తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు.
ఖమ్మం : తెలంగాణ- ఛత్తీస్ గఢ్ సరిహద్దులో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. శనివారం చత్తీస్‌గఢ్‌లోని లంకపల్లి గ్రామంలో ఈ కాల్పులు జరిగాయి. మృతి చెందిన వారిలో ఒకరు తూర్పుగోదావరికి చెందిన వారు కాగా మరొకరు చత్తీస్‌గఢ్‌కు చెందిన వారు. మరో మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. వారి మృతదేహాలను భద్రాచలం తరలించి అక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహిస్తారని సమాచారం. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.