మనాలీలో చిక్కుకున్న వరంగల్‌వాసులు క్షేమం | Warangal residents safe in Manali tourist place | Sakshi
Sakshi News home page

మనాలీలో చిక్కుకున్న వరంగల్‌వాసులు క్షేమం

Published Sat, Feb 21 2015 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

Warangal residents safe in Manali tourist place

సీఎం కేసీఆర్ చొరవతో 2 రోజుల్లో స్వస్థలానికి..
సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా నుంచి హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలీకి విహారయాత్రకు వెళ్లిన 150 మంది యాత్రికుల బృందం సురక్షితంగా ఛండీగఢ్‌కు చేరుకుంది. రెండురోజులుగా విపరీతమైన మంచు కురుస్తుండడంతో యాత్రికులు అక్కడ చిక్కుకున్నారు.  ఈ బృందం మనాలీ లోని ‘నిషిత’ లాడ్జీలో బస చేసింది. మనాలి నుంచి ఈ బృందం శుక్రవారం రోహతంగ్‌పాస్‌కు వెళ్లింది. అక్కడ వీరి వాహనాల్లో ఒక వాహనం పాడైపోయింది.
 
 ఈ విష యం తెలుకున్న సీఎం కేసీఆర్, రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ.. హిమాచల్‌ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్‌తోపాటు ఆ రాష్ట్ర డీజీపీలతో సంప్రదింపులు జరిపి యాత్రికులను  రాష్ట్రానికి తీసుకొచ్చే ఏరాట్లు చేశారు. శుక్రవారం ఈ బృం దం తిరిగి ఛండీగఢ్‌కు  చేరుకుందని డీజీపీ అనురాగ్‌శర్మ తెలిపారు. రెండు రోజుల్లో ఈ బృందం తిరిగి వరంగల్‌కు చేరుకోనుంది.  బాధితులు సహాయం కోసం అక్కడి జిల్లా కలెక్టర్ రాకేశ్ కుమార్‌ను 94180 15754/ 01902 222727 నంబర్లలో సంప్రదించాలని ఢిల్లీలోని రాష్ట్ర ప్రభు త్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement