పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు.
Comments
Please login to add a commentAdd a comment