సాక్షి, న్యూఢిల్లీ: గయా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న విమానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ పైలట్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ప్యాసింజర్‌లను కడుబ్బా నవ్వించాయి. గత శనివారం జరిగిన సంఘటనను స్వయంగా సదరు మహిళ పైలట్ హనా ఖాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ రోజు ఢిల్లీ-గయా-ఢిల్లీ విమానంలో పనిచేశాను. ఈ క్రమంలో పెద్దావిడా గయా నుంచి ఢిల్లీ వెళుతోంది. ఈ సందర్భంగా ఆమె కాక్‌పిట్ చూడాలనుకుంది. ఇక అక్కడ నన్ను చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. (చదవండి: వైరల్ వీడియో: అసలు నిజం ఇదే..)
Did a Delhi-Gaya-Delhi flight today.
— Hana Khan (@girlpilot_) November 15, 2020
An elderly lady wanted to look into the cockpit & when she saw me, she exclaimed in an haryanvi accent
“Oi yahan to chorri baithi!”
Could not stop laughing!#aviationstories
వెంటనే హర్యానీ బాషలో ‘‘ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ కూర్చుంది’’ అని ఆశ్యర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ఫ్లైట్‌లో అందరిని నవ్వించాయి’ అని హనా తనకు ఎదురైన సరదా సన్నివేశాన్ని ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇక తన ట్వీట్‌కు ఇప్పటి వరకు వేలల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. అంతేగాక హనాపై నెటిజన్‌లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వృద్ద మహిళ తనకు ఎదురైన ఆశ్చర్యకరమైన క్షణాన్ని తప్పకుండా అందరితో పంచుకుంటుంది. అందులో సందేహం లేదు. ఇది నిజం స్పూర్తిదాయకమైనది. హనా నువ్వు ఎంతోమందికి ఆదర్శం. హాహాహా ఇది ఆ వృద్ద మహిళ ఊహించలేని సంఘటన కాబోలు. తన జీవితకాలం దీన్ని మరిచిపోదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: భూమ్మీద నూకలుండాలి గానీ..)
Comments
Please login to add a commentAdd a comment