చండీగఢ్: పంజాబ్‌లోని పటియాల జిల్లా నభా ప్రాంత ప్రజలు ఆదర్శంగా నిలిచారు. కరోనా భయాలు.. లాక్‌డౌన్ నేపథ్యంలోనూ క్రమం తప్పకుండా చెత్త సేకరిస్తున్న పారిశుధ్య కార్మికుడికి చప్పట్లతో స్వాగతం పలికిన ఓ కాలనీవాసులు.. అతనిపై పూల వర్షం కురిపించి కృతజ్ఞతలు తెలిపారు. దాంతో పాటు కరెన్సీ నోట్ల దండలు అతని మెడలో వేసి ఘనంగా సత్కరించారు. నిముషం పాటు ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక భారత్ వ్యాప్తంగా 1361 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 123 మంది కోలుకున్నారు. 35 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment