women pilot
-
యంగ్ పైలట్ మృతి.. చిన్న దోమ ఎంత పనిచేసింది!
చిన్న దోమనే కదా అని లైట్ తీసుకున్నారో అంతే సంగతి. దోమ కారణంగా ఓ పైలట్ మృతి చెందింది. అదేంటి దోమతో ఎలా చనిపోయింది అనుకుంటున్నారా..?. ఈ విషాద ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. అయితే, ఏడాది క్రితం సదరు పైలట్ మృతిచెందగా నివేదిక తాజాగా బయటకు వచ్చింది. వివరాల ప్రకారం.. బ్రిటన్‌కు చెందిన ట్రెయినీ పైలట్ ఓరియానా పెప్పర్ దోమ కాటు కారణంగా కంటిపై చిన్న వాపు కనిపించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. దీంతో, ఆమెకు వైద్యులు యాంటీబయోటిక్స్ టీకాలు ఇచ్చి ఇంటికి పంపించారు. కాగా.. రెండు రోజుల తర్వాత ఆమె.. ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోయింది. దీంతో ఆందోళనలకు గురైన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో ఆమె ఆరోగ్యం విషమంగా మారింది. అనంతరం మృతిచెందింది. కాగా, ఆమె మృతి మిస్టరీ కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. తాజాగా నివేదికను వెల్లడించారు. దోమకాటు కారణంగా శరీరంలో తలెత్తిన ఇన్ఫెక్షన్ మెదడుకు చేరిన కారణంగా ఆమె మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా వైద్యులు.. చిన్న వయస్సులో ఆమె ఇలా దోమకాటుతో చనిపోవడం బాధాకరమని అన్నారు. ఇలా కొద్ది మందికే జరుగుతుందని అన్నారు. British pilot trainee dies after mosquito bite leads to infection in brain: reports https://t.co/TuuK5TNDxO pic.twitter.com/oVqhwx9cvA — New York Post (@nypost) July 6, 2022 ఇది కూడా చదవండి: జఫ్పా కేక్.. రికార్డులు బ్రేక్.. పేరు డిఫరెంట్‌గా ఉన్నా... టేస్ట్ మాత్రం సూపర్ -
ఏదీ సులభంగా రాదు: జోయా అగర్వాల్
అమె అతి చిన్న వయసులో బోయింగ్ –777 నడిపింది. తోడుగా నలుగురు మహిళా కెప్టెన్లను తీసుకొని కమాండింగ్ ఆఫీసర్‌గా ఎయిర్ ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఎగరేసి శాన్ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరు చేరుకుంది. ఇంతకాలం జోయా అగర్వాల్ ఘనతలు తెలుసు. ఆమె జీవితం తెలియదు. పైలెట్ కావడానికి తాను ఎంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చిందో చెప్పి ‘ఎనిమిదేళ్ల వయసులోనే నేను ఈ కలను కని సాధించుకున్నాను’ అందామె. ఆమె స్ఫూర్తి గాథ ఇది. జోయా గురించి ఏం చెప్పాలి? కోవిడ్ మొదలయ్యాక ప్రభుత్వం తలపెట్టిన ‘వందే భారత్ మిషన్’లో ఒక మహిళా పైలెట్‌గా పాల్గొని ఎయిర్ ఇండియా విమానాలను ఎగరేసి 12 దేశాల నుంచి 64 ట్రిప్పులు వేసి దాదాపు 15000 మంది భారతీయులను స్వదేశం చేర్చింది ఆమె. 2021 జనవరి నెలలో మరో నలుగురు మహిళా పైలెట్లతో కలిసి ఎయిర్ ఇండియా విమానం ముఖ్య పైలెట్‌గా శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకూ ఉత్తర ధ్రువం మీదుగా (ఆ సమయంలో వాతావరణ ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీల వరకూ ఉంటుంది) 17 గంటలు ఏకధాటిగా నడిపి రికార్డు సృష్టించిందామె. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే జోయా అగర్వాల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన జీవిత విశేషాలు పంచుకుంది. ఢిల్లీ ఆకాశంలో ఆకాశంలో ఎగిరే విమానాన్ని అందరూ చూస్తారు. కాని ఆ విమానం వీపున ఎక్కి ప్రపంచాన్ని చుట్టాలని కొందరే కలలు గంటారు. ఢిల్లీకి చెందిన జోయ చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు చూసేది. అప్పుడు ఆమెకు 8 ఏళ్ల వయసు. ‘ఆ విమానంలో నేను ఉంటే చుక్కలను చుట్టేద్దును కదా’ అని అనుకునేది. ఆ సమయంలోనే దూరదర్శన్‌లో రాజీవ్ గాంధీ కనిపించేవారు. ఎవరి మాటల్లోనో రాజీవ్ గాంధీ గతంలో పైలెట్‌గా పని చేశారని వింది జోయ. అప్పుడు ఆమెకు అనిపించింది తాను కూడా పైలెట్ కావాలని. దిగువ మధ్యతరగతి కుటుంబం. ఒక్కగానొక్క కూతురు. అలాంటి కుటుంబంలో ఆడపిల్లలు పెద్ద పెద్ద కలలు కనకూడదని సమాజం అనుకుంటుంది. కాని జోయకు లెక్కలేదు. తానొక కల కంది. దానిని నిరూపించుకుంటుంది అంతే. పది తర్వాత పదోక్లాసు వరకూ ఎలాగో తన మనసులోని కోరికను ఉగ్గపట్టుకున్న జోయ పది రిజల్ట్స్ వచ్చిన వెంటనే తన మనసులోని కోరిక తల్లిదండ్రులకు చెప్పింది. ‘ఓరి దేవుడో... డిగ్రీ చేయించి ఏదో ఒక మంచి ఇంట్లో పెళ్లి చేద్దామంటే ఈ అమ్మాయికి ఇదేం కోరిక’ అని తల్లి ముక్కు చీదడం మొదలెట్టింది. తండ్రి ‘అంత శక్తి మనకెక్కడిదమ్మా’ అని ఆందోళన చెందాడు. జోయ మరో దారిలేక ఇంటర్లో చేరింది. మంచి మార్కులు తెచ్చుకుంది. డిగ్రీ చేస్తూ మరోవైపు ఒక ఇన్స్టిట్యూట్లో ఏవియేషన్ కోర్సు చేసింది. అంటే తల్లిదండ్రుల కోసం డిగ్రీ... తన కోసం ఏవియేషన్. డిగ్రీలో కూడా మంచి మార్కులు వచ్చాక ‘నన్ను ఇప్పటికైనా పైలెట్‌ను కానివ్వండి’ అని తల్లిదండ్రులను కోరింది. తండ్రి అప్పుడు కూడ భయం భయంగానే లోను తెచ్చి ఆమె పైలెట్ కోర్సుకు డబ్బు కట్టాడు. మనసంతా పెట్టి ఆ కోర్సు పూర్తి చేసింది జోయ. 3000 మందితో పోటీ పడి పైలెట్ చదువు పూర్తయ్యాక రెండేళ్లు ఖాళీగా ఉన్న జోయ ఎయిర్ ఇండియాలో 7 పైలెట్ పోస్టులు పడ్డాయని తెలిసి ఎగిరి గంతేసింది. అయితే ఆ 7 పోస్టుల కోసం 3000 మంది దరఖాస్తు చేశారని తెలిసి కంగారుపడినా పట్టుదలగా ప్రయత్నించింది. ముంబైలో వారంలో పరీక్ష అనగా తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా తండ్రి ప్రోత్సాహంతో పరీక్షకు హాజరై ఇంటర్వ్యూలు దాటి ఆపాయింట్మెంట్ లెటర్ సాధించింది. 2004లో తన మొదటి ఫ్లయిట్‌ను దుబాయ్‌కు నడిపింది. ‘ఆ తర్వాత నేను వెనుదిరిగి చూడలేదు. నాన్న చేసిన అప్పులు తీర్చేశాను. అమ్మకు డైమండ్ కమ్మలు తెచ్చి పెట్టాను’ అంటుంది జోయ. ఆమె బోయింగ్ – 777ను నడిపిన అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది కూడా. స్త్రీల ప్రపంచం ‘నేను పైలెట్ అయినప్పుడు కోర్సులో చదువు చెప్పేవారు, ఉద్యోగంలో సహ ఉద్యోగులు అందరూ పురుషులే. మహిళా పైలెట్లు వేళ్ల మీద లెక్క పెట్టేంత మందే ఉండేవారు. స్త్రీలు తమ సమర్థతను చాటుకునేందుకు చాలా ఘర్షణ ఎదుర్కొనాల్సి ఉంటుంది. కాని ప్రయత్నిస్తే ఆ ఘర్షణకు ఆవల విజయం ఉంటుంది. నేను ఎప్పుడూ నా హృదయం చెప్పినట్టే వింటాను. నాకేదైనా సవాలు ఎదురైనప్పుడు 8 ఏళ్ల వయసు లో నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువైంది కదా... ఇప్పుడు కూడా సరైన నిర్ణయమే తీసుకుంటాను అనుకుని ముందుకు సాగుతాను.’ అంటుంది జోయ. ‘స్త్రీలు పెళ్లి చేసుకుని పిల్లలను కనాలి అనుకునే సమాజం ఇంకా మన దేశంలో ఉంది. కాని స్త్రీలు తమ హృదయం చెప్పినట్టు విని తాము దేనికైతే సమర్థులో ఆ సమర్థత చాటుకోవాలి. వారే కాదు ప్రతి ఒక్కరూ తమదైన కలను కని సాధించుకోవాలి’ అంటుంది జోయ. ఢిల్లీలో డాబా ఎక్కి విమానం చూసిన 8 ఏళ్ల చిన్నారి ఒకనాడు సుదీర్ఘమైన విమానయానం చేసి రికార్డు సృష్టించడాన్ని మించిన స్ఫూర్తిగాథ ఉందా. అలాంటి గాథలకు ఉదాహరణలుగా మనమెందుకు నిలవకూడదు? -
అదిగో ఆయేషా అజీజ్!
కొన్నింటిని అతిశయోక్తిగా చెప్పకపోతే, చెప్పడం మానడమే మేలు! అకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తే తమక్కూడా రెక్కలు ఉంటే బాగుండుననుకుంటారు పిల్లలెవరైనా. శ్రీనగర్‌లోని ఆడపిల్లలు మాత్రం ఆయేషా అజీజ్ గురించి వినగానే పక్షులైపోయి ఆకాశంలో విహరిస్తారు! ఆయేషా కమర్షియల్ పైలట్. దేశంలోనే అతి చిన్న వయసులో పైలట్ అయిన అమ్మాయి! పదిహేనేళ్ల వయసుకే ఆమెకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఇప్పుడు ఆమె వయసు ఇరవై ఐదు. భారతదేశ ప్రసిద్ధ వార్తా సంస్థ ఎ.ఎన్.ఐ. (ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్) ఆయేషా పదేళ్ల పైలట్ జర్నీ గురించి ఇంటర్వ్యూ చేయడంతో తాజాగా ఆమె వార్తల్లోకి వచ్చారు. ఆయేషా అజీజ్ పేరు మొదటిసారి 2011 లో దేశానికి తెలిసింది. అది ఆమె పైలట్ లైసెన్స్ సాధించిన సంవత్సరం. శిక్షణ కోసం లైసెన్స్ అది. శిక్షణ రష్యాలోని సొకోల్ వైమానిక స్థావరంలో! ప్రారంభంలోనే ఎం.ఐ.జి.–29 జెట్‌ను నడపడం నేర్చుకున్నారు ఆయేషా. ఆ తర్వాత ఆమె సాధించవలసింది కమర్షియల్ లైసెన్స్. బాంబే ఫ్లయింగ్ క్లబ్లో చేరి విమానయానంలో డిగ్రీ సాధించాక ఆ లైసెన్స్ కూడా వచ్చేసింది. అది 2017లో. 2011లో లైసెన్స్ పొందాక తన ఈ పదేళ్ల ప్రస్థానం గురించి ఎ.ఎన్.ఐ. తో మాట్లాడుతున్నప్పుడు ఆయేషా తన గురించి కాక, కశ్మీర్లో ఇప్పుడు చక్కగా చదువుకుని పైకొస్తున్న ఆడపిల్లల గురించే ఎక్కువగా ప్రస్తావించారు. ‘వాళ్లలో పైలట్ అవాలనుకున్న అమ్మాయిలకు మీరే ఇన్స్పిరేషన్ అయుండొచ్చు కదా..’ అన్న మాటకు, ‘కావచ్చేమో!’ అని నవ్వారు ఆయేషా. పైలట్ గా ఆమె తన కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ‘‘ఎందుకంటే నాకు 9–5 ఉద్యోగం పడదు. నాకే కాదు.. అసలు ఏ అమ్మాయికీ అలాంటి ఉద్యోగం ఇష్టం ఉండదు. అవకాశం ఉండాలే కానీ, ఖండాలన్నీ తిరగాలనుకుంటుంది. అంతుకు తల్లిదండ్రులే లాంచింగ్ స్టెప్ అవాలి..’’ అంటారు ఆయేషా. ∙∙ ఆయేషాకు ఆకాశంలో ఎగరాలని మరీ చిన్న వయసులోనే మనసులో పడిపోయింది. వందల మంది ప్రయాణీకులను సురక్షితంగా గమ్యం చేర్చే ఉద్యోగం ఎంత థ్రిల్‌గా చెప్పడానికే ఆమె ఏ సమయంలోనైనా ఉత్సాహం చూపుతారు. తల్లిదండ్రులిద్దరూ రెండు చేతులతో భద్రంగా పైకి ఎగరేసిన పైలట్ పావురం ఆయేషా. వారు పెద్ద సపోర్ట్ ఆమె కెరీర్‌కు. ‘యంగెస్ట్ స్టూడెంట్ పైలట్’ అనే రికార్డు కూడా ఇప్పటికీ ఆమె పేరు మీదే ఉంది. ఆయేషా పుట్టింది కశ్మీర్లో. పెరిగింది ముంబైలోని వర్లీలో. తల్లితో కలిసి ముంబై నుంచి అమ్మమ్మ వాళ్లుండే జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాకు తరచు విమానంలో వెళ్లివస్తుండంతో తనూ విమానాన్ని నడపాలని అనుకుంది ఆయేషా! ఆ మాటే అమ్మానాన్నకు చెబితే.. ‘తప్పకుండా.. అయితే అందుకు కష్టపడి చదవాల్సి ఉంటుంది’ అని చెప్పారు. టెన్త్ పూర్తి చేయగానే ఆమె ఆశకు పైలట్ కోర్సుతో రెక్కలు కట్టారు. పైలట్ అయ్యాక తొలిసారి అమ్మానాన్న ఉన్న విమానాన్ని నడపడం ఆయేషా జీవితంలోని మరపురాని అపురూప ఘటన. ఇక తల్లిదండ్రులు గర్వ పడకుండా ఉంటారా.. కూతురు కూర్చోబెట్టి తమను, ఇంకా మరికొంతమందిని గాల్లో తేలియాడిస్తుంటే! బాంబే ఫ్లయింగ్ క్లబ్లో లైసెన్స్ సాధించాక 2012లో ‘నాసా’లో కూడా రెండు నెలల ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు ఆయేషా! అక్కడ ఆమెకు జాన్ మెక్‌బ్రైడ్ అనే నాసా రిటైర్డ్ వ్యోమగామి పరిచయం అయ్యారు. స్పేస్ షటిల్ మిషన్, మైక్రో గ్రావిటీ, మాన్డ్ మానోవరింగ్ (విన్యాసాలు), మల్టీ యాక్సిస్ ట్రైనింగ్, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీ.. వీటన్నిటిలో మెక్‌బ్రైడ్ ఆమెకు మెళకువలు నేర్పారు. ∙∙ జాన్ మెక్‌బ్రైడ్ తర్వాత ఆమెలో పూర్తి స్థాయి స్ఫూర్తిని నింపినవారు నాసాలోని భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్. స్వయంగా వెళ్లి సునీతను కలుసుకున్నారు ఆయేషా. నీటిలో స్కూబా డైవింగ్, నింగిలో మూన్ వాక్‌లలో తన అనుభవాలను ఆయేషాతో పంచుకుని ఆమె కలలకు ఇంధనాన్ని నింపారు సునీత. 1960లో ప్రైవేట్ పైలట్ లైసెన్స్‌తో ప్రయాణీకుల విమానాన్ని నడిపిన తొలి భారతీయ మహిళా పైలట్ రబియా ఫతే అలీ దగ్గర కూడా ఆయేషా ఆసక్తి కొద్దీ మరికొన్ని నైపుణ్యాలు నేర్చుకున్నారు. పైలట్ శిక్షణ లైసెన్స్ సంపాదించాక 2012లో శిక్షణలో భాగంగా తొలిసారి ఎం.ఐ.జి జెట్‌ను నడిపినప్పుడు ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని అంటారు ఆయేషా. ఆనాటి చిన్న పిల్ల ఇప్పుడు ‘ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్’ లో ప్రతిష్టాత్మక సభ్యురాలు. అయితే స్టూడెంట్ పైలట్‌గా, పైలట్‌గా, అసోసియేషన్ సభ్యురాలిగా ఘనమైన గుర్తింపు కలిగి ఉన్న ఆయేషాకూ కొన్ని ఒత్తిడిలు తప్పలేదు. సంప్రదాయ శిరోవస్త్రాన్ని (హిజబ్) ఎందుకు ధరించరనే ప్రశ్నను ఆమె ఇప్పటికీ ఎదుర్కొంటూనే ఉన్నారు! అందుకు ఆమె దగ్గర సమాధానం కూడా ఉంది. ‘‘ప్రవక్త భార్య హజ్రత్ ఆయేషా యుద్ధంలో ఒంటెను స్వారీ చేయించగా లేనిది, నేను విమానాన్ని నడిపేందుకు సంప్రదాయాలు ఎందుకు అడ్డపడాలి?’’ అంటారు ఆయేషా. 2018 జనవరిలో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో ఆర్మీ చీఫ్, రాష్ట్రపతి చేతుల మీదుగా ‘ఫస్ట్ లేడీస్’ టైటిల్‌ను అందుకున్న ఆయేషా.. పైలట్లు కావాలన్న ఉత్సాహం ఉండీ, ఆర్థికంగా వెలుసుబాటు లేని అమ్మాయిల్ని పైలట్లుగా ప్రోత్సహించేందుకు ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్ తరఫున కృషి చేస్తున్నారు. -
హాహాహా... ఊహించలేని సంఘటన ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: గయా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న విమానంలో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ పైలట్‌ను చూసి ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ప్యాసింజర్లను కడుబ్బా నవ్వించాయి. గత శనివారం జరిగిన సంఘటనను స్వయంగా సదరు మహిళ పైలట్ హనా ఖాన్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఈ రోజు ఢిల్లీ-గయా-ఢిల్లీ విమానంలో పనిచేశాను. ఈ క్రమంలో పెద్దావిడా గయా నుంచి ఢిల్లీ వెళుతోంది. ఈ సందర్భంగా ఆమె కాక్‌పిట్ చూడాలనుకుంది. ఇక అక్కడ నన్ను చూసి ఆమె ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. (చదవండి: వైరల్ వీడియో: అసలు నిజం ఇదే..) Did a Delhi-Gaya-Delhi flight today. An elderly lady wanted to look into the cockpit & when she saw me, she exclaimed in an haryanvi accent “Oi yahan to chorri baithi!” Could not stop laughing!#aviationstories — Hana Khan (@girlpilot_) November 15, 2020 వెంటనే హర్యానీ బాషలో ‘‘ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ కూర్చుంది’’ అని ఆశ్యర్యపోతూ చేసిన వ్యాఖ్యలు ఫ్లైట్‌లో అందరిని నవ్వించాయి’ అని హనా తనకు ఎదురైన సరదా సన్నివేశాన్ని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇక తన ట్వీట్‌కు ఇప్పటి వరకు వేలల్లో లైక్‌లు వందల్లో కామెంట్స్ వచ్చాయి. అంతేగాక హనాపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వృద్ద మహిళ తనకు ఎదురైన ఆశ్చర్యకరమైన క్షణాన్ని తప్పకుండా అందరితో పంచుకుంటుంది. అందులో సందేహం లేదు. ఇది నిజం స్పూర్తిదాయకమైనది. హనా నువ్వు ఎంతోమందికి ఆదర్శం. హాహాహా ఇది ఆ వృద్ద మహిళ ఊహించలేని సంఘటన కాబోలు. తన జీవితకాలం దీన్ని మరిచిపోదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (చదవండి: భూమ్మీద నూకలుండాలి గానీ..) -
రఫేల్‌కు మహిళా పైలట్
న్యూఢిల్లీ: వైమానిక దళంలో ఇటీవలే చేరిన అత్యాధునిక రఫేల్ ఫైటర్ జెట్ల దళంలోకి త్వరలో మహిళా పైలట్ ఒకరు చేరనున్నారు. మిగ్–21 ఫైటర్ జెట్ల మహిళా పైలట్ ఒకరు అంబాలా కేంద్రంగా పనిచేసే గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లోకి ఎంపికయ్యారని భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అధికారి ఒకరు తెలిపారు. రఫేల్ ఫైటర్ జెట్ పైలట్ కోసం చేపట్టిన అత్యంత కఠినమైన పరీక్షల్లో ఎంపికయిన ఈ మహిళా పైలట్ ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారని ఆ అధికారి వెల్లడించారు. అత్యంత సమర్థమైనవిగా పేరున్న రఫేల్ యుద్ధ విమానాలకు మహిళా పైలట్ ఎంపిక కావడం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుందని పేరు వెల్తడించటానికి ఇష్టపడని ఐఏఎఫ్ అధికారి ఒకరు పేర్కొన్నారు. 2018లో యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళా పైలట్‌గా అవనీ చతుర్వేది చరిత్ర సృష్టించారు. అప్పట్లో ఆమె మిగ్–21 బైసన్ విమానాన్ని సొంతంగా నడిపారు. యుద్ధ విమానాల కోసం ప్రయోగాత్మకంగా మహిళలను ఎంపిక చేయాలన్న ప్రభుత్వం నిర్ణయం మేరకు.. 2016 జూలైలో ఎంపికైన ముగ్గురు మహిళల బృందంలో ఈమె కూడా ఒకరు. మిగతా ఇద్దరు పైలట్లు భావనా కాంత్, మోహనా సింగ్. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో 10 మంది మహిళా పైలట్లు, సహాయకులుగా మరో 18 మంది ఉన్నారు. ఐఏఎఫ్‌లో మొత్తం మహిళా అధికారుల సంఖ్య 1,875. కాగా, రఫేల్ ఫైటర్ జెట్లు ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న భారత్, చైనా సరిహద్దుల్లోని లద్దాఖ్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్ ఫైటర్ జెట్లు అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో ఈ నెల 10వ తేదీన అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. మొట్టమొదటి సారిగా 1951లో అంబాలా వైమానిక స్థావరంలో ఏర్పాటయిన ఈ స్క్వాడ్రన్ పేరిట పలు రికార్డులు నమోదై ఉన్నాయి. 1955లో మొట్టమొదటి ఫైటర్ జెట్ డి హవిల్లాండ్ వాంపైర్ ఈ స్క్వాడ్రన్లోనే చేరింది. ఫ్రాన్సుతో కుదుర్చుకున్న రూ.59వేల కోట్ల ఒప్పందంలో భాగంగా జూలైలో మొదటి విడతగా ఐదు రఫేల్ యుద్ధ విమానాలు వచ్చిన విషయం తెలిసిందే. నవంబర్ కల్లా రెండో విడతలో మరో నాలుగు, 2021 చివరి నాటికి మొత్తం 36 విమానాలు చేరనున్నాయి. రష్యా నుంచి సుఖోయ్ జెట్లను కొనుగోలు చేసిన 23 ఏళ్ల తర్వాత భారత్ యుద్ధ విమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న భారీ ఒప్పందమిది. -
మొదటి కార్గిల్ గర్ల్ నేనే: శ్రీవిద్య రాజన్
కార్గిల్ గర్ల్‌గా పేరు సంపాదించుకున్న గుంజన్ సక్సెనా బయోపిక్‌పై విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. సినిమాలోని కొన్ని సన్నివేశాల పట్ల ఐఏఎఫ్ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజగా గుంజన్ సక్సెనా సహోద్యోగి శ్రీవిద్య రాజన్ కూడా చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె కూడా 1999 కార్గిల్ యుద్ధ సమయంలో గుంజన్‌తో కలిసి ఐఏఎఫ్‌లో హెలికాప్టర్ పైలట్‌గా పని చేశారు. తాజాగా శ్రీవిద్య ఫేస్బుక్ వేదికగా గుంజన్ సక్సెనా చిత్రంపై తన అభ్యంతరాలను తెలిపారు. అప్పటివరకు కేవలం పురుషులే ఉన్న రంగంలో తొలిసారి తాము చేరినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవమే అన్నారు. సహచర మగ ఉద్యోగులు కొందరు తాము అసలు ఈ రంగంలో ఎలా ఉంటామా అని అనుమానంగా చూశారని.. కానీ చాలా కొద్ది సమయంలోనే వారు తమను అంగీకరించారని శ్రీవిద్య తెలిపారు. అంతేకాక ప్రారంభంలో తమకు ప్రత్యేకంగా టాయిలెట్స్ కానీ, డ్రెస్ మార్చుకునే రూములు కానీ లేవని వెల్లడించారు. అలానే శిక్షణలో తాము చేసే కొన్ని తప్పులను ప్రత్యేకంగా ఎత్తి చూపేవారని.. సరిదిద్దుకునే వరకూ ఊరుకోకపోయేవారన్నారు శ్రీవిద్య. ఇవే తప్పులు మగ ఉద్యోగులు చేస్తే పెద్దగా పట్టించుకునే వారు కాదన్నారు. అలానే 1996లో తనకు, గుంజన్‌కు ఇద్దరికి ఉధంపూర్‌లో పొస్టింగ్ ఇచ్చారని.. కానీ సినిమాలో మాత్రం గుంజన్‌ను మాత్రమే ఉధంపూర్ పంపించినట్లు తప్పుగా చూపించారని తెలిపారు. అంతేకాక సినిమాలో చూపించినట్లు చిన్న చిన్న సిల్లీ రీజన్ల వల్ల తమ బాధ్యతలు ఎప్పుడు పోస్ట్‌పోన్ కాలేదన్నారు. ఎంతో అనుభవం, నైపుణ్యం కల స్క్వాడ్రన్ కమాండర్లు తమకు శిక్షణ ఇచ్చేవారని తెలిపారు. ఆడ, మగ ఎవరూ తప్పు చేసినా ఒకేలాంటి శిక్ష విధించేవారన్నారు. అంతేకానీ సినిమాలో చూపించినట్లు అవమానించడం.. సామార్థ్యాన్ని కించపర్చడం లాంటివి చేసేవారు కాదన్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొదటి మహిళా పైలెట్ తానే అన్నారు శ్రీ విద్య. కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు తొలుత తాను ఉధంపూర్ వెళ్లానని.. తరువాత గుంజన్ తన టీంతో కలిసి శ్రీనగర్ వెళ్లిందన్నారు శ్రీవిద్య. అప్పుడు తాము అన్ని విభాగాల్లో విధులు నిర్వహించామని తెలిపారు శ్రీ విద్య. (ఆ విషయంలో గిల్టీగా ఉంది: జాన్వీ) సినిమా క్లైమాక్స్‌లో వచ్చిన సీన్లు పూర్తిగా అబద్దం అన్నారు శ్రీవిద్య. అలాంటి సినిమాటిక్ సీన్లు కేవలం మూవీస్‌లో మాత్రమే ఉంటాయని.. వాస్తవంగా ఎన్నటికి జరగవన్నారు. గుంజన్ సక్సెనా తన కెరీర్లో ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కిస్తే.. యువతకు స్ఫూర్తిగా ఉంటుందన్నారు. కానీ సినిమాలో కొన్ని చోట్ల మహిళలని కించపర్చడం.. ఐఏఎఫ్‌ను తక్కువ చేసి చూపడం తనకు నచ్చలేదన్నారు. మహిళా పైలెట్లుగా తమను ఎంతో గౌరవ మర్యాదలతో చూశారని తెలిపారు. గుంజన్ ఒకసారి వీటన్నింటి పరిశీలించి.. మార్పులు చేసిన తర్వాత సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే బాగుండేదన్నారు శ్రీవిద్య. కార్గిల్ యుద్ధంలో మగ ఆఫీసర్లు తమకంటే ఎక్కువే కష్టపడ్డారని.. కానీ వారు ఎలాంటి గుర్తింపు కోరుకోవడం లేదన్నారు శ్రీవిద్య. తమకు లభించిన ఈ గుర్తింపు కూడా కేవలం జండర్ ఆధారంగానే లభించిందన్నారు. అయితే భద్రతాదళాల్లో సేవ చేసినప్పుడు ఆడ, మగ అనే తేడా ఉండదన్నారు. యూనిఫామ్ వేసుకుంటే ప్రతి ఒక్కరూ ఆఫీసర్ మాత్రమే అని తెలిపారు శ్రీవిద్య. (స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?) శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, గుంజన్ సక్సెనా పాత్రలో నటించిన ఈ సినిమాకు శరణ్ శర్మ దర్శకత్వం వహంచారు. థియేటర్లో విడుదల చేయాల్సి ఉన్నప్పటికి లాక్డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయిన సంగతి తెలిసిందే. -
స్త్రీ స్వాతంత్య్రానికి మగాళ్లు ఓకే అనాలా?
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్త్రీకి స్వాతంత్య్రం వచ్చిందా? కలలు కనడానికి. కెరీర్‌ను నిర్మించుకోవడానికి. పంజరాలను బద్దలు కొట్టడానికి. స్వేచ్ఛాభావనలు వికసించడానికి. నిరోధాల బెదురు లేకుండా జీవించడానికి. వీటన్నింటి కోసం మగాళ్ల అనుమతికి ఎదురుచూస్తూ ఉండాలా? మగాళ్ల పర్మిషన్ కావాలా? అక్కర్లేదు అని చెప్పే స్ఫూర్తిదాతలు చాలామంది ఉన్నారు. గుంజన్ సక్సెనా అలాంటి స్ఫూర్తిదాత. ఆమెపై వచ్చిన సినిమా ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్త్రీలకు అందిన కానుక. ‘అన్నయ్యా... పెద్దయ్యాక నేను పైలెట్ అవుతా’ ‘పైలెట్ అవుతావా? ఇదిగో ఈ గిన్నె పట్టుకో. నువ్వు చేయాల్సిన పని కూర వడ్డించమంటారా? పప్పు వడ్డించమంటారా అని అడగడమే. ముందు అది నేర్చుకో’ చిన్నప్పటి నుంచి తెలుసో తెలియకో మగపిల్లల బుర్రల్లో ఎక్కించే భావజాలం ఇది. పెద్దయ్యాక ఇది మగభావజాలం అవుతుంది. సమాజ భావజాలం అవుతుంది. చివరకు దేశభావజాలంగా మారి స్త్రీలపై పెత్తనం చలాయిస్తుంది. ఆడపిల్లలు విమానం ఎగరేయకూడదా? రైట్‌బ్రదర్స్ విమానాన్ని పూర్తిస్థాయిలో కనిపెట్టినప్పుడు దాని యోక్ (కంట్రోల్ వీల్) కేవలం పురుషులను ఉద్దేశించే తయారు చేసి ఉంటారా? పదేళ్ల బాలికగా గుంజన్ సక్సెనా పెద్దయ్యి పైలెట్ అవ్వాలి అనుకున్నప్పుడు సోదరుడు ప్రదర్శించిన హేళనను తండ్రి ఖండిస్తాడు. ‘విమానాన్ని స్త్రీ ఎగరేసినా పురుషుడు ఎగరేసినా ఎగరేసేవారిని పైలెట్ అనే అంటారు. విమానానికి ఈ వ్యత్యాసం లేనప్పుడు మనమెందుకు వ్యత్యాసం పాటించడం?’ అంటాడు. నిజజీవితంలో గుంజన్ సక్సెనా కథకు, సినిమాలో గుంజన్ సక్సెనా కథకు ఇక్కడి నుంచే మొదలు. నిజం కథ గుంజన్ సక్సెనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫ్లయిట్ లెఫ్టినెంట్‌గా విశేష సేవలందించిన తొలి మహిళా పైలెట్లలో ఒకరు. లక్నోకు చెందిన గుంజన్ ఢిల్లీలో చదువుకుంది. 1994లో తొలిసారి మహిళా ట్రైనీస్‌కు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్రవేశం కల్పించినప్పుడు 25 మంది బ్యాచ్‌లో ఒకరిగా ఎంపికైంది. ట్రయినింగ్ పూర్తయ్యాక ఉధమ్‌పూర్ (జమ్ము–కాశ్మీర్) ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు తదుపరి శిక్షణకు వస్తుంది. అక్కడ ఆమెకు అంతవరకూ అలవాటై ఉన్న పురుషావరణ ధోరణిలో అడ్జెస్ట్ అవడానికి టైమ్ పడుతుంది. నిజం చెప్పాలంటే అంతవరకూ అక్కడకు రాని మహిళలను ఎలా అర్థం చేసుకోవాలో వారితో ఎలా వ్యవహరించాలో పురుష ఆఫీసర్లకు తెలియదు. చివరకు గుంజన్ సక్సెనా విశేష ప్రతిభ కనబరిచి ఫ్లయింగ్ ఆఫీసర్ అవుతుంది. 1999లో వచ్చిన కార్గిల్ వార్ ఆమె సామర్థ్యానికి ఒక సవాల్. యుద్ధంలో గాయపడిన, మృతి చెందిన సైనికులను హెలికాప్టర్ ద్వారా తెచ్చే బాధ్యత గుంజన్ది. ఇది ప్రమాదకరం. ముష్కరులు హెలికాప్టర్‌ను పేల్చేయొచ్చు కూడా. కాని కార్గిల్‌వార్ జరిగిన 2 నెలల 3 వారాల్లో గుంజన్ లెక్కకు మించిన ఆపరేషన్స్‌లో పాల్గొని దాదాపు 900 మందికి పైగా సైనికులను తిరిగి బేస్‌కు చేర్చింది. అందుకే ఆమె ‘కార్గిల్ గర్ల్’ అయ్యింది. కార్గిల్ వార్‌లో పని చేసిన ఏకైక మహిళ ఆమె. 2004లో పదవీవిరమణ చేసింది. సినిమా కథ గుంజన్ సక్సెనా జీవితం ఆధారంగా తీసిన సినిమా కొత్త ఆలోచనలు చేసే స్త్రీలకు పురుష కేంద్రక సమాజంలో ఎదురయ్యే అవరోధాలను గాఢంగా చర్చించింది. స్త్రీలను పురుష సమాజం రెండు విధాలుగా అడ్డుకుంటుంది. ఒకటి ప్రొటెక్టివ్ కన్సర్న్తో. రెండు చులకనభావంతో. ఈ సినిమాలో గుంజన్ సోదరుడు ‘నీకేమైనా అయితే? నీకెందుకు ఇదంతా? నువ్వు డేంజర్లో పడతావ్?’ లాంటి ‘ప్రేమకట్టడి’తో నిరోధించడానికి చూస్తాడు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో ‘నువ్వు బలహీనురాలివి. ఇక్కడ దుర్బలులకు చోటు లేదు. అసలిది స్త్రీలు చేయాల్సిన పని కాదు’ అని చులకన భావంతో నిరోధిస్తారు. అయితే మగవాళ్లలో కూడా మంచి మగవాళ్లు ఉంటారు. గుంజన్ సక్సెనాకు తండ్రి మద్దతు చాలా ఉంటుంది. ఆమెకు అతడు ప్రతిక్షణం సపోర్ట్ చేస్తాడు. ‘కష్టాన్ని నమ్ముకున్నవారికి విజయం ద్రోహం చేయదు’ అంటాడతను. ఎయిర్‌ఫోర్స్‌ను అర్ధంతరంగా వదిలిపెట్టి ‘పెళ్లి చేసుకొని సెటిలవుతాను’ అని గుంజన్ అన్నప్పుడు ‘సమాజమంతా స్త్రీని వంటగదికి సెటిల్ చేయాలని చూస్తోంది. నువ్వు కూడా వారిలో చేరతావా?’ అని కర్తవ్యాన్ని ప్రేరేపిస్తాడు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో కూడా ఒక సీనియర్ ఆఫీసర్ ఆమెకు మద్దతుగా నిలుస్తాడు. ఆమెకు తర్ఫీదు ఇస్తాడు. ఎగిరే చిరుతలా తీర్చిదిద్దుతాడు. నకిలీ మగతనం స్త్రీని గౌరవించడం, స్త్రీని పై అధికారిగా స్వీకరించడం, స్త్రీకి సెల్యూట్ చేయడం వల్ల మగవారి తలపాగలు ఊడి కిందపడవు... దాని వల్ల వారి మగతనానికి ఏమీ ఢోకా రాదు అని ఈ సినిమా స్టేట్మెంట్ ఇస్తుంది. ‘నన్ను మీరంతా ఎందుకు నిరోధిస్తున్నారో నాకు తెలుసు. నేను ఆఫీసర్ అయితే సెల్యూట్ చేయాల్సి వస్తుందని మీ భయం. చేస్తే ఏమవుతుంది? అలా చేస్తే పోయే మగతనం నకిలీ మగతనం’ అని గుంజన్ ఒకచోట అంటుంది. బండి మీద ఒంటరిగా వెళ్లే యువతులను చున్నీ లాగి కిందపడేసే ఈ రోజుల్లో కూడా స్త్రీలను గౌరవించడం, స్త్రీ ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని చెప్పడం పదే పదే చేయాల్సి వస్తుంది. అందుకు గుంజన్ సక్సెనా కూడా ఒక సమర్థమైన సినిమా రూపం. గుంజన్‌గా జాన్హీ్వ కపూర్ ప్రశంసాత్మకంగా చేసింది. స్త్రీలకు ఎవరూ స్వాతంత్య్రం ఇవ్వాల్సిన పని లేరు. అది వారి హక్కు. అందరిలాగే వారు తమ స్వేచ్ఛా స్వాంతత్య్రాలను పొందగలరు. నిభాయించుకోగలరు. పురుషులు చేయాల్సింది అందుకు నిరోధంగా నిలబడకపోవడం. జెండా వందనానికి అందరం తల ఎత్తుతాం. స్త్రీలు కూడా స్వేచ్ఛగా తల ఎత్తే సకల సాంఘిక, సామాజిక, కౌటుంబిక ఆవరణాలలోకి ఈ దేశం పయనించాలని ఈ స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఆశిద్దాం. ‘గుంజన్ సక్సెనా’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. – సాక్షి ఫ్యామిలీ -
‘భర్తకు దూరంగా ఎలా ఉంటున్నారు’
