
గజ్వేల్‌రూరల్: పరిహారం అందలేదన్న మనస్తాపంతో మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుడు గుండెపోటు కారణంగా గురువారం మృతిచెందాడు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని సంగాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండపాక మండలం ఎర్రవల్లికి చెందిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితుడు ఆరె నరసింహులుకు భార్య సత్తమ్మ, నలుగురు కూతుళ్లు ఉన్నారు. గ్రామంలో ఆయనకు 13 గుంటల వ్యవసాయ భూమి, ఇల్లు ఉన్నాయి.
కాగా, తమ బంధువులకు పరిహారం అందగా, తమకు ఇంతవరకు ప్యాకేజీకానీ, ఇల్లు కానీ రాలేదని ఆరు నెలలుగా ఆయన మనస్తాపంతో ఉన్నాడు. ఇదే బెంగతో నరసింహులు గుండెపోటుతో మృతి చెందాడని ఆయన భార్య సత్తమ్మ గజ్వేల్ ఆర్డీఓకు రాసిన లేఖలో పేర్కొంది. భూమి, ఇల్లు కోల్పోయిన ఈ కుటుంబం ప్రస్తుతం సంగాపూర్‌లో అద్దెకు ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment