chattisghad
-
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎగిరి చెరువులో పడ్డ కారు
రాయ్‌పూర్:ఛత్తీస్‌గఢ్‌లోని బల్రామ్పుర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న కారు మలుపు వద్ద అదుపుతప్పింది. దీంతో ఎగిరి పక్కనున్న చెరువులో పడిపోయింది. ఈ ఘటనలో మొత్తం 8 మంది దుర్మరణం పాలయ్యారని పోలీసులు ఆదివారం(నవంబర్ 3) వెల్లడించారు. కారు లరిమా నుంచి సూరజ్పుర్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.మృతిచెందిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారితో పాటు వారి పొరుగువారు కూడా ఉన్నారు. ఆరుగురు ప్రమాదం జరిగిన స్థలంలోనే మృతిచెందగా మిగిలిన ఇద్దరిని ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో చనిపోయారు. కారు అతివేగంలో వెళుతుండగా మలుపు తిప్పేటపుడు అదుపుతప్పడంతో చెరువులోకి దూసుకెళ్లినట్లు ప్రాథమికంగా తేలింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: పారిశుద్ధ్య కార్మికులను ఢీకొట్టిన రైలు.. నలుగురు అక్కడికక్కడే మృతి -
ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం(మే20) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావర్ధాలో ప్యాసింజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వాహనం 20 అడుగుల లోయలో పడిపోవడంతో ప్రాణ నష్టం ఎక్కువైంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు వాహనంలో 25 నుంచి 30 మంది దాకా ప్రయాణిస్తున్నారు. -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నిశ్చితార్థం రోజే దుర్మరణం!
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నటుడు సూరజ్ మెహర్( 40) మృతి చెందారు. అర్ధరాత్రి ట్రక్కును కారు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సూరజ్ మెహర్ సహచరుడు, డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ ఒడిశాలో అతనికి నిశ్చితార్థం జరగాల్సి ఉంది. శుభకార్యం జరగాల్సిన నటుడి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం అర్థరాత్రి తన సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సూరజ్ మెహర్ ప్రస్తుతం "ఆఖ్రీ ఫైస్లా" అనే చిత్రంలో నటిస్తున్నారు. సూరజ్ ముఖ్యంగా విలన్ పాత్రలతో ఫేమస్ అయ్యారు. సూరజ్ మెహర్ బిలాస్‌పూర్‌లోని సరియా గ్రామానికి చెందిన వారుగా తెలుస్తోంది. -
తనువు చాలించిన విద్యాసాగర్ మహారాజ్ .. ప్రధాని మోదీ నివాళి!
ప్రముఖ జైన దిగంబర ముని ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ శనివారం తనువు చాలించారు. గత ఏడాది నవంబర్ ఐదున ప్రధాని నరేంద్ర మోదీ ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని చంద్రగిరి జైన దేవాలయంలో విద్యాసాగర్ మహారాజ్ శనివారం అర్థరాత్రి 2:35 గంటలకు తన దేహాన్ని విడిచిపెట్టారు. దీనికి ముందు ఆయన ఆచార్య పదవిని వదులుకున్నారు. మూడు రోజులపాటు ఉపవాసం ఉంటూ, మౌనం పాటించారు. అనంతరం ప్రాణాలు విడిచారు. విద్యాసాగర్ మహారాజ్ మరణవార్త తెలియగానే జైన సమాజానికి చెందిన పలువురు చంద్రగిరి జైన దేవాలయానికి చేరుకున్నారు. ఆదివారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. My thoughts and prayers are with the countless devotees of Acharya Shri 108 Vidhyasagar Ji Maharaj Ji. He will be remembered by the coming generations for his invaluable contributions to society, especially his efforts towards spiritual awakening among people, his work towards… pic.twitter.com/jiMMYhxE9r — Narendra Modi (@narendramodi) February 18, 2024 -
రాజస్థాన్ సీఎం ఎంపికకు ఛత్తీస్‌గఢ్ ఫార్ములా?
రాజస్థాన్ తదుపరి సీఎం ఎవరు? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ సీఎం ఎంపికకు మల్లగుల్లాలు పడుతోంది. రాజస్థాన్‌కు కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో సహా ముగ్గురు పరిశీలకులకు పార్టీ హైకమాండ్ అప్పగించింది. ఈ నేపధ్యంలో వారు జైపూర్ చేరుకుని, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారని తెలుస్తోంది. అయితే ఇంతలోనే ఛత్తీస్‌గఢ్‌లో కొత్త సీఎం పేరును బీజేపీ ప్రకటించింది. దీంతో రాజస్థాన్‌లో సీఎంను ఎంపిక చేసేందుకు బీజేపీ ఛత్తీస్‌గఢ్ ఫార్ములాను అనుసరించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన సామాజిక వర్గానికి చెందిన విష్ణు దేవ్‌సాయిని ముఖ్యమంత్రిగా నియమించిన బీజేపీ తన భవిష్యత్ వ్యూహానికి సంబంధించిన అనేక లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన విజయ్ శర్మలను డిప్యూటీలుగా నియమించడం ద్వారా పార్టీలోని సామాజిక, రాజకీయ, అంతర్గత సమీకరణాలను చక్కదిద్దేందుకు బీజేపీ తన వంతు కృషి చేసింది. ఈ విధమైన ఫార్ములా ద్వారా లోక్‌సభ- 2024 ఎన్నికల వ్యూహానికి అనుగుణమైన రహదారిని ఏర్పాటు చేసింది. బీజేపీ తన ప్రత్యేక వ్యూహంలో భాగంగా గిరిజన సమాజాన్ని అక్కున చేర్చుకుంది. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను కూడా చేపట్టింది. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిని చేయడం లేదా బిర్సా ముండా జన్మదినాన్ని గిరిజన దినోత్సవంగా ప్రకటించడం, తాజాగా గిరిజన ముఖ్యమంత్రిని ఎంచుకోవడం.. ఇవన్నీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి వరకు రాజస్థాన్‌లో వసుంధర రాజే, బాబా బాలక్‌నాథ్‌లు సీఎం పదవి కోసం పోటీ పడుతున్నారనే వాదన వినిపించింది. అయితే ఈ రేసులో నుంచి తాను తప్పుకుంటున్నట్లు బాబా బాలక్‌నాథ్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు వసుంధర రాజేను సీఎం చేసే విషయమై పార్టీ ఇంతవరకూ ఏమీ తేల్చలేదు. మరోవైపు సీఎం రేసులో అశ్విని వైష్ణవ్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ రాథోడ్, గజేంద్ర సింగ్ షెకావత్, ఓం బిర్లా, దియా కుమారి, అర్జున్ రామ్ మేఘ్వాల్, సీపీ జోషి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. రాజస్థాన్‌లో జాట్ జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ ఆ కమ్యూనిటీకి చెందిన ఏ నేత కూడా ముఖ్యమంత్రి పదవికి చేరుకోలేకపోయాడనే అసంతృప్తి ఆ వర్గంలో ఉంది. గతంలో జాట్ కమ్యూనిటీకి చెందిన నేతల పేర్లు సీఎం రేసులో వినిపించాయి. అయితే చివరి నిముషంలో వారెవరికీ అవకాశం దక్కలేదు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విషయంలో ఇదే జరిగింది. 1973లో రామ్నివాస్ మిర్ధా, 1998లో పరశ్రమ్ మదెర్నా, 2008లో శిశ్రామ్ ఓలా.. ఇలా ఈ ముగ్గురూ నాడు సీఎం పదవికి పోటీదారులుగా నిలిచారు. కానీ వారికి ఎమ్మెల్యేల నుంచి మద్దతు లభించలేదు. ఈసారి కూడా జాట్ నేతను సీఎం చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. దీనికి మద్దతుగా ఒక హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్లో టాప్ ట్రెండింగ్‌లో ఉంది. రాజస్థాన్‌లోని 10 జిల్లాల్లో దాదాపు 65 స్థానాలపై జాట్ ఓటర్లు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తున్నారు. అలాగే 100 సీట్లపై నిర్ణయం తీసుకునే కీల పాత్ర పోషిస్తున్నారు. అందుకే రాజస్థాన్ శాసనసభా పక్ష సమావేశంలో బీజేపీ నేతలు ఏ నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇది కూడా చదవండి: జమ్ము కశ్మీర్‌కు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు: అమిత్ షా -
పొత్తు లేకనే కాంగ్రెస్ చిత్తు?.. ఇండియా అలయన్స్ నేతలు ఏమంటున్నారు?
హిందీ రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ రాష్ట్రాల్లో భారీ విజయం సాధించిన నేపధ్యంలో బీజేపీ బలం మరింతగా పెరిగింది. ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్‌లో కలకలం చెలరేగుతోంది. ప్రతిపక్ష కూటమి ఇండియా (ఇండియా అలయన్స్) భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జాతీయ స్థాయి కూటమి ఏర్పడినప్పుడు, ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒంటరిగా ఎన్నికల్లో ఎందుకు పోటీ చేసిందనే ప్రశ్నను ఆ కూటమిలోని పార్టీలే లేవనెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని కూడా ఆయా పార్టీలు అంటున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ ఎందుకు నిర్ణయించుకుందనే దానిపై కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ మీడియాకు తెలియజేశారు. పార్టీ కేంద్ర నాయకులు పొత్తు ఆవశ్యకతను తెలుసుకున్నారని, హిందీ బెల్ట్‌లోని రాష్ట్ర స్థాయి నాయకులు కూటమి అవసరాన్ని గ్రహించాల్సి ఉందన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ద్వంద్వ స్వభావం ఉందని, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉందని అన్నారు. పొత్తులకు ఉండే ప్రాముఖ్యతను రాష్ట్రస్థాయి నేతలు అర్థం చేసుకోవాలని, ట్రాక్ రికార్డ్ లేదా ఇతర విషయాల ఆధారంగా టిక్కెట్లు ఇచ్చే బదులు, కాంగ్రెస్ అభ్యర్థికి ప్రస్తుతం గెలిచేందుకు గల అవకాశాలను పరిశీలించిన తర్వాతనే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వాలని మాణికం ఠాగూర్ అన్నారు. కాగా నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, ఇండియా అలయన్స్ సభ్యుడు ఒమర్ అబ్దుల్లా కూడా కాంగ్రెస్ ఓటమి వెనుక కారణాలను మీడియాకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని పరిస్థితిని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయిందని, అఖిలేష్ యాదవ్‌కు 5 నుంచి 7 సీట్లు ఇస్తే ఏమి నష్టం జరిగేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికలలో ఇండియా కూటమి ఫలితాలు చూస్తుంటే.. భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే తాము ఎప్పటికీ గెలవలేమని ఆయన అన్నారు. ఈ ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ డిసెంబర్ 6న భారత కూటమి సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది. అయితే ఈ సమావేశానికి మమతా బెనర్జీ హాజరుకావడం లేదని టీఎంసీ వర్గాలు తెలిపాయి. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ సీనియర్ నేతలతో సోనియా గాంధీ కీలక భేటీ -
నేడు ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని ఎన్నికల ర్యాలీ.. జనం హాజరుపై సందేహాలు?
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (నవంబర్ 13) ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించనున్నారు. ముంగేలి అసెంబ్లీ నియోజకవర్గంలోని జంకుహిలో ఉదయం 11 గంటల నుంచి 11:40 వరకు జరిగే ఎన్నికల సభలో ఆయన ప్రసంగించనున్నారు. బీజేపీ రాష్ట్ర ఇంచార్జి ఓం మాథుర్ ఇప్పటికే ముంగేలికి చేరుకుని సభా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు ప్రధాని పర్యటన స్థానిక బీజేపీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. దీపావళి మర్నాడే ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు జనాన్ని కూడగట్టడం వారికి సవాలుగా పరిణమించింది. అయినప్పటికీ బీజేపీ నేతలు జనసమీకరణకు నడుం బిగించారు. రాష్ట్రంలో ప్రధాని పాల్గొంటున్న మూడవ బహిరంగ సభ ఇది. దీనికి ముందు మోదీ నవంబర్ నాలుగు, ఐదు తేదీలలో దుర్గ్, డోంగర్గావ్లలో జరిగిన ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్నారు. బస్తర్‌లో ప్రధాని రూ. 27 వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. అలాగే రాయ్‌గఢ్‌లో రూ.6,350 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులకు శంకుస్థాపన చేశారు. గత జూలై 7న ప్రధాని మోదీ రాయ్‌పూర్‌లో రూ.7,600 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఛత్తీస్‌గఢ్ అసెబ్లీ ఎన్నికల్లో నవంబర్ 7 మొదటి దశ పోలింగ్ జరగగా, నవంబర్ 17 రెండవ దశ పోలింగ్ జరగనుంది. ఇది కూడా చదవండి: బ్రిటీష్ ప్రధానికి భారత్ దీపావళి కానుక -
ప్రధానిపై ప్రశంసలు కురిపించిన కాంగ్రెస్ నేత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ మాయకత్వంలో ఛత్తీస్‌గఢ్ చాలా అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకముందని అన్నారు. మాకు చాలా ఇచ్చారు.. ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం లక్ష మందికి సికిల్ సెల్ వ్యాధి కౌన్సెలింగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా ఛత్తీస్గఢ్లోఅనేక మేజర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ ప్రధానిని స్వాగతిస్తూ.. మీరు మాకేదో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు చాలా ఇచ్చారు. భవిష్యతులో కూడా మాకు చాలా ఇస్తారని విశ్వసిస్తున్నాను అన్నారు. కేంద్రంలోని మీ నాయకత్వంలో మేమంతా పనిచేశాము. ఇంతవరకు కేంద్రాన్ని ఎలాంటి సాయం అడిగినా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించి రాష్ట్రానికి చాలా చేశారన్నారు. మా రాష్ట్రం కేంద్రం సహాయంతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళుతుందని ఆశిస్తున్నానన్నారు. Chattisgarh Deputy CM TS Singh Deo praises PM Modi for always supporting Chattisgarh Govt pic.twitter.com/QuavHjfgQD — DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 15, 2023 ఈ రాష్ట్రం పవర్‌హౌస్.. ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో పవర్‌హౌస్ లాంటిదని ఇలాంటి పవర్‌హౌస్‌లు తమ శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తేనే దేశం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నామని అందులో భాగంగానే ఈరోజు కొన్నిటికి శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ సంఫర్బంగా జులైలో రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, అలాగే రాయ్‌పూర్-ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన కోసం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. छत्तीसगढ़ देश के लिए पावर हाउस की तरह है, आज दुनिया भारत से सीखने की बात कर रही है! - प्रधानमंत्री श्री @narendramodi जी #विजय_शंखनाद_रैली pic.twitter.com/8BbzdKXz5u — BJP Chhattisgarh (@BJP4CGState) September 14, 2023 అదీ అసలు కారణం.. ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూకుడును పెంచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం రేసులో ఉన్న టీస్ సింగ్ దేవ్‌ను కాదని భూపేష్ బాఘేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి టీఎస్ సింగ్ దేవ్ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. అసలే త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి వైఖరి కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది. ఇది కూడా చదవండి: ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి.. -
80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్.. చివరికి..
రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు. స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. We have been building transmission towers from ages. This is the first time I have seen someone climb them to commit suicide upset with her lover. Good news, the boyfriend followed her up and convinced her to climb down. All iz well #Chhattisgarh #today pic.twitter.com/3MRpbZ8RJI — Harsh Goenka (@hvgoenka) August 6, 2023 ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
మరో ప్రమాదం తప్పిందా? ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రైళ్లు.. రైల్వే శాఖ క్లారిటీ!
ఒడిశా రైలు దుర్ఘటన మరవకముందే మరో రైలు ప్రమాదం తప్పిందంటూ నెట్టింట ఓ వీడియో దర్శనమిస్తోంది. దీంతో రైలు ప్రయాణంపై ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా దీనిపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. వైరల్‌గా మారిన ఆ వీడియోలోని సారాంశం ఏంటంటే.. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో ఓ ప్యాసింజర్ రైలు, గూడ్స్ రైలు అనుకోకుండా ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా వచ్చాయి. ప్రమాదాన్ని ముందే గమనించిన రైళ్లలోని లోకో పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో.. కొన్ని అడుగుల దూరంలో ఆ రెండు రైళ్లు నిలిచిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందని సోషల్‌మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ వీడియోపై రైల్వేశాఖ స్పందిస్తూ.. ప్రమాదవశాత్తు ఆ రెండు రైళ్లూ ఒకే ట్రాక్‌పైకి రాలేదని స్పష్టం చేసింది. బిలాస్‌పుర్-జైరాంనగర్ మధ్య ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ వ్యవస్థ అందుబాటులో ఉన్న మార్గంలో ఎదురుదురుగా రెండు రైళ్లు వచ్చేందుకు అనుమతి ఉందని చెప్పింది. ఇలా ఒకే ట్రాక్‌లో వచ్చిన ఆ రెండు రైళ్లు ఢీకొట్టుకోబోవని, దగ్గరగా వచ్చిన తర్వాత ఆ రైళ్లు కొద్ది దూరంలోనే ఆగిపోతాయని వివరణ ఇచ్చింది. సోషల్‌మీడియాలో ఈ అంశంపై వస్తున్న తప్పుడు సమాచారాలను నమ్మవద్దని కోరింది. కాగా గత వారం, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో, 275 మంది మరణించడంతో పాటు వేలాది మంది గాయపడిన సంగతి తెలిసిందే. గత దశాబ్థ కాలంలో ఒడిశాలో జరిగిన అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాలలో ఇది ఒకటిగా చెప్పచ్చు. Train accident averted once again in Raipur Chhattisgarh @RailMinIndia@AshwiniVaishnaw #RailwaySafety #Chhattisgarh pic.twitter.com/UKRe4Ox26w — Amit Tiwari (@AmitTiwari_95) June 11, 2023 -
అంధత్వం అడ్డుకాదంటూ.. ఆమె సాధించిన ఘనత ఇదే!
అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది. కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు. ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్‌లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది. దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం. -
టెన్త్ ,ఇంటర్ టాపర్స్ కు హెలికాప్టర్ రైడ్
-
ఇద్దరు మహిళల వల్ల దేశంలోకి చీతాలొచ్చాయి
ఇద్దరు మహిళల వల్ల దేశంలోకి చీతాలొచ్చాయి. ఇకపై మధ్యప్రదేశ్ అడవుల్లో అవి చూపులు రిక్కించి వాయువేగంతో వేటాడనున్నాయి. నమీబియా నుంచి చీతాలు భారత్‌లో అడుగు పెట్టడానికి ఇరు దేశాల మధ్య కోఆర్డినేటర్‌గా పని చేసిన డాక్టర్ లారీ మార్కర్ ఒక కారణం. అలాగే చీతాల సంరక్షణలో తర్ఫీదు పొందిమన దేశంలో ఏకైక ‘చీతా లేడీ’గా గుర్తింపు పొందిన ప్రద్న్యా గిరాడ్కర్ కృషి మరో కారణం. చీతాల ప్రవేశ ప్రయోగం విజయవంతం అవుతుందని అంటోంది ప్రద్న్యా. 70 ఏళ్ల క్రితం నేటి చత్తిస్‌గఢ్‌లోని చివరి మూడు చీతాలను అక్కడి రాజు వేటాడి చంపడంతో మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. అప్పటినుంచి వాటిని తిరిగి దేశంలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఉపయోగం లేదని ఒక వర్గం, చీతాలు వృద్ధి చెందితే పర్యావరణానికి మేలు అని ఒక వర్గం వాదులాడుకున్నాయి. ‘అంతరించిపోయిన చీతాలను తిరిగి దేశంలో ప్రవేశపెట్టడం ద్వారా అవి బతికి బట్టకడతాయనడానికి అధ్యయనాలు ఏమిటో చెప్పండి’ అని సుప్రీంకోర్టు ఈ ప్రయత్నాన్ని ప్రశ్నించింది. అన్ని అడ్డంకులు ఇన్నాళ్లకు తీరి నమీబియా నుంచి విమానంలో ఎగిరొచ్చిన 8 చీతాలు మధ్యప్రదేశ్‌లోని కూనో అభయారణ్యంలో రెండు పాయింట్లలో విడుదలయ్యాయి. ఈ మొత్తం కార్యక్రమం వెనుక ఇద్దరు స్త్రీలు ఉన్నారు. ‘మనుషుల చేతుల్లో చీతాలు అంతరించిపోయాయి. ఇవాళ మనుషులే వాటిని కాపాడాలి. ఎందుకంటే చీతాలు తాము నివసించే వాతావరణానికి అలవాటుపడటానికి ఐదు నుంచి పదేళ్లు తీసుకుంటాయి’ అంటారు లారీ మార్కర్. అమెరికాకు చెందిన ఈ జువాలజిస్టు ప్రపంచంలోనే ‘చీతా నిపుణురాలి’గా గుర్తింపు పొందారు. చీతాల సంరక్షణ కోసం ‘చీతా కన్సర్వేషన్ ఫండ్’ అనే సంస్థ స్థాపించి ఆఫ్రికన్ దేశాలలో వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. గత 12 సంవత్సరాలుగా మన దేశంలో చీతాల ప్రవేశానికి సాగిన ప్రయత్నంలో నమీబియాకు, మన దేశానికి మధ్య సంధానకర్తగా పని చేశారు. ‘రాబోయే సంవత్సరకాలంలోని దక్షిణాఫ్రికాలోని నమీబియా నుంచి మరిన్ని చీతాలు భారత్‌కు చేరుకుంటాయి’ అని తెలిపారామె. ‘నమీబియాలో గడ్డి మైదానాలు కూనో అభయారణ్యంలో పొదలకు దగ్గరగా ఉంటాయి. చీతాలు వేగంగా పరిగెత్తి వేటాడేంత విశాలత ఇక్కడ లేకపోవచ్చు. కాని అవి పొంచి ఉండి కూడా వేటాడతాయి. అది సమస్య కాదు. జనావాసాల వైపు వచ్చినప్పుడు వాటిని కాపాడే చైతన్యమే కావాల్సింది’ అంటారు లారీ మార్కర్. చీతా కూడా రాజే ‘పులి అడవికి రాజైతే చీతా గడ్డిమైదానాలకు రాజు. చీతాను కాపాడా లంటే గడ్డి మైదానాలను కూడా కాపాడాలి. అలా కాపాడితే గడ్డి మైదానాలపై ఆధారపడే జంతువులన్నీ కాపాడబడతాయి. దానివల్ల జీవ వైవిధ్యం కొనసాగుతుంది’ అంటారు ప్రద్న్యా గిరాడ్కర్. ఈమె ‘వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ’ అనే సంస్థను స్థాపించి వన్యప్రాణుల సంరక్షణలో శాస్త్రీయమైన విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు. మన దేశంలో చీతాల పునఃప్రవేశాన్ని గట్టిగా సమర్థించిన పర్యావరణ నిపుణురాలు ఈమె. ‘పులుల సంరక్షణ విధానాల గురించి నేను ముంబై యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను. చీతాలు దేశానికి తేవాలి అనే వాదనకు నేను సమర్థింపు ఇచ్చాను. 2011లో నమీబియాలో చీతాల సంరక్షణ గురించి లారా పార్కర్ నిర్వహించిన శిక్షణా శిబిరానికి మన దేశం నుంచి నేను ఎంపికయ్యాను. నమీబియా వెళ్లి అక్కడి ఒట్టిఒరోన్గో అభయారణ్యంలోని 52 చీతాల సంరక్షణలో పాటించవలసిన విధానాలను తెలుసుకున్నాను. మనిషికీ మృగానికీ మధ్య ఉండే వైరం తెలిసింది. అలాగే మనిషి, మృగం కలిసి బతకక తప్పని స్థితిని కూడా తెలుసుకున్నాను’ అంటారు ప్రద్న్యా గిరాడ్కర్. చీతాలు మనదేశం రావడానికి కావలసిన మొత్తం ప్లాన్‌ను లారీ మార్కర్ తయారు చేస్తున్నప్పుడు ప్రద్న్యా ఆ పనిలో పాల్గొన్నారు. ‘చీతాలకు తక్కువ స్వేచ్ఛ ఆ తర్వాత ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వబడుతుంది. వాటిని శాటిలైట్ కాలర్స్ ద్వారా గమనిస్తూ వస్తాం. మరీ అడవికి దూరంగా వెళ్లిపోయినప్పుడు వాటిని తిరిగి సురక్షిత ప్రాంతానికి చేర్చడం ముఖ్యం. నమీబియాలోని చీతాల ఆహారం మన కూనోలో దొరికే ఆహారానికి దగ్గరే. కూనో అభయారణ్యంలో లేళ్లు, దుప్పులు, కృష్ణ జింకలు దండిగా ఉన్నాయి. అవి చీతాలకు సరిపోతాయి’ అంటారామె. ‘చీతాలు మన దేశంలో నిలదొక్కుకుంటే పులులకు సంబంధించిన ఆరు జాతులూ మన దగ్గర ఉన్నట్టవుతుంది. అంతేకాదు టూరిజం పెరుగుతుంది. ఇప్పుడు చేసిన ఖర్చు సులభంగా తిరిగి వస్తుంది. అయితే సవాళ్లు కూడా ఉంటాయి. మన దేశంలో గతంలో చీతాలు ఉన్నాయి కనుక ఆఫ్రికా చీతాలకు మన చీతాలకు జన్యుపరంగా చాలా తక్కువ వ్యత్యాసం ఉంది కనుక అవి ఇక్కడ మనుగడ సాధిస్తాయనే ఆశిస్తాను’ అంటారామె. ఒక ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ ఘట్టంలో ఉన్న ఈ ఇద్దరు స్త్రీలు అభినందనీయులు. -
భయానక రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం
ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోబా సమీపంలో ఓ ట్రక్కు-ట్రాకర్ట్ ఢీకొట్టుకున్నాయి. ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృత్యువాతపడగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కాగా, వీరంతా మొహ్లాయ్ గ్రామంలో ఓ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. బాధితులందరూ మజర్ కట్టాకు చెందినవారని వెల్లడించారు. మరోవైపు.. ఈ ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇస్తామని.. గాయపడిన వారికి రూ. 50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. -
నయా సావిత్రి.. భర్తను కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. భార్య ఏం చేసిందంటే..?
రాయ్‌పూర్ : పురాణాల్లో భర్త ప్రాణాల కోసం యుముడినే సావిత్రి ఎదురించిందని చెబుతుంటారు. అదే విధంగా తన భర్త ప్రాణాల కోసం అడవి బాట పట్టింది ఓ మహిళ. మావోయిస్టుల చెర నుండి తన భర్తను రక్షించుకునేందుకు రెండున్నరేళ్ల కూతురితో సహా తన ప్రాణాలనూ ఫణంగా పెట్టింది. తీరా భర్తను మావోయిస్టులు విడిచిపెట్టినా.. ఆమె మాత్రం అడవి నుంచి ఇంకా బయటకు రాకపోవడం కుటుంబ సభ్యులను ఆందోళన గురిచేస్తోంది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల ఇంజినీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురైంది. దీంతో తాను ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలని భావించి.. పవార్‌ను విడుదల చేయాలని మావోయిస్టులను వేడుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది. కాగా, ఈ వీడియోకు నక్సల్స్ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె అడవిలోకి వెళ్లాలని నిర్ణయించుకుంది. స్థానిక జర్నలిస్టు సాయంతో ఆమె తన రెండున్నరేళ్ల కూతురిని వెంటతీసుకొని దండకారణ్యంలోకి వెళ్లింది. ఇదిలా ఉండగా కిడ్నాప్‌కు గురైన అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టడంతో వారు సురక్షితంగా బయటకు వచ్చారు. కానీ, వారిని వెతుక్కుంటూ వెళ్లిన సోనాలీ పవర్ మాత్రం అడవి నుంచి బయటకు రాకపోవడంతో పోలీసులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. అడవి నుంచి తిరిగి వచ్చిన తర్వాత అశోక్ పవార్, ఆనంద్ యాదవ్‌కు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అశోక్ పవార్ స్వల్ప అస్వస్థతకు గురైనట్టు పేర్కొన్నారు. సోనాలీ పవార్ కూడా సురక్షితంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, నక్సల్స్ తమను ఇబ్బంది పెట్టలేదని, ఇరువురికి రూ. 2వేలు ఇచ్చి అడవి నుంచి పంపించినట్టు ఆనంద్ యాదవ్ వెల్లడించారు. -
Chhattisgarh: హరేలీ పండుగ.. వెదురు బొంగులు కట్టుకుని సీఎం డ్యాన్స్..