న్యూఢిల్లీ : మహిళ పైలెట్‌ను వేధింపులకు గురి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ సినీయర్ కెప్టెన్‌పై ఎయిర్ ఇండియా యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సదరు సీనియర్ కెప్టెన్ తనను ఇబ్బందికర ప్రశ్నలతో వేధించినట్లు మహిళా పైలెట్ ఫిర్యాదు చేసింది. దాంతో ఆ కెప్టెన్‌పై విచారణకు ఆదేశించాం’ అని తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఈ నెల 5వ తేదీని ట్రెయినింగ్ సెషన్ పూర్తయిన తర్వాత సదరు కెప్టెన్ నన్ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. గతంలో నేను అతనితో కలిసి పని చేశాను. ఆ కారణంగా డిన్నర్‌కు వెళ్లేందుకు అంగీకరించాను. తొలుత అతను మర్యాదగానే ప్రవర్తించాడు. తర్వాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం’ అన్నారు. ‘అక్కడ నుంచి నన్ను వేధించడం ప్రారంభించాడు. తన వివాహ జీవితంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. అంతటితో ఊరుకోక భర్తకు దూరంగా ఉంటున్నారు.. మీకు ఏం అనిపించడం లేదా అని పలు అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతూ నన్ను ఇబ్బంది పెట్టాడు. దాంతో నాకు చిరాకు పుట్టి.. మీతో ఇవన్ని మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను’ అని సదరు మహిళా పైలెట్ తెలిపారు. అతడు నన్ను నైతికంగా అవమానించాడు. ఆ కెప్టెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
ఆమె చేసిన పనితో గుండెలు గుభేల్; వైరల్
లాస్ఏంజెల్స్: ఎయిర్‌పోర్ట్‌లో దిగాల్సిన విమానం ఒక్కసారిగా రద్దీ రోడ్డు మీదికి దూసుకొచ్చేసరికి జనం భీతిల్లిపోయారు. రోడ్డు నిండా కార్లు.. ఇరువైపులా కరెంటు తీగలు.. ఏ కొంచెం అటుఇటైనా పర్యవసానం తీవ్రంగా ఉండేది. వెంట్రుకవాసిలో ప్రమాదం తప్పినా ఆ పైలట్ చేసిన పనికి వాహనదారుల గుండెలు గుభేల్మన్నాయి. అమెరికాలో అత్యంత జనసమ్మర్థం గల రెండో అతిపెద్ద నగరం లాస్ఏంజెల్స్లో శుక్రవారం చోటుచేసుకున్న ఈ సంఘటన తాలూకు వీడియోలూ వైరల్ అయ్యాయి. అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్: సెస్నా 172 రకానికి చెందిన తేలికపాటి విమానం జాన్ వెయిన్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఇంజన్లో లోపం తలెత్తింది. ఎయిర్‌పోర్టుకు తిరిగెళదామని పైలట్ అనుకునేలోపే మొత్తానికే పనిచేయడం ఆగిపోయింది. క్రాష్ ల్యాండింగ్ తప్పదనుకున్నా.. చివరి ప్రయత్నంగా హంటింగ్టన్ బీచ్ రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నించిందామె. వెంట్రుకవాసిలో కార్లను, కరెంటు తీగల్ని దాటుకుంటూ మొత్తానికి సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలో మహిళా పైలట్ ఒక్కరే ఉన్నారని, ఈ ఘటనలో రోడ్డుపై ఉన్నవారిలో ఏ ఒక్కరూ గాయపడలేదని, విమాన సర్వీసులకు కూడా ఆటంకం కలుగలేదని ఎల్ఏపీడీ, ఏవియేషన్ అధికారులు తెలిపారు. అయితే జాగ్రత్త చర్యల్లో భాగంగా విమానం ఎమర్జెన్సీ ల్యాండైన హంటిగ్టన్ రోడ్డును కొద్ది గంటలపాటు మూసేశారు. ఇది అత్యంత అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని, పైలట్ అద్భుతం సృష్టించారని కొందరు ఏవియేషన్ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇంతకీ ఆ మహిళా పైలట్ ఎవరన్న విషయాన్ని మాత్రం అధికారులు గోప్యంగా ఉంచారు. ఆమె ఆరెంజ్ కంట్రీ ఫ్లైట్ క్లబ్లో శిక్షణ పొందుతున్నారని, సదరు విమానం జేజీ క్యాపిటల్ హోల్డింగ్స్ సంస్థకు చెందినదని తెలిసింది. -
ఆమె చేసిన పనితో గుండెలు గుభేల్
-
‘మహిళా పైలట్.. మీకు సెల్యూట్..’
వాషింగ్టన్ : సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన మహిళా పైలట్ టామ్ జో షల్ట్స్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభినందించారు. గత నెల 17న సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ 1380 విమాన ఇంజిన్ పేలిపోవడంతో ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పైలట్ టామ్ జో షల్ట్స్ చాకచక్యంగా వ్యవహరించి 144 మంది ప్రాణాలను కాపాడారు. ఈ నేపథ్యంలో పైలట్ టామ్‌తోపాటు విమాన సిబ్బందిని అభినందించేందుకు ట్రంప్ వారిని వైట్‌హౌజ్‌కి ఆహ్వానించారు. ఓవల్ ఆఫీస్‌లో వారితో సమావేశమైన ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎంతోమంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన, ధైర్యవంతులైన హీరోలు వైట్‌హౌజ్‌కి రావడం నాకెంతో గర్వంగా ఉందం’టూ అభినందించారు. ‘మీ ధైర్యం వల్లే ఎంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎంతో మంది ప్రాణాలు నిలిచాయి. మీకు సెల్యూట్ చేస్తున్నానంటూ’ ట్రంప్ టామ్ జో షల్ట్స్‌ను అభినందించారు. ఎవరీ టామ్ జో షల్ట్స్.. అమెరికన్ నేవీలో పనిచేసిన మొదటి మహిళా పైలట్లలో టామ్ జో షల్ట్స్ ఒకరు. సూపర్సోనిక్ ఎఫ్‌జె-18 హార్నెట్స్ వంటి విమానాలు నడిపిన ఘనత ఆమె సొంతం. ఆ అనుభవంతోనే 30 వేల అడుగులో ఇంజన్ పేలిపోయినా ఆమె ధైర్యం కోల్పోకుండా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి.. వందల మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడి ధీర వనితగా అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు. -
గాల్లో 261మంది.. క్షణాల్లో తప్పిన పెను ప్రమాదం!
ముంబై : సెకన్ల వ్యవధిలో పెను ప్రమాదం తప్పింది. గాల్లోని తమ ప్రాణాలు కలిసిపోతాయని భావించిన 261 మంది ప్రయాణికులు, ప్రమాదం నుంచి సెకన్లలో బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. ఓ మహిళ పైలెట్ చూపించిన తెగువ ఇంతమంది ప్రాణాలను కాపాడ గలిగింది. వివరాల్లోకి వెళ్తే... ఫిబ్రవరి 7న రాత్రి 8 గంటల తర్వాత ముంబై నుంచి భోపాల్ వెళ్తున్న ఎయిరిండియా ఎయిర్‌బస్ ఏ1631, ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న విస్తార యూకే997 ముంబై ఎయిర్ స్పేస్‌లో ఎదురెదురుగా వచ్చాయి. దాదాపు 100 అడుగుల దగ్గరగా ఈ రెండు విమానాలు వచ్చాయి. విస్తార విమానంలో 152 మంది ప్రయాణికులుండగా.. ఎయిరిండియా విమానంలో 109 మంది ప్రయాణికులున్నారు. ఇరు విమానాలు దగ్గరకు సమీపిస్తున్న తరుణంలో ఆ విమానాల పైలెట్లకు ఆటోమేటిక్ వార్నింగ్ అలర్ట్‌లు వెళ్లాయి. సెకన్లలో రెండు విమానాలు ఢీకొట్టుకోబోతున్నాయన్న తరుణంలో, వెంటనే స్పందించిన ఎయిరిండియా మహిళా పైలెట్ అనుపమ కోహ్లి అడ్వయిజరీ ఆదేశాలను పాటిస్తూ... ఎయిర్‌క్రాఫ్ట్‌ను సురక్షితమైన దూరంగా మరలించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విస్తార విమానం అదే అవరోహణ మార్గంలో ప్రయాణించింది. ఎట్టకేలకు తమ పైలెట్ సరియైన సమయంలో వెంటనే తగిన చర్యలు తీసుకోవడంతో, పెను ప్రమాదం నుంచి బయటపడినట్టు ఎయిరిండియా అధికారులు చెప్పారు. ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలు పాటిస్తూ వెళ్తోందని, విస్తారా పైలెటే తప్పుడు మార్గంలో విమానాన్ని నడిపినట్టు ఎయిరిండియా అధికారులు ఆరోపించారు. విస్తారా ఎయిర్‌క్రాఫ్ట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సూచనలకు విరుద్ధంగా ప్రయాణించినట్టు పేర్కొన్నారు. తాను విమానాన్ని సురక్షితమైన మార్గంలోకి మరలించకముందు రెండు విమానాలు కేవలం 100 అడుగుల దూరంలోనే ఉన్నట్టు కోహ్లి, తన రెజుల్యూషన్ అడ్వయిజరీకి రిపోర్టు చేసింది. విస్తారా సైతం ఈ ప్రమాదాన్ని ధృవీకరించింది. తన ఇద్దరు పైలెట్లను విధుల నుంచి తొలగించింది. ఎయిరిండియా 27వేల అడుగుల స్థాయిలో ప్రయాణిస్తుండగా.. విస్తార విమానం 8 గంటల తర్వాత 27,100 అడుగుల స్థాయికి వచ్చింది. ఈ క్రమంలో ఈ రెండు విమానాలు ప్రమాదం అంచు వరకు వెళ్లాయి. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ప్రమాదంపై విచారణ చేపడుతోంది. -
ప్రధాని ప్రయాణించిన మెట్రో రైలును నడిపిన మహిళా పైలట్..
-
మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
-
మెంటలెక్కినట్లు మహిళా పైలట్.. ప్రయాణికులు షేక్
వెల్లింగ్టన్: ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా ఆ మాటల మధ్య పొందిక లేకుండా ఉండటం, మానసిక పరిస్థితి ఆందోళనకరంగా కనిపించిన నేపథ్యంలో అమెరికాలో ఓ మహిళా పైలట్‌ను టేకాఫ్‌కు ముందు దింపేశారు. అయితే, ఆమె ఎవరనే వివరాలు చెప్పేందుకు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ నిరాకరించింది. ప్రయాణీకులంతా భయపడేలా ఆమె ప్రవర్తించిందని, దీంతో విమానం నుంచి కొంతమంది ప్రయాణికులు దిగిపోయారని కూడా ఎయిర్‌లైన్స్ తెలిపింది. యూఎస్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ 455 ఆస్టిన్ నుంచి టెక్సాస్ మీదుగా శాన్ఫ్రాన్సిస్కో వెళ్లాల్సి ఉంది. ఓ పురుషుడు, ఓ మహిళ దీనికి పైలట్లుగా ఉన్నారు. ఇందులో మహిళా పైలట్ తన విధుల నిమిత్తం వేసుకునే దుస్తులు కాకుండా.. సాధారణ పౌరులాలుగా వచ్చింది. అంతేకాకుండా డోనాల్డ్ ట్రంప్‌కు గానీ, హిల్లరీ క్లింటన్కుగానీ తాను ఓటు వేయలేదని, వారిద్దరు అబద్ధాల కోరులని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు తాను విడాకులు తీసుకుంటున్నానంటూ చెప్పింది. ఆ తర్వాత ఇంకేవో మాటలతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయేలా చేసింది. దీంతో కొంతమంది ప్రయాణీకులు దిగిపోతుండటంతోపాటు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఆ పైలెట్‌ను దింపేశారు. 90 నిమిషాలు ఆలస్యంగా కొత్త పైలెట్ ను పంపించారు.