సినిమాల కంటే వాళ్ల ప్రవర్తనతో ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న అతి తక్కువ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు. హిట్..ప్లాఫ్‌తో సంబంధం లేకుండా ఆయనకు ఫ్యాన్ పాలోయింగ్ పెరుగుతూనే ఉంది. విజయ్ కూడా తరచూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తుంటాడు. గత ఐదేళ్ల నుంచి ప్రతి క్రిస్మస్‌కు అభిమానులకు బహుమతులు అందిస్తున్నాడు ఈ టాలీవుడ్ సెన్సెషన్. దేవరశాంట పేరును ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో సర్‌ప్రైజ్ ఇస్తుంటాడు. ఈ సారి మాత్రం 100 మంది ఫ్యాన్స్‌ని విహారయాత్రకు పంపించనున్నట్లు ప్రకటించారు. ఐదు రోజుల పాటు సాగే ఈ విహారయాత్రకు సంబంధించిన ఖర్చులన్నీ ఆయనే భరించనున్నాడు.
క్రిస్మస్ సందర్భంగా విజయ్ తన సోషల్ మీడియాలో ‘మీలోని 100 మంది హాలిడే ట్రిప్‌కి పంపించాలనుకుంటున్నాను. ఏ ప్రదేశాలు అయితే బాగుంటుందో చెప్పడంటూ భారత్‌లోని చారిత్రక ప్రదేశాలు.. పర్వతాలు.. బీచ్‌లు,ఎడారిని సూచించాడు. వాటిలో ఎక్కువ మంది పర్వతాలను ఎంచుకున్నారు. తాజాగా ఈ హాలిడే ట్రిప్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని ఓ వీడియో రూపంలో ఇచ్చాడు విజయ్.
‘నేను మీలో 100మందిని ఐదు రోజుల పాటు మనాలి టూర్‌కి పంపుతున్నాను. అక్కడ ఫుడ్, ట్రావెల్‌తో పాటు అన్నింటిని నేనే చూసుకుంటాను. మంచు దుప్పటేసిన పర్వతాలకు, ఆలయాలకు, మఠాల ను చూసి ఎంజాయ్ చేయండి. మీ యాత్రకు సంబంధించిన ప్రణాళికను మేం సిద్ధం చేస్తాం. 18 ఏళ్లు నిండిన వాళ్లు ఈ యాత్రకు అర్హులు. దీనికి మీరు చేయాల్సిన పనేంటంటే.. దేవరశాంట ఫారమ్ నింపి..నన్ను ఫాలో అవ్వండి. మీలో 100 మందిని ఎంపిక చేసి విహారయాత్రకు పంపిస్తాం. నేను మీ ప్రయాణంలో భాగం కావాలనుకుంటున్నాను. ట్రిప్‌ని ఎంజాయ్ చేయండి’అని విజయ్ చెప్పుకొచ్చాడు. విజయ్ ఇచ్చిన ఆఫర్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ వంద మందిలో తాము కూడా ఉండాలని కోరుకుంటున్నట్లు కామెంట్ చేస్తున్నారు.
100 of you go to the mountains ❤️
— Vijay Deverakonda (@TheDeverakonda) January 8, 2023
Update!
Happy new year.
Big kisses and lots of love to all of you.https://t.co/3e0wE3ECNt https://t.co/a5vLqeQXze pic.twitter.com/wTyZGH0JOt
Comments
Please login to add a commentAdd a comment