ఈ జీవితమే వద్దనుకుని వచ్చి..రైల్వే పట్టాలపైనే నిద్రపోయింది!
క్షణికావేశంలోనో, జీవితంలో భరించలేని కష్టాలు వచ్చాయనో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇది నేరమని తెలిసినా, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్న వారిని చాలామందిని చూస్తుంటాం. కానీ బిహార్‌లో నమ్మశక్యం కాని సంఘటన ఒకటి చోటు చేసుకుంది.
జీవితంపై ఆశలు కోల్పోయిన ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఒక విద్యార్థిని పట్టాలపై ఆదమరిచి నిద్ర పోయిన ఘటన అందర్నీ విస్మయానికి గురి చేసింది.
వివరాలను పరిశీలిస్తే బిహార్‌లోని మోతిహారిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. కారణం తెలియరాలేదు గానీ చాకియా రైల్వేస్టేషన్ ఔటర్ సిగ్నల్ దగ్గర పట్టాలపై పడుకుంది. ఇది గమనించిన రైలు డ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. తక్షణమే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రైలు డ్రైవర్ రైలు నుంచి కిందకు దిగి విద్యార్థినిని లేపేందుకు ప్రయత్నించగా, ఆమె నుంచి స్పందన లేకపోవడంతో పొరుగున ఉన్న మహిళల సాయంతో ఆమెను నిద్ర లేపి, ట్రాక్‌పై నుంచి పక్కకు తీసుకొచ్చారు. గండం గడిచింది అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నారు.
(ఇదీ చదవండి : కొంచెం స్మార్ట్‌గా..అదిరిపోయే వంటింటి చిట్కాలు)
A girl reached Motihari's Chakia railway station to commit su!cide and fell asleep on the railway track while waiting for the train, Train Driver saved the girl's life by applying emergency brakes, Bihar
pic.twitter.com/Jrg1VqjG2s— Ghar Ke Kalesh (@gharkekalesh) September 10, 2024
కానీ ఆ విద్యార్థిని మాటలు విన్న వారంతా షాకయ్యారు. ‘నేను చచ్చి పోదామనుకున్నా, నన్ను వదిలండి’’ అంటూ వాదనకు దిగింది. ఆమెను గట్టిగా పట్టుకున్న స్థానిక మహిళ నుంచి తనచేతిని విదిలించుకొని పారిపోవాలని చేసింది. దీంతో ఆమె ఆగ్రహంతో దాదాపు కొట్టినంత పనిచేసింది తలా ఒక మాట అనడంతో తాను కుటుంబ సమస్యల కారణంగా తాను చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది. ఈ గందర గోళం మధ్య రైలు కొద్ది సేపు నిలిచిపోయింది. పరిస్థితి సద్దుమణిగాక బయలు దేరింది.
కాగా నిజంగానే ఆమె ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? ఇంత చిన్న వయసులో అంత కష్టం ఏమొచ్చిందీ? లేదంటే తల్లిదండ్రులను బెదిరించాలనుకుందా? లేదా ఏదైనా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా? ఇవన్నీ ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలు.
Comments
Please login to add a commentAdd a comment