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ప్రజలు హరేలీ పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. దీనిలో భాగంగా.. వ్యవసాయ పరికరాలు, ఆవులను, ప్రకృతిని ఆరాధించారు. కాగా, ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా హరేలీ వేడుకను ఛత్తీస్‌గఢ్ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ క్రమంలో, ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ భగేల్ రాయ్‌పూర్‌లో జరిగిన హరేలీ వేడుకలలో పాల్గోని డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిలో భాగంగా.. సీఎం డప్పులు కొడుతూ.. సంప్రదాయ నృత్యం చేస్తూ స్థానికులలో మరింత ఉత్సాహాన్నినింపారు. ప్రధానంగా ఉత్తరాదిన, గోండ్ జాతి తెగలలో ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు రైతులు.. భెల్వా చెట్లకొమ్మలను, ఆకులను వారిపోలాల్లో వేస్తారు. మంచి పంట పండాలని కోరుకుంటారు. అదే విధంగా, వేప కొమ్మలను తమ ఇంటి గుమ్మాలకు వేలాడదీస్తారు. దీని వలన ఎలాంటి చీడలు ఇంట్లోకి రావని నమ్ముతారు. అయితే, హరేలీలో ప్రధానంగా కాలికి వెదురు బొంగులు కట్టుకుని దాని సహయంతో నడుస్తారు. దీన్ని గేడిరేసు అని పిలుస్తారు. కాగా, సీఎం భూపేష్ భగేల్ కూడా తన కాళ్లకు వెదురు బొంగులు కట్టుకుని ఉత్సాహంగా గడిపారు. ప్రజలతో కలిసి .. డ్యాన్స్ చేస్తూ సంతోషంగా గడిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH Chhattisgarh Chief Minister Bhupesh Baghel takes part in Hareli festival (of worshipping farm equipment and cows) celebrations today, in Raipur pic.twitter.com/0SARUhfkqt — ANI (@ANI) August 8, 2021 हमर हरेली तिहार#JaiJohar_HareliTihar pic.twitter.com/KGglfrwWei — Bhupesh Baghel (@bhupeshbaghel) August 8, 2021 -
రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్
రాయ్‌పూర్: ఓ పెళ్లి బరాత్ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర వివాదాస్పదమవుతోంది. పెళ్లి కొడుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి దగ్గరి చుట్టరికం. ఉదయం పెళ్లికి కాగా సాయంత్రం బరాత్ పెట్టుకున్నారు. అయితే ఈ బరాత్‌కు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య బరాత్ జరిగింది. డప్పుచప్పుళ్లకు .. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్‌లు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉందనే పట్టించుకోకుండా ఎంజాయ్ చేశారు. కోవిడ్‌నిబంధనలు ఉల్లంఘించారు. వారిపై కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మర్కంట్ మేనల్లుడి వరుసయ్యే వ్యక్తికి వివాహం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో ఎవరూ మాస్క్, శానిటైజర్ వంటివి పట్టించుకోలేదు. కనీసం భౌతిక దూరంగా కూడా పాటించలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో తీవ్ర ఆంక్షలు ఉన్న విషయమే పట్టించుకోలేదు. ఈ బరాత్‌లో ఛత్తీస్‌ఘడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండడం తీవ్ర వివాదమవుతోంది. బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షురాలు లతా ఉసేండి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినంతా మాత్రానా కరోనా నిబంధనలు పాటించరా? అని ప్రశ్నించారు. ఆ బరాత్‌లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ స్వయంగా పాల్గొన్నారని ఆరోపించారు. మీరే నిబంధనలు పాటించకపోతే సామాన్యులెలా పట్టించుకున్నారని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనపై మొహన్ మర్కంట్ వివరణ ఇచ్చారు. బరాత్‌లో తాను లేనని.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు అభిమానులు ఉంటారని.. ఈ సమయంలో తన అల్లుడిగా ఎవరైనా తన పేరు చెప్పుకుని అలాంటి పని చేసి ఉంటారని తెలిపారు. చదవండి: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ -
సంపూర్ణ లాక్డౌన్: 9 నుంచి 19 వరకు మొత్తం బంద్
రాయ్‌పూర్: మహమ్మారి కరోనా వైరస్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న రాష్ట్రాల్లో ఛత్తీస్గడ్ ముందు స్థానంలో ఉంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చర్యలు తీవ్రం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లో సంపూర్ణ లాక్డౌన్ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 19 వరకు మొత్తం బంద్ చేస్తున్నట్లు బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదవుతుండడంతో ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీవ్ర ఆంక్షలు విధిస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఛత్తీస్‌గడ్‌లో 9,921 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. వాటిలో అత్యధికంగా రాజధాని రాయ్‌పూర్‌లోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ వైద్య ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా వైరస్ కట్టడి చర్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ దశలో రాజధానిలో లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇప్పటికే ఏప్రిల్ 6వ తేదీ నుంచి 14 వరకు రాష్ట్రంలోని దుర్గ్ జిల్లాలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేశారు. ఛత్తీస్‌గడ్‌లో మొత్తం కేసులు 3,86,269 ఉండగా వాటిలో యాక్టివ్ కేసులు 52,445 ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 4,416 మంది మృతి చెందారు. చదవండి: మరో 3 రోజులకే టీకాలున్నాయన్న ఆరోగ్య మంత్రి చదవండి: కోవిడ్ టీకాల కోసం పరుగులు.. మీరు క్యూలో ఉన్నారు! -
సర్వీస్ రివాల్వర్‌తో జవాను ఆత్మహత్య
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గడ్‌లో బిఎస్ఎఫ్ జవాను సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. కంకెర్ జిల్లాలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 157 బెటాలియన్‌కు చెందిన హెడ్‌కానిస్టేబుల్ శనివారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పంకన్జోర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. చనిపోయిన జవాన్‌ను సురేష్ కుమార్‌గా గుర్తించినట్లు తెలిపారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. ( వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికెళ్లిన మహిళపై.. ) బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ 157వ బెటిలియన్ బృందం శుక్రవారం సంగం గ్రామంలో నిర్వహించిన నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లోనూ సురేష్ కుమార్ పాల్గొన్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ శిబిరానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఘోడా , దోటమెటా గ్రామాల మధ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన దగ్గర ఉన్న సర్వీస్ రివాల్వర్ ఏకే-47 రైఫిల్‌తో కాల్చుకోవడంతో అక్కడికక్కడే చనిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. స్వగ్రామం ఉత్తరప్రదేశ్ నుంచి తిరిగి వచ్చిన సురేష్ కుమార్‌ను కొన్ని వారాల క్రితం క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అంతేకాకుండా శుక్రవారం ఇదే బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎఎస్ఐ) కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో కరోనా వస్తుందేమో అన్న డిప్రెషన్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్న కోణంలోనూ దర్యాప్తు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. (హిమాచల్ ప్రదేశ్‌లో కేరళ తరహా ఘటన ) -
ఛత్తీస్‌గడ్‌లో మరో మూడు నెలల పాటు..
రాయ్‌పూర్ : దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిబంధనలకు మరిన్ని సడలింపులు ఇచ్చిన వేళ..ఛత్తీస్గడ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో మూడు నెలల పాటు రాష్ర్టవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144 కింద ఆంక్షలు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం..ఒకే ప్రాంతంలో నలుగురు లేదా అంతకంటే ఎక్కువ గుమిగూడరాదు. రూల్ అతిక్రమిస్తే జరిమానా లేదా జైలు శిక్షకు గురవుతారు. కరోనా ఇంకా అదుపులోకి రాలేదని, ఈ నేపథ్యంలో ఆంక్షలు సడలిస్తే మరింత ప్రబలే అవకాశం ఉన్నందున రాష్ర్టవ్యాప్తంగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపినట్లు ప్రజా సంబంధాల శాఖ అధికారి తెలిపారు. అదే విధంగా మే 31 వరకు రాష్ర్టంలో రెస్టారెంట్లు, హోటళ్లు, బార్లు, స్టేడియంలకు అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక రాష్ర్టంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 92కాగా, ప్రస్తుతం 33 యాక్టివ్ కేసులున్నాయి. ఇక లాక్డౌన్ 4.0 లో రెడ్, గ్రీన్, ఆరెంజ్ నోన్ల వారీగా కొన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. (8 కేటగిరీల వారికే కరోనా టెస్టులు ) -
మావోయిస్టుల చేతిలో డ్రోన్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల సంచారం కలకలం రేపుతోంది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఏడు యాక్షన్ టీంలు తెలంగాణలోకి ప్రవేశించాయన్న సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు నిఘా పెంచారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని చెన్నూరు నుంచి పాత ఖమ్మం జిల్లాలోని చర్ల వరకు గాలింపు ముమ్మరం చేశారు. ఈ ప్రాంతాలన్నీ నదీ పరివాహకాలే. దీంతో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించాలంటే.. తప్పనిసరిగా గోదావరి నదిని దాటాలి. రెండు నుంచి మూడు కిలోమీటర్ల వెడల్పున్న నదిని దాటేముందు గట్టుకు అవతల పోలీసులు ఉన్నారో లేదో ధ్రువీకరించుకునేందుకు మావోయిస్టులు డ్రోన్లను వినియోగిస్తున్నారని సమాచారం. వేసవి సమీపించడం, అడవిలో ఆకులు రాలుతుండటంతో ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీఎఫ్ దళాలు ‘ఆపరేషన్ ప్రహార్’పేరిట దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి. వారి నుంచి తప్పించుకోవడంతోపాటు తెలంగాణలో కొత్త రిక్రూట్మెంట్ కోసం మావోయిస్టులు సరిహద్దు దాటి వస్తున్నారు. మార్చి ఆఖరివారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను సందర్శించే అవకాశాలున్నాయి. దీంతో పోలీసు డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో అణువణువూ గాలిస్తున్నాయి. అంతా అలర్ట్..! కొత్తగూడెం పరిధిలోని నీలాద్రిపేట వద్ద మావోయిస్టులు పోలీసులు తారసపడ్డారు. పోలీసులను చూసిన ఏడుగురు మావోలు తప్పించుకుని పారిపోయారు. ఈ సందర్భంగా వంటసామగ్రి, విప్లవ సాహిత్యం, ఐఈడీ (ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరి కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. భద్రాచలం జిల్లాలో ఎస్పీ సునీల్‌దత్ ఆధ్వర్యంలో పోలీసులు హెలికాప్టర్, డ్రోన్ల సాయంతో వెదుకుతున్నారు. గతేడాది జూలై 12న ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావు హత్య తరువాత మళ్లీ ఇప్పుడే మావోల కదలికలు మొదలవడం గమనార్హం. ఎలాగైనా తెలంగాణలో ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తోన్న హరిభూషణ్–శారద దంపతులే శ్రీనివాసరావు హత్యలోనూ నిందితులు కావడం గమనార్హం. దూకుడుగా వెళ్లడం, యువతను ఆకర్షించడమే లక్ష్యంగా వీరు పావులు కదుపుతున్నారు. మొత్తానికి అటు ఆపరేషన్ ప్రహార్, ఇటు తెలంగాణ పోలీసుల కూంబింగ్‌తో రెండు వైపులా మావోయిస్టులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ముఖ్యంగా చెన్నూరు, ఏటూరునాగారం, కాటారం, ముత్తారం, చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండలాల్లో తనిఖీలు పెంచారు. ఆదివాసీలు, గూడెలలో నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్టు చేయడంతో మరింత కలకలానికి దారి తీసింది. మరోవైపు పోలీసులు ఎప్పుడు ఎవరిని పట్టుకుపోతారో తెలియక.. ఆదివాసీలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇటు ‘సూడో’ వసూళ్లు.. పోలీసులు గాలింపులు తీవ్రతరం చేయడం, మావోయిస్టుల పోస్టర్లు విడుదల చేశారు. ముఖ్యంగా ఏజెన్సీలోని స్థానిక వ్యాపారులు, ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నాయకులను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఇదే అదనుగా.. సందట్లో సడేమియా అన్నట్లుగా.. కొత్తగూడెం, భద్రా ద్రి ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ నక్సలైట్ల గోల మొదలైంది. స్థానిక వ్యాపారులు, అధికార పార్టీ నాయకులను డబ్బులు ఇవ్వాలంటూ బెదిరింపు లేఖలు పంపుతున్నారు. పోస్టర్లు విడుదల దండకారణ్యంలో గుత్తికోయ తెగలకు చెందినవారే మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం సభ్యులుగా ఉన్నారు. వీరికి తెలుగుభాష కూడా రావడంతో ఇక్కడికి వచ్చి సులువుగా జనాల్లో కలసిపోవడం, రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యదర్శి అగ్రనేత హరిభూషణ్, ఆయన భార్య శారద కూడా ఉన్నట్లు సమాచారం. వీరిని సులువుగా గుర్తించేందుకు వీలుగా పోలీసులు వారి ఫొటోలతో ఉన్న పోస్టర్లు చెన్నూరు నుంచి చర్ల వరకు అంటించారు. వీరి సమాచారం చెప్పినవారికి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నగదు బహుమతి కూడా ప్రకటించారు. వాస్తవానికి ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ప్రాబల్యం బాగానే ఉంది. కానిస్టేబుల్ కిడ్నాప్, హత్య తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల కదలికల నేపథ్యంలో తాజాగా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ని అపహరించి హత్య చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా అరగట్ట సమీపంలోని అడవుల్లో ఓ కానిస్టేబుల్‌ను మావోయిస్టులు హతమార్చారు. సుకుమా జిల్లా ఎస్పీ శలాబ్ సిన్హా మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ) గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌ను సుకుమా జిల్లాలోని అరగట్ట వద్ద సొంత గ్రామంలోనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లి మావోలు చంపారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకాధికారి పర్యటన ఇటు పోలీసులు మావోయిస్టుల వేట సాగిస్తూనే గ్రామాల్లో తనిఖీలు పెంచారు. ఇప్పటికే ఇద్దరు ఐపీఎస్ అధికారులు భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ప్రత్యేక ఆపరేషన్లలో పాల్గొంటున్నారు. ఇల్లందు మండలం పరిధిలోని బాలాజీ నగర్, బోజ్జయిగూడెం గ్రామ పంచాయతీలను శుక్రవారం ఐజీ స్టీఫెన్ రవీంద్ర సందర్శించారు. స్థానిక పోలీసులతో కలసి వచ్చిన ఆయన పల్లె ప్రగతి కార్యక్రమాలు, నర్సరీలు, డంపింగ్ యార్డ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓ వైపు మావోల కోసం కూంబింగ్ జరుగుతుండగానే.. పోలీసు ఉన్నతాధికారి గ్రామాల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
గోదారి తగ్గింది..
సాక్షి, ఖమ్మం(చర్ల) : వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరికి వరద ఉధృతి కూడా తగ్గింది. ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురవడంతో గోదావరికి వరదలు వచ్చాయి. బుధవారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో గోదావరికి ఎగువన ఉన్న తాలిపేరు, గుండ్లవాగు, పాలెంవాగు, చీకుపల్లివాగు, గుబ్బలమంగి తదితర వాగుల నుంచి వరదనీరు గోదావరిలో చేరడంతో నది ఉగ్రరూపం దాల్చింది. చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్ట్ నుంచి కూడా మూడు రోజుల పాటు వరదనీటిని గోదావరిలోకి విడుదల చేశారు. గురువారం 1.53 లక్షలు, శుక్రవారం 1.93 లక్షలు. శనివారం 1.15 లక్షల క్యూసెక్కుల చొప్పున దిగువకు విడుదల చేయగా.. ఆ నీరంతా గోదావరిలోకే చేరింది. దీంతో నది ఉధృతి మరింతగా పెరిగింది. శనివారం తెల్లవారుజామున 5.30 గంటలకు 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ తర్వాత కూడా భారీగా పెరుగుతూ వచ్చింది. రాత్రి 10 గంటలకు 46.60 అడుగులకు చేరుకుంది. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే అప్పటి నుంచే క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు 42.05 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించారు. అధికారుల అప్రమత్తం... గోదావరికి శనివారం భారీగా వరద రావడంతో కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ భద్రాచలం చేరుకుని అధికారులతో సమీక్షించారు. గోదావరి తీర ప్రాంతంలో పర్యటించి వరద ఉధృతిని పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. దీంతో సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వీపీ గౌతమ్ చర్ల, దుమ్ముగూడెం మండలాల సెక్టోరియల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను అప్రమత్తం చేశారు. కాగా శనివారం రాత్రి నుంచి గోదావరికి వరద ఉధృతి తగ్గుతుండడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శనివారం వరకు చర్ల మండలం దండుపేట –కొత్తపల్లి రోడ్డు, చర్ల – లింగాపురం మధ్యలో లింగాపురంపాడు వద్ద రోడ్డు వరద నీటితో మునిగిపోయింది. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి, కాగా ఆదివారం వరదనీరు తగ్గడంతో ఈ రోడ్లపై యథావిధిగా రాకపోకలు సాగించారు. వరద ప్రవాహం ఇలా.. మూడు దశాబ్దాల కాలంలో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం 8 సార్లు మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి (43 అడుగులు), ఐదు సార్లు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి (48 అడుగులు), తొమ్మిది సార్లు మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి(53 అడుగులు) దాటింది. 1979, 1980, 1992, 1995, 2002, 2011, 2012, 2019 (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరాలలో మొదటి ప్రమాద హెచ్చరికను దాటగా, 1981, 2001, 2007, 2008, 2016, సంవత్సరాలో రెండో ప్రమాద హెచ్చరిక దాటింది. ఇక 1983, 1986, 1988, 1990, 2000, 2005, 2006, 2010, 2013 సంవత్సరాలలో మూడో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ఉగ్రరూపం ప్రదర్శించింది. సూపర్‌బజార్(కొత్తగూడెం): భద్రాచలం వద్ద గోదావరి వరద ప్రవాహం ఆదివారం సాయంత్రం 5 గంటలకు 42.80 అడుగులకు చేరుకున్నందున మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఒక ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతి వలన గ్రామాల్లో దెబ్బతిన్న ఇళ్లు, పశువులు, ప్రభుత్వ ఆస్తులు తదితర వివరాల నివేదికలు అందజేయాలని తహశీల్దార్లను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని ఎంపీడీఓలకు సూచించారు. ప్రజల ప్రయాణాలకు వీలుగా, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా రహదారులను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాలని ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అధికారులు కార్యస్థానం విడిచి వెళ్లవద్దని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించిన ఫొటోలు ఎప్పటికప్పుడు వాట్సప్ ద్వారా తీసుకుంటూ వారికి తగిన సలహాలు, సూచనలు అందజేశామని పేర్కొన్నారు. భద్రాచలం పట్టణంలోకి వరదనీరు ప్రవేశించకుండా విస్తా కాంప్లెక్స్ వద్ద విద్యుత్ మోటార్లు ఏర్పాటుచేసి నీటిని తొలగిస్తున్నట్లు తెలిపారు. -
పోలింగ్ హింసాత్మకం : నారాయణ్‌పూర్‌లో భారీ పేలుడు
రాయ్‌పూర్ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగలో చెదురుమదురు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. చత్తీస్‌గఢ్‌లో పోలింగ్ బహిష్కరణకు పిలుపు ఇచ్చిన మావోయిస్టులు హింసతో చెలరేగారు. నారాయణపూర్‌లో భారీ ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకున్నా పోలింగ్ నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. నారాయణపూర్ ఫరాస్‌గాం ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ఘటనలో ఎవరూ గాయపడలేదని ఎస్పీ చెప్పారు. మరోవైపు బస్తర్ లోక్‌సభ నియోజకవర్గంలో భారీ భద్రత నడుమ పోలింగ్ జరుగుతోంది. బీజేపీ ఎమ్మెల్యే సహా నలుగురు వ్యక్తులు మంగళవారం మావోల చేతిలో హత్యకు గురైన దంతెవాడ అసెంబ్లీ సెగ్మెంట్ ఈ నియోజకవర్గ పరిధిలో ఉండటంతో 80,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
ఎన్నికల వేళ... ‘మావో’ల అలజడి!
సాక్షి, కొత్తగూడెం: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్య ప్రాంతం నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాల్లోని ప్రధాన పట్టణాల వరకు కార్యకలాపాలు విస్తరించేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. గత ఏడాది కాలంగా తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎడతెగని పోరు నడుస్తోంది. భారీ సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందారు. మావోయిస్టులు పేల్చిన మందుపాతరల కారణంగా పలువురు భద్రతా బలగాల సిబ్బంది మరణించారు. కొందరు ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను మావోలు హత్య చేశారు. ఈ క్రమంలో గత డిసెంబర్లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల సందర్భంగా మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పరిధిలోనూ అనేక విధ్వంసక కార్యకలాపాలకు పాల్పడ్డారు. సరిహద్దుకు అవతల వైపు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ జిల్లాల్లో నిరంతరం పోలీసులు మావోయలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. దండకారణ్యం దద్దరిల్లుతోంది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా నుంచి తెలంగాణలోని భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్, ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఒడిశాలోని మల్కనగిరి, కోరాపుట్), ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి, విశాఖపట్టణం జిల్లాల వరకు మావోలు విధ్వంస కార్యకలాపాలకు మావోలు పాల్పడుతున్నారు. మూడు నెలల క్రితం విశాఖపట్టణం జిల్లా అరకు సమీపంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హత్య చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఐదు రాష్ట్రాల పోలీసులు సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు రావడంతో మావోయిస్టులు తమ కార్యకలాపాలను మరింత ఉధృతం చేసేందుకు, సరిహద్దు అటవీ ప్రాంతాలు, ఏజెన్సీ నుంచి దాటి వివిధ జిల్లాల్లోని మైదాన ప్రాంతాలకు చొచ్చుకుని వచ్చేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ బ్యానర్లు, పోస్టర్లు, కరపత్రాలు... లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందు నుంచే మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలంటూ తమ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేస్తున్నారు. ఈ నెల మొదటి వారం నుంచి మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, ఆంధ్రా–ఒడిశా స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో వరుసగా ప్రకటనలు వస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వివిధ మండలాల్లో పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను మంగళవారం వదిలారు. బూర్గంపాడు మండలంలోని పారిశ్రామిక పట్టణమైన సారపాకలోని గాంధీనగర్, సినిమాహాల్ సెంటర్లోని బల్లలపై పోస్టర్లు వదిలారు. ములకలపల్లి మండలంలోని సీతారాంపురంలో కరపత్రాలు, పోస్టర్లు కనిపించాయి. పాల్వంచ మండలంలోని జగన్నాధపురం, కేశవాపురం గ్రామాల వద్ద పోస్టర్లు వేశారు. చర్ల మండలంలోని ఆంజనేయపురం, ఆర్.కొత్తగూడెం, లక్ష్మి కాలనీ గ్రామాల్లో కరపత్రాలు వేశారు. ములుగు జిల్లాలోని భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వెంకటాపురం–వాజేడు ప్రధాన రహదారిపై మావోయిస్టు పార్టీ వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ వదిలారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో చర్ల–శబరి ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల కార్యకలాపాలు సాగుతున్నాయి. కొత్తగా వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ పేరుతో బ్యానర్ వేయడం గమనార్హం. మావోయిస్టులు కొరియర్ వ్యవస్థను పెంచుకుంటున్నట్టు సమాచారం. ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఈ నెల 19వ తేదీన సుదీర్ఘ లేఖ విడుదలైంది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి జగబంధు పేరుతో మరో లేఖ విడుదలైంది. దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి వికాస్ పేరుతో ఈ నెల మొదటి వారంలో ప్రకటన వెలువడింది. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో ప్రకటన వెలువడింది. మావోయిస్టు పార్టీ పేరుతో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పద్మగూడెం, కమలాపురం గ్రామాల వద్ద పోస్టర్లు పడ్డాయి. ఆంధ్రా–ఒడిశా సరిహద్దు స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ పేరుతో విడుదలైన ప్రకటనలో ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య ప్రస్తావన ఉంది. ఎన్కౌంటర్ తాజాగా, మంగళవారం భద్రాచలం ఏజెన్సీ సరిహద్దులోని సుక్మా జిల్లా చింతల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు తమ కార్యకలాపాలను పెంచేందుకు ప్రయత్నిస్తుండడంతో పోలీసు యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమవుతూ సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. దండకారణ్యంలో నిరంతరం కూంబింగ్ సాగిస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. -
6100 కోట్ల రైతు రుణ మాఫీ
రాయ్‌పూర్/గువాహటి/ భువనేశ్వర్: దాదాపు రూ.6,100 కోట్ల స్వల్పకాలిక పంట రుణాలను మాఫీ చేస్తామని ఛత్తీస్‌గఢ్ కొత్త ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ప్రకటించారు. బఘేల్ మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది నవంబర్ 30వ తేదీలోపు సహకార బ్యాంకులు, ఛత్తీస్‌గఢ్ గ్రామీణ బ్యాంకుల నుంచి 16.65 లక్షల మంది రైతులు తీసుకున్న రూ.6,100 కోట్ల మేర రుణాలను మాఫీ చేస్తామని వెల్లడించారు. రుణమాఫీతో పాటు వరి కనీస మద్దతు ధరను (ఎంఎస్పీ) క్వింటాలుకు రూ.2,500కు పెంచుతామన్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చే దిశగా అడుగు పడినట్లయింది. అదే బాటలో అసోం.. సుమారు 8 లక్షల మంది రైతులకు చెందిన రూ.600 కోట్ల రుణాలను రద్దు చేయనున్నట్లు అసోంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనివల్ల రైతు రుణాల్లో 25 శాతం వరకు రద్దు అవుతాయి. దీంతోపాటు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పంట రుణాలపై వడ్డీ మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా తీసుకున్న రుణాల్లో రూ.10వేల సబ్సిడీ ఇస్తామని తెలిపారు. మేమూ చేస్తాం ఒడిశా బీజేపీ తమకు అధికారమిస్తే రైతుల రుణాలన్నిటినీ రద్దు చేస్తామని ఒడిశా బీజేపీ వాగ్దానం చేసింది. రాష్ట్రంలో 2019లో ఎన్నికలు జరగనున్నాయి. ‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతు రుణాలన్నీ రద్దు చేస్తాం. రైతులకు వడ్డీలేని రుణాలిస్తాం’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ పాండా తెలిపారు. ఇదే హామీని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నిరంజన్ ఇంతకుమునుపే ఇచ్చారు.