
'అధికారం కోసం ప్రజలను మోసం చేసిన బాబు'
రైతులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు, పింఛన్ అర్హులను ఇలా అన్ని వర్గాల ప్రజలను అధికారం కోసం బాబు అండ్ కో మోసం చేశారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు.
బాబు హామీలను నమ్మి అధికారం అప్పజెప్పినందుకు నేడు అన్ని వర్గాల ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. బాధితులందరి తరఫునా వైసీపీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ పోరులో ప్రతి వైసీపీ కార్యకర్త, నేత ఓ సైనికుడిలా పోరాడాలని కర్నూలు జిల్లా నియోజకవర్గాల సమీక్ష సమావేశాల్లో జగన్ పిలుపునిచ్చారు.