పట్నా: విత్తనాన్ని పాతితే మొక్కై హామీ ఇస్తుంది. ఆ తరువాత చెట్టుగా ఎదిగి రక్షణ ఇస్తుంది. బిహార్‌లో గయ ప్రాంతంలోని బెలగాంజ్ ఇసుకతిప్పలతో ఉంటుంది. చెట్లేమీ ఉండవు. మొక్క నాటాలనే ఆలోచన పొరపాటున కూడా రాదు. ఆ ఎడారిలాంటి ప్రదేశంలో పదిహేను సంవత్సరాల కాలంలో పదివేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించాడు సత్యేంత్ర మంఝీ. ఎం.ఏ చేసిన ఇతడికి ‘మౌంటెన్ మ్యాన్’గా ప్రసిద్ధుడైన దశ్‌రథ్ మంఝీ ఆదర్శం.
ఒకసారి దశరథ్ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ‘ఈ ఎడారిలో చెట్లు నాటవచ్చు కదా’ అన్నాడు. అదే సత్యేంద్రకు వేదవాక్కు అయింది. దశ్‌రథ్ ఒక్కడే 22 సంవత్సరాలు కష్టపడి కొండను తవ్వి, దారి వేసిన మహాకష్టంతో పోల్చితే తాను పడబోయే కష్టం ఎంత అనుకొని రంగంలోకి దిగాడు సత్యేంద్ర. ఆయన శ్రమ వృథా పోలేదు. ఇసుకదిబ్బలు ఇప్పుడు చెట్లయ్యాయి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది లేదు... అని మరోసారి నిరూపించిన పచ్చటి సత్యం ఇది.
చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి
Comments
Please login to add a commentAdd a comment