రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తాజాగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దేవ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ మాయకత్వంలో ఛత్తీస్‌గఢ్ చాలా అభివృద్ధి చెందిందని భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకముందని అన్నారు.
మాకు చాలా ఇచ్చారు..
ఛత్తీస్‌గఢ్‌లోని తొమ్మిది జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ అనంతరం లక్ష మందికి సికిల్ సెల్ వ్యాధి కౌన్సెలింగ్ కార్డులను అందజేశారు. ఈ సందర్బంగా ఛత్తీస్‌గఢ్‌లోఅనేక మేజర్ ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం టీఎస్ సింగ్ దేవ్ ప్రధానిని స్వాగతిస్తూ.. మీరు మాకేదో ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు చాలా ఇచ్చారు. భవిష్యతులో కూడా మాకు చాలా ఇస్తారని విశ్వసిస్తున్నాను అన్నారు. కేంద్రంలోని మీ నాయకత్వంలో మేమంతా పనిచేశాము. ఇంతవరకు కేంద్రాన్ని ఎలాంటి సాయం అడిగినా ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా వ్యవహరించి రాష్ట్రానికి చాలా చేశారన్నారు. మా రాష్ట్రం కేంద్రం సహాయంతో అభివృద్ధిలో మరింత ముందుకు దూసుకెళుతుందని ఆశిస్తున్నానన్నారు.
Chattisgarh Deputy CM TS Singh Deo praises PM Modi for always supporting Chattisgarh Govt pic.twitter.com/QuavHjfgQD
— DR.TEENA KAPOOR SHARMA (@Teenasharma_77) September 15, 2023
ఈ రాష్ట్రం పవర్‌హౌస్..
ఈ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ అభివృద్ధిలో పవర్‌హౌస్ లాంటిదని ఇలాంటి పవర్‌హౌస్‌లు తమ శక్తి సామర్ధ్యాల మేరకు పనిచేస్తేనే దేశం కూడా అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మరిన్ని అభివృద్ధి పనులు చేయనున్నామని అందులో భాగంగానే ఈరోజు కొన్నిటికి శంకుస్థాపన చేశామని అన్నారు. ఈ సంఫర్బంగా జులైలో రాయ్‌పూర్-విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్, అలాగే రాయ్‌పూర్-ధన్‌బాద్ ఎకనామిక్ కారిడార్ శంకుస్థాపన కోసం వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
छत्तीसगढ़ देश के लिए पावर हाउस की तरह है,
— BJP Chhattisgarh (@BJP4CGState) September 14, 2023
आज दुनिया भारत से सीखने की बात कर रही है!
- प्रधानमंत्री श्री @narendramodi जी #विजय_शंखनाद_रैली pic.twitter.com/8BbzdKXz5u
అదీ అసలు కారణం..
ఛత్తీస్‌గఢ్‌లో రాబోయే ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ పార్టీల తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దూకుడును పెంచింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎం రేసులో ఉన్న టీస్ సింగ్ దేవ్‌ను కాదని భూపేష్ బాఘేల్‌ను ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అప్పటి నుంచి టీఎస్ సింగ్ దేవ్ స్వపక్షంలో విపక్షంలా వ్యవహరిస్తున్నారు. అసలే త్వరలో ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి వైఖరి కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రధానికి కేజ్రీవాల్ సవాల్.. ధైర్యముంటే పేరు మార్చండి..
Comments
Please login to add a commentAdd a comment