Angry At Boyfriend, Girl Climbs 80-Foot-High Tower - Sakshi
Sakshi News home page

ప్రియుడిపై అలిగి 80 అడుగుల టవర్ ఎక్కి హైడ్రామా.. ప్చ్ చివరికి..  

Published Mon, Aug 7 2023 11:54 AM | Last Updated on Mon, Aug 7 2023 1:38 PM

Angry At Boyfriend Girl Climbs 80 Foot High Tower - Sakshi

రాయపూర్: ప్రేమికుడిపై అలిగి కోపంతో ప్రియురాలు 80 అడుగుల ఎత్తైన హై టెన్షన్ పవర్ లైన్ ఎక్కిన సంఘటన గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో చోటు చేసుకుంది. కోపంతో టవర్ ఎక్కుతున్న ప్రేయసిని బుజ్జగించేందుకు ఆమెను అనుసరిస్తూ ప్రియుడు కూడా అదే టవర్ పైకి ఎక్కాడు. పోలీసులు రంగప్రవేశం చేసి ఇద్దరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించారు.  

ఛత్తీస్‌గఢ్‌లోని గౌరెలా పెండ్ర మార్వాహి జిల్లాలో ఒక ప్రేమజంట పెద్ద సాసహం చేసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ఫోన్లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కోపగించిన ప్రియురాలు దగ్గర్లోని 80 అడుగుల హైటెన్షన్ పవర్ లైన్ ఎక్కి దూకాలని నిర్ణయించుకుంది. అనుకుందే తడవు చకచకా 80 అడుగుల హైటెన్షన్ టవర్ ఎక్కేసింది. ప్రేమించిన అమ్మాయి టవర్ ఎక్కి ఎక్కడ అఘాయిత్యం చేసుకుంటుందోనని కంగారుపడిన ప్రియుడు అంతే వేగంగా పరుగు లంఘించుకుని తాను కూడా టవర్ ఎక్కుతూ కనిపించాడు.

స్థానికులు ఈ దృశ్యాలను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గ్రామస్తులు విషయాన్ని చేరవేడంతో ఆ ప్రేమ జంట తల్లిదండ్రులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి గంటల పాటు శ్రమించి ఎలాగోలా వారిద్దరినీ క్షేమంగా కిందకి దించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ అమ్మాయి మైనర్ అని వారిద్దరి మధ్య తగువు తలెత్తడంతో ఈ సాహసానికి ఒడిగట్టారన్నారు. వారిపైన కేసు నమోదు చేయలేదు కానీ మందలించి పంపినట్టు తెలిపారు. ఈ చోద్యాన్ని చూడటానికి వచ్చిన వారెవరో మొత్తం సన్నివేశాన్ని చక్కగా మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.      

ఇది కూడా చదవండి: రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు: లోక్‌సభ స్పీకర్‌ కీలక నిర్ణయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement