సీపీఐ జాతీయ కార్యదర్శి డీ. రాజా
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ బిల్లుల ప్రవేశం అసంబద్ధంగా జరుగుతుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ. రాజా మండిపడ్డారు. పెగాసిస్ స్పైవేర్ ఇష్యూపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి చర్చలు లేకుండా పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడడం బాధాకరమన్నారు.
కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాల వల్ల తీవ్ర నష్టాలు ఉన్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని 9 నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు తమ పార్టీ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా వ్యవసాయం కార్పొరేట్ పరమవుతుందని అన్నారు.
ప్రభుత్వ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్పరం చేస్తుందని దుయ్యబట్టారు. ఈ అంశాలపై మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చర్చించడానికి సిద్ధంగా లేదని ద్వజమెత్తారు. అదే విధంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుత పరిస్థితిపై యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment