results release
-
ఒకే ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఐసెట్ రిజల్ట్
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు జూన్ 5,6 తేదీల్లో నిర్వహించిన తెలంగాణ ఐసెట్-2024 ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో కాకతీయ వర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి ఫలితాలను విడుదల చేశారు.తెలంగాణ ఐసెట్ ఫలితాలు రిజల్ట్ కోసం క్లిక్ చేయండి -
సివిల్స్ టాపర్ శ్రుతీ శర్మ
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్–2021 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ సోమవారం వెల్లడించింది. తొలి ర్యాంకును చరిత్ర విద్యార్థిని శ్రుతీ శర్మ సొంతం చేసుకుంది. ఈసారి టాప్–3 ర్యాంకులూ మహిళలే దక్కించుకున్నారు! రెండో స్థానంలో అంకితా అగర్వాల్, మూడో స్థానంలో గామినీ సింగ్లా నిలిచారు. ఐశ్వర్య వర్మకు నాలుగు, ఉత్కర్ష్ ద్వివేదికి ఐదో ర్యాంకులు లభించాయి. టాప్ 25లో 15 మంది పురుషులు, 10 మంది మహిళలున్నారు. 685 మంది ఎంపిక కాగా, వీరిలో 508 మంది పురుషులు, 177 మంది మహిళలు. విజేతల్లో 25 మంది దివ్యాంగులున్నారు. 2015లో తొలి నాలుగు ర్యాంకులూ మహిళలే సాధించారు. 2021 అక్టోబర్ 10న జరిగిన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు 5,08,619 మంది హాజరయ్యారు. 9,214 మంది మెయిన్ రాతపరీక్షకు అర్హత సాధించారు. ఈ ఏడాది జనవరిలో పరీక్ష జరిగింది. 1,824 మంది ఇంటర్వ్యూకు అర్హత పొందగా 685 మంది ఎంపికయ్యారు. ఫలితాలను www. upsc. gov. in. వెబ్సైట్లో పొందుపర్చారు. చదవండి: సివిల్స్‌లో తెలుగు తేజాల సత్తా.. వారి నేపథ్యం, మనోగతాలివీ హిస్టరీ ఆప్షనల్‌గా టాప్ ర్యాంక్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి హిస్టరీ(ఆనర్స్)లో పట్టభద్రురాలైన శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో హిస్టరీ సబ్జెక్టును అప్షనల్గా ఎంచుకొని టాప్ ర్యాంకుతో జయకేతనం ఎగురవేశారు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి ఎకనామిక్స్(ఆనర్స్)లో గ్రాడ్యుయేట్ అయిన అంకితా అగర్వాల్ సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్‌ను ఆప్షనల్ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు. రెండో ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఇక కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తిచేసిన గామినీ సింగ్లా సోషియాలజీ ఆప్షనల్‌గా సివిల్స్ రాశారు. మూడో ర్యాంకు సాధించారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ టాప్–25 ర్యాంకర్లలో చాలామంది ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, కామర్స్, మెడికల్ సైన్స్ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. వీరంతా ఐఐటీ, ఎయిమ్స్, వీఐటీ, పీఈసీ, యూనివర్సిటీ ఆఫ్ ముంబై, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, జీబీ పంత్ యూనివర్సిటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. వీరు సివిల్స్(మెయిన్) రాత పరీక్షలో ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిందీ లిటరేచర్, హిస్టరీ, మ్యాథ్స్, మెడికల్ సైన్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జువాలజీ సబ్జెక్టులను ఆప్షనల్‌గా ఎంచుకున్నారు. ప్రధాని మోదీ అభినందనలు సివిల్స్ విజేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న నేపథ్యంలో దేశ అభివృద్ధి ప్రయాణంలో ఇదొక కీలక దశ. ఈ సమయంలో పరిపాలనాపరమైన ఉద్యోగ జీవితంలోకి అడుగుపెడుతున్న యువతకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. సివిల్స్‌లో ఆశించిన ఫలితం సాధించలేకపోయిన అభ్యర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఎంచుకున్న రంగంలో వారు అద్భుతాలు సృష్టించగలరని, దేశాన్ని గర్వపడేలా చేయగలరని తెలిపారు. వారికి సైతం అభినందనలు తెలిపారు. మొదటి ర్యాంకు ఊహించలేదు: శ్రుతీ శర్మ సివిల్స్ పరీక్షలో తనకు మొదటి ర్యాంకు వస్తుందని ఊహించలేదని శ్రుతీ శర్మ చెప్పారు. ఇది ఊహించని ఫలితం అని ఆనందం వ్యక్తం చేశారు. తన సివిల్స్ ప్రయాణంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం, స్నేహితుల సహాయం మర్చిపోలేనిదని తెలిపారు. ఈ క్రెడిట్ మొత్తం వారికే చెందుతుందని పేర్కొన్నారు. ఢిల్లీకి చెందిన శ్రుతి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. నాలుగేళ్లుగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నారు. జామియా మిలియా ఇస్లామియాకు చెందిన రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీలో సివిల్స్ శిక్షణ పొందారు. మహిళల సాధికారతకు కృషి: అంకితా అగర్వాల్ మహిళల సాధికారత కోసం కృషి చేస్తానని, ప్రాథమిక ఆరోగ్యం, పాఠశాల విద్యా రంగాలను బలోపేతం చేయడం తన లక్ష్యమని సెకండ్ ర్యాంకర్ అంకిత చెప్పారు. కోల్‌కతాకు చెందిన ఆమె 2020 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి. ప్రస్తుతం హరియాణాలో ప్రొబేషన్‌లో ఉన్నారు. ఈసారి రెండో ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈసారి సివిల్స్‌లో మొదటి మూడు ర్యాంకులు మహిళలకే దక్కడం దేశానికి గర్వకారణమని అంకిత అన్నారు. కల నెరవేరింది: గామినీ సింగ్లా కష్టపడే తత్వం, అంకితభావం ఉన్న మహిళలు ఏదైనా సాధించగలరని మూడో ర్యాంకర్ గామినీ సింగ్లా వ్యాఖ్యానించారు. తన కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్‌ను ఎంచుకుంటానని, దేశ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని వివరించారు. గామినీ సింగ్లా రెండో ప్రయత్నంలో సివిల్స్‌లో మూడో ర్యాంకు సాధించారు. ఆమె తల్లిదండ్రులు హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వంలో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. -
సీబీఎస్ఈ రద్దయిన పరీక్షలకు.. ప్రతిభ ఆధారంగా మార్కులు
న్యూఢిల్లీ: కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా జూలైలో జరగాల్సిన పరీక్షలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. మిగిలిన పేపర్లకు మార్కులు వేసే సీబీఎస్ఈ నాలుగు అంశాల ఫార్ములాకు కూడా న్యాయస్థానం ఆమోదం తెలిపింది. దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున జూలై 1నుంచి 15వ తేదీల మధ్యన జరగాల్సిన సీబీఎస్ఈ పెండింగ్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సంజయ్ ఖన్నాల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. కేంద్రం, సీబీఎస్ఈ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున 10, 12వ తరగతి పెండింగ్ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం, సీబీఎస్ఈ నిర్ణయించాయన్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు బోర్డు పరీక్షలు నిర్వహించలేమంటూ అశక్తత వ్యక్తం చేశాయని ఆయన ధర్మాసనానికి తెలిపారు. 10, 12వ తరగతి విద్యార్థులు ఇప్పటికే నిర్వహించిన పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు. జూలై 15వ తేదీ నాటికి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. మిగిలి ఉన్న పరీక్షలకు హాజరు కావడమా లేక ఇప్పటికే హాజరైన పరీక్షల్లో చూపిన ప్రతిభను బట్టి వేసే మార్కులకు అంగీకరించడమా అనే ఆప్షన్‌ను 12వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఇస్తున్నామన్నారు. సీబీఎస్ఈ విధానాన్నే అటూఇటుగా తామూ అనుసరిస్తామని ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(ఐసీఎస్ఈ) ధర్మాసనానికి నివేదించింది. 10,12వ తరగతి పరీక్షల ఫలితాలను జూలై 15వ తేదీకల్లా ప్రకటిస్తామని ఐసీఎస్ఈ తెలిపింది. 10, 12వ తరగతులకు గత పరీక్షల్లో విద్యార్థులు చూపిన ప్రతిభ ఆధారంగానే ఫలితాలు ప్రకటిస్తామని ఐసీఎస్ఈ స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి భయంతో సీబీఎస్ఈ పరీక్షలు అర్థంతరంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అత్యుత్తమ సరాసరి మార్కులే ఆధారం 10, 12వ తరగతి విద్యార్థి ఇప్పటికే రాసిన పరీక్షల్లో చూపిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగానే రద్దయిన పరీక్షల సబ్జెక్టులకు మార్కులు నిర్ణయిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల పరీక్షలు రాసిన వారికి, మూడు పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ మార్కుల సరాసరిని పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది. మూడు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికైతే రెండు సబ్జెక్టుల్లో మార్కులను బట్టి మార్కులు వేస్తాయనుంది. ఢిల్లీలో అల్లర్ల కారణంగా 12వ తరగతి ఒకటి, రెండు సబ్జెక్టులు మాత్రమే రాసిన వారికి... రాసిన సబ్జెక్టులు, ఇంటర్నల్/ప్రాక్టికల్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా ఫలితాలను నిర్ణయిస్తారు. -
తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఎడ్‌సెట్ 2019 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్ కన్వీనర్ ప్రొ.మృణాళిని, ప్రొ. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం 43,113 మంది పరీక్షకు హాజరు కాగా 41,195 క్వాలిపై అయినట్లు తెలిపారు. జూలై లాస్ట్ వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. -
అకౌంటెంట్ పరీక్షలో అందరూ ఫెయిలే..
పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు. -
ఐసెట్‌లో 90 శాతం మంది అర్హత
సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి ఫలితాల ను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత నెల 23, 24 తేదీల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 61,439 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 55,191 మంది హాజరయ్యారని తెలిపారు. అందులో 49,812 మంది (90.25 శాతం) అర్హత సాధించినట్లు తెలిపారు. త్వరలో నిర్వహించే సెట్ కమిటీ సమావేశంలో.. ప్రవేశాల కౌన్సెలింగ్ తేదీలను నిర్ణయిస్తామని వివరించారు. గతేడాది 304 ఎంబీఏ కాలేజీల్లో 32 వేల సీట్లు, 49 ఎంసీఏ కాలేజీల్లో 5,846 సీట్లు అందుబాటులో ఉన్నాయని, ఈసారి యూనివర్సిటీలు ఇచ్చే గుర్తింపును బట్టి సీట్ల సంఖ్య తేలుతుందని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యశర్మ తెలిపారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ పాల్గొన్నారు. ఫిర్యాదులు వస్తే చర్యలు: పాపిరెడ్డి ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు ఊహాగానాలేనని పాపిరెడ్డి స్పష్టం చేశారు. ఏదైనా కాలేజీపై ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటామని, వాటికి ఆధారాలు ఉండాలని తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి నిబంధనలు జారీ చేశామని, వాటి ప్రకారమే ప్రవేశాలు చేపట్టాలని పేర్కొన్నారు. బీటెక్ విద్యార్థులు కూడా.. ఎంబీఏ, ఎంసీఏ చదివేందుకు బీకాం విద్యార్థులు అత్యధికంగా దరఖాస్తు చేసుకోగా.. తర్వాతి స్థానంలో బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువగా దరఖాస్తు చేసుకున్నారు. అర్హత సాధించిన వారిలోనూ బీఎస్సీ, బీటెక్ విద్యార్థులు ఎక్కువ మందే ఉన్నారు. -
ట్రంప్ బుర్ర గట్టిదే..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(71) మానసిక ఆరోగ్యంపై అనుమానాలు నెలకొన్న నేపథ్యంలో శ్వేతసౌధం వైద్యుడు డా.రానీ జాక్సన్ అధ్యక్షుడికి జరిపిన పరీక్షా ఫలితాలను మంగళవారం మీడియాకు వెల్లడించారు. ట్రంప్ మానసిక స్థితి సరిగానే ఉందనీ, ఈ పరీక్షల్లో ట్రంప్ 30కి 30 పాయింట్లు సాధించారని తెలిపారు. జంక్ ఫుడ్ తీసుకున్నా ఆరోగ్యంగా ఉండటానికి ట్రంప్ జన్యువులే కారణమన్నారు. గత 20 ఏళ్లలో మరింత ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని ఉంటే మరో 200 ఏళ్లు బతికేవారని తాను ట్రంప్‌తో చెప్పినట్లు జాక్సన్ వెల్లడించారు. మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్ పేరిట దేశాధ్యక్షుడికి ఉన్న ఏకాగ్రత, మనసును లగ్నంచేసే తీరు, జ్ఞాపకశక్తి, భాష, గణన సామర్థ్యం వంటి అనేక అంశాలపై ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షలో మెదడు పనితీరుకు సంబంధించి ట్రంప్‌నకు సమస్యలేవీ లేవని తేలిందన్నారు. ట్రంప్ స్వయంగా కోరడంతోనే ఈ పరీక్షను నిర్వహించినట్లు డా.జాక్సన్ స్పష్టం చేశారు. ఈ పరీక్షలో 30కి 26 పాయింట్లు వస్తే మెదడు సక్రమంగా పనిచేస్తున్నట్లేనని తెలిపారు. ఇటీవల విడుదలైన పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’లో అధ్యక్షుడి మానసిక ఆరోగ్యంపై ఆయన సహాయకులకే అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్లో సైనిక వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. 6.3 అడుగుల ఎత్తున్న ట్రంప్ 108 కిలోల బరువున్నారని జాక్సన్ తెలిపారు. -
బీటెక్ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్–2017 లో నిర్వహించిన బీటెక్ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్ , నాలుగు సంవత్సరం మొదటి సెమిస్టర్ సప్లిమెంటరీ, బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సి.శశిధర్ తెలిపారు. -
ఎస్సై కమ్యూనికేషన్ సవరించిన ఫలితాలు విడుదల
సాంకేతిక సమస్య వల్లే పొరపాటు: డీజీపీ సాక్షి, హైదరాబాద్: సబ్ ఇన్స్పె క్టర్ (ఎస్సై) కమ్యూనికేషన్, పీటీ వో తుది పరీక్ష ఫలితాల విడు దలలో పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వైఫల్యం బయటపడింది. గణితం పరీక్ష మార్కులను కలప కుండానే శుక్రవారం ఫలితాలు ప్రకటించడం అభ్యర్థులను నిర్ఘా ంతపరిచింది. అభ్యర్థులు బోర్డు కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయ డంతో పొరపాటును గుర్తించిన అధికారులు... తొలుత విడుదల చేసిన ఫలితాలను రద్దు చేశారు. గణితం మార్కులు కలిపి ఫలి తాలను ఆదివారం ప్రకటించా రు. సోమవారం ఉదయం 11 నుంచి వెబ్సైట్ ద్వారా మార్కు ల జాబితాను డౌన్లోడ్ చేసుకో వాలని, సందేహాలుంటే ఆగస్టు 5 నుంచి 9 వరకు ఓపెన్ చాలెంజ్ ద్వారా పరిశీలించుకోవాలని బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు సూచించారు. తుది ఫలితాల్లో కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గణితం మార్కులు అనుసం ధానం కాలేదని, దీన్ని గుర్తించి మళ్లీ ఫలితాలు ప్రకటించామని డీజీపీ అనురాగ్ శర్మ ‘సాక్షి’కి తెలిపారు. పోలీసు కమ్యూ నికేషన్, పీటీవో విభాగాల్లో 29 ఎస్సై పోస్టులకు గత నవంబర్‌లో తుది పరీక్ష నిర్వహించారు. -
బీటెక్, బీఫార్మసీ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో మే, జూన్–2017లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ మూడో సంవత్సరం రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ సి.శశిధర్ శుక్రవారం తెలిపారు. బీఫార్మసీ మొదటి, రెండు, మూడు, నాలుగో సంవత్సరం మొదటి , రెండో సెమిస్టర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశామన్నారు. విద్యార్థులు తమ మార్కుల వివరాల కోసం http://jntuaresults.azurewebsites.net ద్వారా తెలుసుకోవాలన్నారు. -
