munsipal polls
-
గయ డిప్యూటీ మేయర్‌గా పారిశుద్ధ్య కార్మికురాలు
పట్నా: పారిశుద్ధ్య కార్మికురాలిని డిప్యూటీ మేయర్ పదవికి ఎన్నుకోవడం ద్వారా బిహార్‌లోని గయ మున్సిపాలిటీ ప్రజలు చరిత్ర సృష్టించారు. చింతాదేవి గత 40 ఏళ్లుగా మున్సిపాలిటీలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈమె 16వేల పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. 1996లో కూడా గయ ప్రజలు ముసాహిర్ వర్గానికి చెందిన రాళ్లు కొట్టుకునే భగవతీదేవి అనే సాధారణ మహిళను లోక్‌సభకు పంపారు. -
Kuppam: 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 30 ఏళ్ల చీకటి!
అమరావతి పేరిట రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన బాబు తనను మూడు దశాబ్దాలుగా మోస్తున్న కుప్పం ప్రజలను అంతకు మించి కలలతీరాల్లో విహరింపజేశారు. రాజధానికి మించి ఇక్కడ అభివృద్ధి చేస్తామని, పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తామని ఆ ఐదేళ్లూ ఊదరగొట్టారు. కానీ ఒక్కటంటే ఒక్క పరిశ్రమ కూడా వచ్చిన పాపాన పోలేదు. నిజంగా ఇంత దారుణంగా మాయ చేస్తారా అనిపిస్తుంది వాస్తవాలు చూస్తే! సాక్షి ప్రతినిధి, తిరుపతి: అమాయక కుప్పం ప్రజలను ఎన్నో విధాలుగా నమ్మించి మాయ చేసిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పరిశ్రమల పేరిట ఎన్నో జిమ్మిక్కులు చేశారు. ప్రజాప్రతినిధిగా మూడు దశాబ్దాల కాలంలో లెక్కకు మించిన అబద్ధాల దడి కట్టారు. ఎన్నెన్నో పరిశ్రమలు వచ్చేస్తున్నాయని నమ్మబలికారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా 2016 ఆగస్టు 8వ తేదీ రాత్రి ఇక్కడే పారిశ్రామికవేత్తలతో బాబు సమావేశమయ్యారు. రూ.3వేల కోట్లతో వివిధ పరిశ్రమలు వచ్చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. బడా కంపెనీల పేర్లు చెప్పేసరికి కుప్పం ప్రజలు ఆశల పల్లకిలో ఊరేగారు. అన్నీ కాకపోయినా కొన్నయినా వస్తాయని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క కంపెనీ కూడా రాలేదంటే వాస్తవ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఫలితంగా కుప్పం నియోజకవర్గం నుంచి రోజూ వేలాది మంది కార్మికులు బెంగళూరుకి వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా మొత్తం మీద వలస కార్మికులు ఎక్కువగా ఉన్న ప్రాంతం కుప్పమే అంటే నమ్మశక్యం కాకపోయినా అక్షరాలా నిజం. మాకేంటి.. అనే డిమాండ్‌తో కొన్ని వెనక్కి వాస్తవానికి ఆయా చర్చల తర్వాత విరివిగా భూములు ఇస్తామని చెప్పడంతో కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ బాబుకి అత్యంత సన్నిహితులైన స్థానిక టీడీపీ నేతలు ఆయా కంపెనీల్లో మాకు వాటాలు ఇవ్వాలి.. మాకేం ప్రయోజనం కలిగిస్తారు.. అనే డిమాండ్లతో వచ్చే కంపెనీలు కూడా వెనక్కి వెళ్లాయనే వాదనలు ఉన్నాయి. ► బ్రిటానియా పరిశ్రమ కోసం ఆ సంస్థ ప్రతినిధులు శాంతిపురం మండలంలోని కర్లగట్ట కోతులగుట్ట, కుప్పం మండలంలోని గణేష్‌పురం, గుడుపల్లె మండలంలోని పొగురుపల్లె ప్రాంతాలలో స్థల పరిశీలన చేశారు. కానీ అక్కడితోనే ఆగిపోయి తర్వాత కన్నెత్తి చూడలేదు. ► వైష్ణవి మెగా ఫుడ్ పార్క్ కోసం శాంతిపురం మండలంలోని 121 పెద్దూరు వద్ద వంద ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు కేటాయించారు. ఈ భూములు సాగు చేస్తున్న రైతులకు పరిహారం ఇవ్వకుండా భూములు లాక్కోవడంపై స్థానికులు వ్యతిరేకించినా అధికార బలంతో వారి గొంతు నొక్కారు. కానీ ఇంత చేసినా పరిశ్రమ మాత్రం తీసుకురాలేకపోయారు. అనంతరం ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ రైతులే తమ భూములను ఎంచక్కా సాగు చేసుకుంటున్నారు. పనులు దొరక్క బెంగళూరు పోతిమి.. నాకు భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. అదిచేసినాం, ఇది చేసినాం అంటారే గానీ.. మాకు ఇక్కడ ఏ పనులు దొరకలేదు. పుట్టినూరు, ఉండే ఇళ్లు వొదిలేసి బెంగళూరుకు వెళ్లిపోయినాము. పదేళ్లకుపైనే ఇక్కడే ఉండాము. ఆకు కూరలు, కూరగాయలు అమ్మి పిల్లోళ్లని సదివిస్తా ఉండాము. ఏదైనా పండగొచ్చినా, పెళ్లిళ్లు జరిగినా కుప్పంకు వచ్చిపోతాము. – బాబు, చీలేపల్లె, కుప్పం ఉపాధి కోసం వలస వెళ్లడంతో పాడుబడిన బాబు నివాసం ఉపాధి కల్పనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు కుప్పం నియోజకవర్గంలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం మండలాలకు చెందిన సుమారు 20వేల మంది కార్మికులు పనుల కోసం నిత్యం బెంగళూరుకు వెళ్లాల్సిన దుస్థితి. దీంతో ఆ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంది. కుప్పంలో అపారమైన రాతి సంపద, నైపుణ్యం కలిగిన రాతి కార్మికులు ఉండడంతో ఆ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని భావించింది. వేలాది మందికి ఉపాధి సౌకర్యం కల్పించేలా గ్రానైట్ సర్వే స్టోన్ కటింగ్, పాలిషింగ్ యూనిట్‌ను నెలకొల్పేందుకు రంగం సిద్ధం చేసింది. కుప్పం పరిధిలోని దళవాయి కొత్తపల్లె సమీపంలో పల్లార్ల పల్లె వద్ద 4 ఎకరాల స్థలంలో యూనిట్ స్థాపనకు చర్యలు చేపట్టింది. -
మున్సిపల్ ఎన్నికలు.. నేడు ఈసీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పురపోరుపై మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కీలక నిర్ణ యం తీసుకోనుంది. ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికల నగారా ఎప్పుడు మోగిస్తారనే దానిపై స్పష్టతనిచ్చే అవకాశముంది. నవంబర్‌లో ఎన్నికలు జరపాలని కృతనిశ్చయంతో ఉన్న సర్కార్.. న్యాయపరమైన చిక్కులు వీగిపోయేలా పావులు కదుపుతోంది. పురపాలక సంఘాల ఎన్నికలకు అడ్డంకిగా ఉన్న ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేయడంతో ప్రభుత్వం ఊపిరిపీల్చుకుంది. 78 మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు నిలుపు దల చేస్తూ సింగిల్ జడ్జి ధర్మాసనం విధించిన స్టే ఉత్తర్వులు తొలిగిపోయేలా 3 రోజల క్రితం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై గురువారం విచారణ జరగనుంది. ఈ కేసులో కూడా తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని అంచనా వేస్తున్న ప్రభుత్వం ఎన్నికల నిర్వహించడానికి సన్నాహాలను ముమ్మరం చేసింది. ఏ క్షణమైనా నోటిఫికేషన్.. గత శాసనసభ ఎన్నికల్లో వినియోగించిన ఓటర్ల జాబితానే పురపోరులోను వాడనున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ మేరకు వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది నియామకం, ఇతరత్రా ఏర్పాట్లపై కలెక్టర్లు, కమిషనర్లతో సమీక్షించనుంది. ఎన్నికల సన్నద్ధతపై అధికారులిచ్చే సమాధానాలు సంతృప్తికరంగా ఉంటే.. ఎస్ఈసీ ఈ నెలాఖరులోగా పురభేరి మోగించనుంది. కాగా, ప్రభుత్వం మాత్రం గురువారం న్యాయస్థానం విచారించే కేసుకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై తుది అడుగు వేయనుంది. ఒకవేళ ఆ రోజే తీర్పు వెలువడితే.. మూడు రోజుల్లో రిజర్వేషన్ల క్రతువును పూర్తి చేసి.. ఈసీకి జాబితాను ఇవ్వనుంది. ఆ తర్వాత ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ను ఈసీ ప్రకటించనుంది. కాగా, మీర్‌పేట నగర పాలక సంస్థ ఎన్నికలపై మాత్రం సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. -
రాజకీయ పార్టీలు.. వ్యూహాలకు పదును!
సాక్షి, రంగారెడ్డి: పురపోరుకు మార్గం సుగమమైంది. ఎన్నికల ముందస్తు ప్రక్రియకు ఇటీవల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణకు నగారా మోగనుంది. నాలుగైదు రోజుల్లో తుది తీర్పు వెలువడనుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ రెండు నెలల కిందటనే చేపట్టిన రాష్ట్ర మున్సిపల్ శాఖ.. ఓటర్ల తుది జాబితా రూపకల్పన, వార్డుల విభజన పూర్తిచేసింది. వార్డులు, డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు అంశం పెండింగ్‌లో ఉంది. దీనిపైనా అంతర్గతంగా ఆ శాఖ కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో మున్సిపాలిటీల్లో రాజకీయంగా వేడి రాజుకుంది. అన్ని పార్టీల నజర్.. రాష్ట్రంలోనే అత్యధికంగా మున్సిపల్ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలున్న మన జిల్లాపై టీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక దృష్టిసారించింది. అన్ని స్థానాల్లో పాగా వేయడానికి కసరత్తు చేస్తోంది. జిల్లాలో బండ్లగూడ, బడంగ్‌పేట, మీర్‌పేట కార్పొరేషన్లతోపాటు 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటికే పలు దఫాలుగా జిల్లాకు చెందిన నేతలతో టీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంతనాలు జరిపారు. అలాగే ఎమ్మెల్యేలతోనూ ప్రత్యేకంగా సమావేశమై సమాచారం తీసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో బీజేపీ పట్టు సాధించే దిశగా పావులు కదుపుతుండటంతో మరింత వ్యూహాత్మకంగా ఎన్నికలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. ఆయా నియోజకవర్గాల బాధ్యతలను పార్లమెంట్ సభ్యులకు అప్పగించి అంతర్గతంగా ఎన్నికల కసరత్తు చేస్తోంది. మరోపక్క బీజేపీ కూడా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నేతలకు కాషాయ కండువా కప్పుతూ బలోపేతం అవుతోంది. ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్‌లను బీజేపీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే పటిష్టంగా ఉన్న ఆ పార్టీ.. ఇతర ప్రాంతాలపైనా దృష్టిసారిస్తోంది. టీఆర్ఎస్లోని అసంతృప్తి నేతలకూ గాలం వేస్తోంది. టీఆర్ఎస్ వ్యూహాలను దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఇక.. కాంగ్రెస్ పరిస్థితి అయోమయంగా మారింది. నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటాన్ని అడ్డుకోలేకపోతోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో కాంగ్రెస్ పటిష్టంగా ఉండటంతో ఆ ప్రాంత నేతలు పురపోరుపై దృష్టి కేంద్రీకరించారు. ఈ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మున్సిపాలిటీలను హస్తంగతం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాగా, టీడీపీ దాదాపుగా ఖాళీ కావడంతో ఆ పార్టీలో ఎన్నికల సందడి పెద్దగా కనిపించడం లేదు. అయితే, ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు విపక్షాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. వారికి మద్దతు ఇవ్వడం, ప్రభుత్వ విధానాలను ఎడగట్టడం ద్వారా తమకు కొంతైనా కలిసివస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. నేతల చుట్టూ ప్రదక్షిణలు.. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఆయా పార్టీల నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. కార్పొరేటర్, కౌన్సిలర్, చైర్మన్ల పదవులకు కోసం వారి చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు అన్ని పార్టీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోం ది. కొందరు ఆశావహులు నేరుగా ప్రజలను కలుస్తున్నారు. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా మొన్నటి దసరా పండగ సందర్భంగా పలువురు ఆశావహులు ఆయా మున్సిపాలిటీల్లో వీధిలైట్లు వేయించడం, రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చడం వంటి పనులు విస్తృతంగా చేపట్టారు. -
భర్త, తండ్రి అందరి పేరు తెలంగాణే..!
సాక్షి, జనగామ: జనగామ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఫొటో ఓటరు జాబితాలో అనేక తప్పులు చోటు చేసుకుంటున్నాయి. కులాల గుర్తింపులో పొరపాట్లు చేసిన అధికారులు.. తండ్రి, భర్తల పేర్లు మార్చేసి మరో అడుగు ముందుకు వేశారు. ఓటరు జాబితాల్లో చోటుచేసుకున్న తప్పిదాలు.. సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్నాయి. ఈ నెల 16న తుది ఓటరు జాబితా ప్రకటించగా.. ఒక్కొక్కటిగా తప్పులు వెలుగు చూస్తున్నాయి. 10వ వార్డుకు చెందిన రేఖ పేరు పక్కన తండ్రికి బదులుగా భర్త అని ముద్రించి.. తెలంగాణగా నమోదు చేశారు. ఆమె తల్లి మీరాబాయి.. భర్త పేరుకు బదులుగా తెలంగాణ, ఆమె భర్త సోనాబీర్ తండ్రికి బదులుగా తెలంగాణ అని ముద్రించారు. ఇంటిల్లిపాదికి ‘తెలంగాణ’పదాన్ని ఇచ్చేశారు. వార్డుల వారీగా ఓటరు సర్వేతో పాటు ఫొటో ఐడెంటిఫికేషన్ సమయంలో.. క్షేత్రస్థాయిలో పనిచేయక పోవడంతోనే తప్పిదాలకు ఆస్కారం కలిగిందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే కులాల మార్పిడి దుమారం రేపుతోంది. ఓసీలను బీసీగా.. బీసీలను ఎస్సీలుగా అక్కడక్కడా మార్చడంతో బాధితులు ఆందోళనకు గురవుతున్నారు. 3వ వార్డుకు చెందిన ఓసీ కులానికి చెందిన దొంతుల భిక్షపతి కుటుంబాన్ని బీసీగా, బీసీ కులానికి చెందిన వారిని ఓసీగా మార్చడంతో గురువారం పురపాలక సంఘ కార్యాలయానికి వెళ్లి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓసీ నుంచి బీసీకి మార్చడంతో.. తమకు అదే సర్టిఫికెట్ ఇవ్వాలని భిక్షపతి కుటుంబ సభ్యులు అధికారులను డిమాండ్ చేశారు. ఏ ప్రాతిపదికన కులం పేరు మార్చారు.. వాటి వివరాలను చూపించాలని ప్రశ్నించారు. -
అంత తొందరెందుకు..?
‘మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల పునర్విభజన అత్యంత ముఖ్యమైంది. ఈ పునర్విభజన ప్రక్రి యను హడావుడిగా ఎలా చేస్తారు? అభ్యంతరాలను సమర్పించేందుకు 4 రోజుల గడువునిచ్చారు. గడువు పూర్తికాక ముందే, ఒక్క రోజు లో అభ్యంతరాలను పరిష్కరిస్తారా..? భారీస్థాయిలో వచ్చే అభ్యంతరాలను ఒక్క రాత్రే పరిష్కరించడం మానవ మాత్రులకు సాధ్య మా? ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలి. లేకపోతే ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుంది. ప్రపంచంలోనే మన ప్రజాస్వామ్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని విస్మరిస్తే ఎలా? – హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబోమని రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం హైకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ హామీని హైకోర్టు ధర్మాసనం నమోదు చేసుకుంది. వార్డుల పునర్విభజనకు సంబంధించి ఇప్పటివరకు వచ్చిన అభ్యంతరాలు.. వాటిలో ఎన్ని పరిష్కరించారు.. తదితర వివరాలను కౌంటర్ రూపంలో తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటర్ల గుర్తిం పు, వార్డుల పునర్విభజన, అభ్యంతరాల స్వీక రణ తదితరాలకు గడు వును నిర్దేశి స్తూ ప్రభు త్వం జారీ చేసిన నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ నిర్మల్ జిల్లాకు చెందిన న్యాయవాది అంజున్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజనవ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గరువా రం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఆ హామీ ఏమైంది..? ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు 109 రోజుల సమయం అవసరమని సింగిల్ జడ్జి ఎదుట రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని పిటిషనర్ తరఫు న్యాయవాది నరేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో సింగిల్ జడ్జి మరో 10 రోజులు అదనంగా కలిపి 119 రోజుల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారన్నారు. ప్రభుత్వం 30 రోజుల్లోనే ఎన్నికల ప్రక్రియను హడావుడిగా పూర్తి చేసిం దని నివేదించారు. వార్డుల పునర్విభజనపై అభ్యంతరాలను కూడా చట్ట ప్రకారం పరిగణనలోకి తీసుకోవట్లేదన్నారు. ధర్మాసనం స్పం దిస్తూ సింగిల్ జడ్జికి ఇచ్చిన హామీకి విరుద్ధంగా ఎన్నికలను ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించింది. ఇదే మొదటిసారి.. ఎన్నికలకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేశా మని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వాకేట్ జనరల్(ఏఏజీ) జె.రామచంద్రరావు చెప్పారు. వార్డుల పునర్విభజన ఒక్కటే మిగిలి ఉందని పేర్కొన్నారు. 132 మున్సిపాలిటీల్లో 10 మున్సిపాలిటీలకు సంబంధించి మాత్రమే అభ్యంతరాలు వచ్చాయని చెప్పారు. వాటిని పరిష్క రించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ హడావుడిగా ఎన్నికలు నిర్వహించడం సబబు కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదంటూ ఎన్నికల సంఘం గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని గుర్తు చేసింది. ఇలా ఓ ప్రభుత్వంపై ఎన్నికల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం బహుశా ఇదే మొదటిసారి కావొచ్చని వ్యాఖ్యానించింది. ఇప్పటికిప్పుడు హడావుడిగా ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం తరఫున న్యాయవాది జి.విద్యాసాగర్ తెలిపారు. -
గెలుపు ఓటముల్లో అతివలదే హవా..
సాక్షి, దుబ్బాక: జిల్లాలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నాలుగు మున్సిపాలిటీల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో వారి తీర్పే కీలకం కానుంది. మున్సిపల్ అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నట్లు లెక్క తేల్చారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలుండగా సిద్దిపేట మినహా దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగనున్నాయి. నాలుగైదు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుండటంతో ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది. అధికంగా మహిళా ఉండటంతో మెజార్టీ సంఖ్యలో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లుగా మహిళలకే అవకాశం దక్కనుంది. మహిళలకు 50 శాతం వాటా ఉండడంతో పురుషుల కంటే మహిళ కౌన్సిలర్లు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.త్వరలోనే చైర్మన్లు, కౌన్సిలర్లకు రిజర్వేషన్లు ఖరారు కానుండడంతో ఏ మున్సిపాలిటీ చైర్మన్ మహిళకు దక్కుతుందో..? అని మున్సిపల్లో ఏ వార్డులు మహిళలకు రిజర్వు అవుతాయోనన్న తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికలు జరుగనున్న నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 79,401 మంది ఓటర్లున్నారు. ఇందులో మహిళలు 40,176 మంది, పురుషులు 39,224 మంది ఉన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో పురుష ఓటర్లు 9,785 ఉండగా.. మహిళలు 10,286 మంది ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే 501 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. హుస్నాబాద్‌లో 8,665 మహిళలు, 8,407 పురుష ఓటర్లున్నారు.ఇక్కడ 258 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. గజ్వేల్‌లో 15,078 మహిళలు, 15,052 పురుష ఓటర్లున్నారు. ఇక్కడ 26 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. చేర్యాలలో 6,147 మంది మహిళలు, 5,918 పురుష ఓటర్లున్నారు. ఇక్కడ 167 మంది మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. పై చేయి వారిదే.. గతంలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో మహిళల ఓట్లే అత్యధికంగా పోల్ కావడంతో త్వరలో జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లోను నారీమణులే కీలకంగా మారనున్నారు. గెలుపు, ఓటము నిర్ణయించడంలో వారిదే కీలక పాత్ర ఉండనుంది. అన్ని మున్సిపాల్టిల్లో మహిళల ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఈ ఎన్నికల్లో మహిళల ప్రాధాన్యత ప్రముఖంగా తయారైంది. పోలింగ్ శాతం కూడా గత ఎన్నికల మాదిరిగా మున్సిపల్లో కూడ మహిళలదే పై చేయిగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనా జిల్లాలో పురుషుల కంటే మున్సిపల్ ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారడం విశేషంగా చెప్పుకోవచ్చు. -
కౌంటింగ్ ఆరంభమైన అరగంట నుంచే ఫలితాలు
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఆరంభమైన అరగంటకే ఫలితాలు వెలువడుతున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు తెలంగాణ, సీమాంధ్రలోని పది కార్పొరేషన్లు, 145 మున్సిపాల్టీలకు కౌంటింగ్ మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్.. సీమాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోర పోరు నెలకొంది. చిత్తూరు, కడప జిల్లాల్లో వైఎస్ఆర్ సీపీ ముందంజలో ఉంది. ఎర్రగుంట్లలో వైఎస్ఆర్ సీపీ ఘనవిజయం సాధించింది.