ధర్మవరం అర్బన్: నరేంద్రమోదీ, చంద్రబాబునాయుడు ఇద్దరూ కార్పొరేట్ జీతగాళ్లని సీపీఎం జిల్లా కార్యదర్శి ఓబుళు విమర్శిం చారు. పట్టణంలోని పీఆర్‌టీ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన ఏపీ చేనేత కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభల్లో ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉండగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని మోదీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అధికారం చేపట్టాక ఇండియన్ ఫాస్ట్ డెవలప్‌మెం ట్ అనే పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నారన్నారు.
మోదీ, చంద్రబాబులు ఇద్దరూ చేనేత పార్క్‌ల ను ఏర్పాటు చేయకుండా టెక్స్‌టైల్స్ పార్కులు ఏర్పాటు చే స్తూ చేనేతలను నాశనం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 25 హామీల్లో ఒక్కటి కూ డా చంద్రబాబునాయుడు నెరవేర్చలేదన్నారు. అంగన్‌వాడీలను తీసేయండి, తహశీల్దార్, ఎంపీడీఓలను మార్చండి, రేషన్‌డీలర్లను పీకేయండి అంటూ స్థానిక ఎమ్మెల్యే సూరి అ ధికారులపై జులుం చేస్తున్నారని ఆరోపించారు.
ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ధర్మవరానికి చేనేత పార్క్‌ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. బాబు మాటలు విని రైతులు 90శా తం మంది బ్యాంకు లో రుణాలను రెన్యూవల్ చేసుకోలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా ఇవ్వక, రుణమాఫీలు చేయకపోవడంతో అనంత రైతు పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. రైతులు, చేనేతల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. 63 మండలాలకు ఉన్న ఉపాధి హామీను ఇప్పుడు కేవలం 17మండలాలకే పరిమితం చేసిన మహనీయుడు బాబుగారని ఎద్దేవా చేశారు.
వాగ్దానాల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చావా?.. బాబూ
ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్
ఎన్నికల సమయంలో చేనేతల సమస్యల పరిష్కారానికి మేనిఫెస్టోలో 25 హామీలు ఇచ్చి, ఇందులో ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ తెఇపారు. పట్టణంలోని పరమేశ్వరి ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడారు. చేనేతల రుణ మొత్తం కేవలం రూ.238 కోట్ల మాత్రమేనని, దీనిని కూడా మాఫీ చేయడానికి చంద్రబాబు మనసు అంగీకరించడంలేదన్నారు.
చంద్రబాబునాయుడు మాటలు విని జిల్లాలో 8మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలను చేనేత ఓృ్లతోనే గెలిపించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా చేనేత సమస్యలు పరిష్కరించకుంటే ప్రతి ఒక్క చేనేత కార్మికుడు కొమ్ము తీసుకుని బయటకు వచ్చి నీ భరతం పడతామని హెచ్చరించారు.
కార్యక్రమంలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు టీఎన్ శేషయ్య, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆశాం సురేష్, స్థానిక నాయకులు ఎస్‌హెచ్‌బాషా, ఆదినారాయణ, రమణ, డాక్టర్ ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు.
మోదీ, బాబు కార్పొరేట్ జీతగాళ్లు
Published Tue, Nov 25 2014 3:10 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM
Advertisement
Advertisement