ఎస్కేయూ సెట్ ఫలితాలు విడుదల
– వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశ పరీక్షలు – 18 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన – వీసీ ప్రొఫెసర్ కె. రాజగోపాల్ వెల్లడి ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన ఎస్కేయూసెట్ – 2017 ఫలితాలను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ ఆదివారం విడుదల చేశారు. మొత్తం 30 విభాగాలకు గాను 6,595 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 6,186 మంది అర్హత (93.80 శాతం) సాధించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇన్స్టంట్ పరీక్ష రాసే విద్యార్థులకు వెసులుబాటు కల్పించే నేపథ్యంలో 18 నుంచి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష 10న నిర్వహిస్తారన్నారు. వెబ్ ఆప్షన్ల ద్వారా విద్యార్థులకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చునన్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఫలితాలు , ర్యాంకు కార్డులను ఠీఠీఠీ.టజుuఛీ్చౌ.జీn ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. రాత పరీక్షలు పూర్తీ అయిన 48 గంటల్లోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన డీఓఏ ప్రొఫెసర్ రాఘవులను అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్. లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణ, పీఆర్వో డాక్టర్ పి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులు విభాగం పేరు అడల్ట్ ఎడ్యుకేషన్ చేతన్‌కుమార్ కురుబ బయో కెమిస్ట్రీ లక్ష్మీ వెంకట చక్రపాణి బయోటెక్నాలజీ గౌసియాబేగం షేక్ బోటనీ లోకనాథ్‌రెడ్డి.జీ కెమిస్ట్రీ గోవర్ధన్.సి కామర్స్ సంతోష్‌కుమార్.డి కంప్యూటర్ సైన్సెస్ మనీష దిబ్బల ఎకనామిక్స్ శ్రావణి ఎం. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరన్న మాణిక్యాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శివకుమార్ .డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ హర్షిత.కె ఇంగ్లీష్ మనోజ్‌కుమార్ ఎస్ జియాగ్రఫీ దివాకర్ గొర్ల జియాలజీ ఈశ్వరయ్య.కె హిందీ సాయిలీల హిస్టరీ హరికృష్ణ.వి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ మంగ్లేనాయక్ రమావత్ మేథమేటిక్స్ ప్రవీణ్ కుమార్ .యు మైక్రోబయాలజీ నషీమా సయ్యద్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆనంద్.బీ ఫిజిక్స్ ఇంద్రాణి. జే పొలిటికల్ సైన్సెస్ అబ్దుల్లా షేక్ పాలిమర్ సైన్సెస్ జాహ్నవి ఘంటసాల రూరల్ డెవలప్మెంట్ లక్ష్మీనారాయణ సెరికల్చర్ దాసరి హరీష్‌కుమార్ సోషల్ వర్క్ తరుణీ ప్రియా పాటిల్ సోషియాలజీ వంశీ కృష్ణ ఎన్ స్టాటిస్టిక్స్ శ్రావణి ఇద్దే తెలుగు శ్రావణి పులగూర జువాలజీ దీపిక ఎం –మొత్తం 30 విభాగాలకు గాను 12 విభాగాల్లో మహిళలు మొదటి ర్యాంకు సాధించి ప్రతిభను చాటారు. –ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 100 మార్కులకు 99 మార్కులు సాధించిన ఆనంద్ తొలిర్యాంకు దక్కించుకొన్నాడు. -
ఇంజినీరింగ్‌లో నిరాశ
- ఎంసెట్ ఫలితాలు విడుదల - ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంకులు సాధించని జిల్లా విద్యార్థులు –మెడిసిన్, అగ్రికల్చర్లో మనోజ్ పవన్‌రెడ్డికి ఆరో ర్యాంకు జేఎన్టీయూ : ఎంసెట్–2017 ఫలితాలు జిల్లాకు నిరాశ మిగిల్చాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌లో మంచి ర్యాంకులు సాధించడంలో ‘అనంత’ విద్యార్థులు విఫలమయ్యారు. ఈ విభాగంలో మొత్తం 8,100 మంది విద్యార్థులు ఆన్లైన్ పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 6,799 మంది అర్హత సాధించారు. టాప్–10లో ఒక్కరూ లేకపోవడం, అదీ ఇలా జరగడం తొలిసారి కావడం గమనార్హం. ఇంజినీరింగ్‌లో ఎన్. పవన్ కుమార్ (334 ర్యాంకు ), రాయపాటి యశ్వంత్‌కుమార్ (510), చిట్టాడ పవన్‌కళ్యాణ్ (1,015), గొల్లపల్లి రూప(1,508 ), కె.రోహిత్ కుమార్ (1,550) , ఎం.మహేంద్రరెడ్డి (1,733), ఏ.జశ్వంత్‌రెడ్డి (1,765), పి.రుక్మానందరెడ్డి (1,833), హజీ ముజామిల్ ( 2,156), ఎం.నూరుల్లా ( 2,704), బి.మోక్షిత్ దాస్ (2,731), బి.గిరితేజ (2,781) మాత్రమే చెప్పుకోదగ్గ ర్యాంకులు సాధించారు. ఇక అగ్రికల్చర్, వెటర్నరీ, డెంటల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పేరుతో నిర్వహించిన ఆన్లైన్ పరీక్షలో (ఎంబీబీఎస్ ప్రవేశాలు ‘నీట్’లో ర్యాంకుల ఆధారంగా కల్పిస్తారు) హిందూపురానికి చెందిన జి.మనోజ్ పవన్ కుమార్‌రెడ్డి రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంకు సాధించాడు. 146.47 స్కోరు సాధించి గణనీయమైన ర్యాంకును కైవసం చేసుకున్నాడు. అలాగే షేక్ గుట్టూరు ఆప్సా నజ్నీన్ 563వ ర్యాంకు , పి.నబిలాఅక్తర్ 960, జి.సతీష్ చంద్ర 1,016, బి.చేతన 1,084, ఎల్.ప్రత్యూష 1,286, జి.లావణ్య 1,309, టి.అనూష 1,473, ఎం.నిహారిక 1,898, సి.శ్రీనాథ్ 1,968వ ర్యాంకు సాధించారు. -
ఎస్కేయూ రీసెట్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్–2016 ఫలితాలు శనివారం విడుదల చేశారు. ఎస్కేయూలో వీసీ ఆచార్య కె.రాజగోపాల్, రెక్టార్ ఆచార్య హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.సుధాకర్‌బాబు, ఆర్అండ్డీ డీన్ ఆచార్య చింతా సుధాకర్ ఫలితాలను విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆన్లైన్ విధానంలో రీసెట్ నిర్వహించిన ఘనత ఎస్కేయూకు దక్కిందన్నారు. మొత్తం 2,560 మంది దరఖాస్తు చేసుకోగా, 1,646 మంది పరీక్ష రాశారని తెలిపారు. వీరిలో 856 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఆచార్య వి.రంగస్వామి, పీఆర్వో డాక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడలో రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రుల్లో టెన్షన్ మొదలైంది. ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలో 16,297 మంది విద్యార్థులు రాశారు. ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు తొలివిడత, 8 నుంచి 12 వరకు రెండో విడత, 13 నుంచి 17 వరకు మూడో విడత, 18 నుంచి 22 వరకు చివర విడతగా జరిగాయి. మార్చి 1 నుంచి 18 వరకు జరిగిన వార్షిక పరీక్షలకు మొత్తం 70,726 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు 35,981 మంది, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 34,745 మంది ఉన్నారు. ఒకేసారి ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు గతంలో ప్రథమ సంవత్సరం ఫలితాలు విడుదల చేసిన కొన్ని రోజుల తర్వాత ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదల చేసేవారు. అయితే గతేడాది నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండూ ఒకేరోజు ఫలితాలను విడుదల చేస్తోంది. ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
బీటెక్ మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల
జేఎన్టీయూ : జేఎన్టీయూ అనంతపురం పరిధిలోని బీటెక్ మొదటి సంవత్సరానికి సంబంధించిన మొదటి సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆచార్య సి.శశిధర్ తెలిపారు. -
‘ఓపెన్’ సప్లిమెంటరీ ఫలితాల విడుదల
