విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన మహిళా కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
హైదరాబాద్ : విధుల నుంచి తొలగించారని మనస్తాపం చెందిన మహిళా కార్మికురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలో సోమవారం జరిగింది. రోడ్‌మేస్త్రీ నగర్‌కు చెందిన పి. సంపూర్ణ(25) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలో స్వీపర్‌గా పనిచేస్తోంది.
ఈ క్రమంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆమె విధులకు గైర్హాజరై సమ్మెలో పాల్గనడంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. దీంతో మనస్తాపం చెందిన సంపూర్ణ నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. కాగా ఆమె ఆరు నెలల గర్భవతి. ప్రస్తుతం ఆమెను ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.