ప్రజా వ్యతిరేకులు మోదీ, బాబు | public Opponents Modi, Babu | Sakshi
Sakshi News home page

ప్రజా వ్యతిరేకులు మోదీ, బాబు

Published Thu, Dec 18 2014 3:04 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

public Opponents Modi, Babu

బొబ్బిలి : ప్రజలను మాయ చేయాలని చూసే వాడే అందంగా మాట్లాడతాడని, ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అలాగే ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం. కృష్ణమూర్తి అన్నారు. పట్టణంలోని అంజనీ కల్యాణ మండపంలో బుధవారం సీపీఎం డివి జన్ స్థాయి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు చెప్పిన ఏ మాటా నమ్మడానికి లేదన్నారు. పైకి చెప్పేదొకటి, చేస్తున్నదొకటిగా ఉంటుందన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్‌గా మారుస్తామన్న చంద్రబాబు, అక్కడ సంతలా ఉం టుందని, వ్యవసాయం, పరిశ్రమలు ఉండదని, ఈ రాష్ట్రాన్ని కూడా అలాగే చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. క్లస్టర్ విధా నం పెట్టి విద్యను దూరం చేస్తున్నారన్నారు. మొన్నటి వరకూ 3 కిలోమీటర్ల దూరం వరకేనని పరిమితి విధించి ఇప్పుడు పది కిలోమీటర్లు పెంచారని, రాష్ట్రంలో అసలు ప్రభుత్వ బడులు ఉండకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమన్నారు.
 
 లచ్చయ్యపేట చక్కెర కర్మాగారాన్ని ఆనాడు అతి తక్కువగా ప్రైవేటుకు అమ్మేసిన చంద్రబాబు, ఇప్పుడు రైతులకు రావలసిన బకాయి కోసం యాజ    మాన్యాన్ని అరెస్టు చేస్తే ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి కౌంటర్ దాఖలు చేయాలని, అలా కాకుండా యాజమాన్యానికి వత్తాసు పలికిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకులని విమర్శించారు. సామాన్య ప్రజల గొంతు కోసే విధంగా నిర్ణ యాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను సవరించి సంఘాలే లేకుండా చేయాలని మోదీ, బాబు చూస్తున్నార న్నారు. దోపీడీ వర్గాలకు ప్రయోజనం చేకూర్చడానికి, వారి ఆటలు సాగడానికి మోదీ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారన్నారు. ఇందు కు ఇటీవల జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా రూ. 50 వేల కోట్ల పెట్టుబడుదారులు ఖర్చు పెట్టారని ఆరోపించారు. అంతకుముం దు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి, స్తూపం వద్ద నివాళులు అర్పించారు. సీపీఎం డివిజన్ కార్యదర్శి రెడ్డి వేణు అధ్యక్షతన జరిగిన ఈ సభలో చెరకు రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూర్యనారాయణ, సీఐటీయూ నాయకుడు పి. శంకరరావు,   రామారావు, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement