ఘటనల తాలూకు ఫోటోలు (ఏబీపీ వీడియో సౌజన్యంతో...)
పట్నా: బిహార్‌లో మానవమృగాళ్లు రెచ్చిపోయాయి. పైశాచికంగా ఇద్దరు యువతులపై కొందరు గ్రామస్తులు లైంగిక దాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఈ ఘటనలు వీడియో తీసి ఇంటర్నెట్‌లో పెట్టగా.. అవి కాస్త వైరల్ అయ్యాయి. బిహార్‌లో సంచలనం సృష్టించిన ఈ ఘటనల వివరాల్లోకి వెళ్తే...
గయలోని వాజిర్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఈ నెల 17, 18 తేదీల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. స్నేహితులతో వెళ్తున్న యువతులను అడ్డుకున్న కొందరు గ్రామస్థులు వారిని అడ్డుకున్నారు. వారితో ఉన్న వ్యక్తులను చితకబాది, ఆపై యువతుల దుస్తులను లాగి వారిని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. కొందరు ఆ ఘటనలను వీడియో తీసి వాట్సాప్ గ్రూప్‌లలో వైరల్ చేశారు. చివరకు వీడియోలు మీడియాకు చేరటం ద్వారా ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి.
దర్యాప్తు చేపట్టాం... కాగా, ఘటనలపై గయ ఏఏస్పీ రాజీవ్ మిశ్రా స్పందించారు. ‘మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్నాం. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకుని సుధీర్, విజయ్ యాదవ్ అనే ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగతా వారి కోసం గాలింపు చేపట్టాం. బాధిత యువతులకు న్యాయం కలిగేలా చూస్తాం. నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు’ అని ఆయన మీడియాతో చెప్పారు. ఈ ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రసారం చెయొద్దంటూ మీడియా ఛానెళ్లకు బాధిత యువతుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
కాగా, కొన్ని రోజుల క్రితం జహానాబాద్‌లో ఓ బాలికను అల్లరిమూక, దుస్తులు చించి లైంగికంగా వేధించిన వీడియో ఒకటి కలకలం రేపిన సంగతి తెలిసిందే. వరుసగా దుశాస్సన పర్వాలు వెలుగులోకి వస్తుండటంతో నితీశ్ సర్కార్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment