
న్యూఢిల్లీ : మహిళ పైలెట్‌ను వేధింపులకు గురి చేశాడనే ఆరోపణల నేపథ్యంలో ఓ సినీయర్ కెప్టెన్‌పై ఎయిర్ ఇండియా యాజమాన్యం విచారణకు ఆదేశించింది. ఈ విషయం గురించి ఎయిరిండియా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సదరు సీనియర్ కెప్టెన్ తనను ఇబ్బందికర ప్రశ్నలతో వేధించినట్లు మహిళా పైలెట్ ఫిర్యాదు చేసింది. దాంతో ఆ కెప్టెన్‌పై విచారణకు ఆదేశించాం’ అని తెలిపారు. బాధితురాలు తెలిపిన వివరాలు.. ‘ఈ నెల 5వ తేదీని ట్రెయినింగ్ సెషన్ పూర్తయిన తర్వాత సదరు కెప్టెన్ నన్ను డిన్నర్‌కు ఆహ్వానించాడు. గతంలో నేను అతనితో కలిసి పని చేశాను. ఆ కారణంగా డిన్నర్‌కు వెళ్లేందుకు అంగీకరించాను. తొలుత అతను మర్యాదగానే ప్రవర్తించాడు. తర్వాత ఓ రెస్టారెంట్‌కు వెళ్లాం’ అన్నారు.
‘అక్కడ నుంచి నన్ను వేధించడం ప్రారంభించాడు. తన వివాహ జీవితంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు. అంతటితో ఊరుకోక భర్తకు దూరంగా ఉంటున్నారు.. మీకు ఏం అనిపించడం లేదా అని పలు అభ్యంతరకర ప్రశ్నలు అడుగుతూ నన్ను ఇబ్బంది పెట్టాడు. దాంతో నాకు చిరాకు పుట్టి.. మీతో ఇవన్ని మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడ నుంచి వచ్చేసాను’ అని సదరు మహిళా పైలెట్ తెలిపారు. అతడు నన్ను నైతికంగా అవమానించాడు. ఆ కెప్టెన్‌పై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment