మెదక్ : సమ్మెలో పాల్గొంటున్న కార్మికురాలు గుండెపోటుతో మృతిచెందింది. ఈ సంఘటన మెదక్ జిల్లా గజ్వేల్‌లో మంగళవారం జరిగింది. గత కొద్ది రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మె చేస్తున్నారు. ఈ సమ్మెలో భాగంగా మంగళవారం మెదక్ జిల్లాలోని గజ్వేల్‌లో ధర్నా నిర్వహిస్తుండగా.. గజ్వేల్ కు చెందిన అటుకూరి మల్లమ్మ(43) ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా.. అప్పటికే ఆమె చనిపోయిందని పోలీసులు నిర్ధారించారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు ఆమె మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. మృతురాలికి ఆర్థిక సాయం చేయాలని కోరుతూ రాస్తారోకో నిర్వహించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
సమ్మె చేస్తూ కార్మికురాలి మృతి
Published Tue, Jul 28 2015 4:47 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 AM