రాకేశ్ కుమార్‌ను 94180 15754/ 01902 222727 నంబర్లలో సంప్రదించాలని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభు త్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి సూచించారు.