బీహార్‌లోని గయ జిల్లాలోని బుద్ధగయలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది. బాగ్దాహాలోని కంచన్‌పూర్ గ్రామంలో శిక్షణ సమయంలో ఆర్మీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణ పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన ఎయిర్‌క్రాఫ్ట్‌లో లేడీస్ పైలట్, జెంట్స్ ఆర్మీ పైలట్ ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం కారణంగా బాగ్దాహా, బోధ్ గయ సమీపంలోని కంచన్‌పూర్ పొలాల్లో ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయింది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాన్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో అది మైదాన ప్రాంతంలో పడిపోయింది. శిక్షణలో ఉన్న పైలట్లిద్దరూ సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకున్న ఆర్మీ సైనికులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఎయిర్‌క్రాఫ్ట్‌ను తమ వెంట తీసుకెళ్లారు. గయలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ఆర్మీ సైనికులకు శిక్షణ అందిస్తుంటారు. శిక్షణ విమానం 200 నుంచి 400 అడుగుల ఎత్తులో ఎగురుతుంది. అంతకుముందు 2022లో కూడా శిక్షణ సమయంలో సాంకేతిక లోపం కారణంగా ఒక ఎయిర్‌క్రాఫ్ట్ పొలంలో కూలిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment