
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి.
దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది.
ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు.
Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w
— Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023