- ‘పది’లో 56.52 శాతం, ఇంటర్లో 43.92 శాతం ఉత్తీర్ణత అనంతపురం ఎడ్యుకేషన్ : ఓపెన్ స్కూల్(సార్వత్రిక విద్యా పీఠం) ద్వారా అక్టోబర్‌లో నిర్వహించిన సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జిల్లాలో 506 మంది పదో తరగతి పరీక్షలు రాయగా 286 మంది(56.52శాతం), 1,061 మంది ఇంటర్ పరీక్షలు రాయగా 466(43.92 శాతం) మంది ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ శామ్యూల్, ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. జవాబుపత్రం, రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతి విద్యార్థులైతే రూ.100, ఇంటర్ విద్యార్థులైతే రూ.200 చెల్లించాల్సి ఉంటుందన్నారు. రీవెరిఫికేషన్ (జవాబుపత్రం జిరాక్స్)కైతే పదో తరగతి విద్యార్థులైనా, ఇంటర్వాళ్లయినా ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, మీసేవా, ఏపీ ఆన్లైన్ ద్వారా ఫీజు చెల్లించాలని సూచించారు. -
ఫార్మా డీ ఫలితాల విడుదల
జేఎన్టీయూ : జేఎ¯ŒSటీయూ అనంతపురం పరిధిలో ఆగస్టు, సెప్టెంబర్–2016లో నిర్వహించిన ఫార్మా డి నాలుగు, మూడు , రెండు, మొదటి సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స ఆచార్య సి.శశిధర్ తెలిపారు. విద్యార్థులు వారి కళాశాల ప్రిన్సిపాళ్లను అడిగి మార్కుల వివరాలు తెలుసుకోవాలని సూచించారు. -
టీటీసీ లోయర్ థియరీ పరీక్షా ఫలితాల విడుదల
అనంతపురం ఎడ్యుకేషన్ : టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ కోర్స్ (టీటీసీ) లోయర్ థియరీ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు డీఈఓ అంజయ్య, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
35%పాస్
♦ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ♦ ఫస్టియర్‌లో 79.59 శాతం ఉత్తీర్ణత సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియెట్ అడ్వాన్సడ్ సప్లిమెంటరీ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 26,815 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 9,349 మాత్రమే పాసై 35 శాతం ఉత్తీర్ణత సాధించారు. వార్షిక పరీక్షల్లో సంతృప్తికరంగా ఫలితాలుండగా.. అడ్వాన్సడ్ సప్లిమెంటరీలో మాత్రం అతి తక్కువ ఉత్తీర్ణత నమోదు కావడం గమనార్హం. అదేవిధంగా ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు సంబంధించి 88,364 మంది అడ్వాన్సడ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఇందులో ఫెయిల్ అయిన వారితోపాటు ఇంప్రూవ్మెంట్ కోసం పరీక్షలు రాసినవారున్నారు. ఈక్రమంలో 70,329 మంది పాసై 79.59శాతం ఉత్తీర్ణత సాధించారు. -
జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలు విడుదల
ఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్-2016 ఫలితాలను ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తాచాటారు. మొదటి 100 ర్యాంకుల్లో 30 శాతం తెలుగు విద్యార్థులు సాధించడం విశేషం. తెలుగు విద్యార్థికి నాలుగో ర్యాంక్ వచ్చింది. -
తెలంగాణ పాలీసెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సోమవారం మీడియా సమావేశంలో ఫలితాలను విడుదల చేశారు. పాలీసెట్‌లో 82.57 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎనిమిదిమంది విద్యార్థులకు 120కి 120 మార్కులు వచ్చాయి. ఈ నెల 20 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించి, జూన్ 9 నుంచి పాలిటెక్నిక్ తరగతులను నిర్వహిస్తారు. -
ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదల
హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను బుధవారం ఐఐటీ ముంబయి విడుదల చేసింది. ఒకరోజు ముందుగానే ఫలితాలను సీబీఎస్ఈ విడుదల చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో మొత్తం 26, 456 మంది అర్హత సాధించారు. అర్హత సాధించినవారిలో 3,040 మంది బాలికలు ఉన్నారు. తొలి పది ర్యాంకుల్లో తెలుగు విద్యార్థులు పలు ర్యాంకులను దక్కించుకోగా, చెన్నై జోన్‌కు 5 ర్యాంకులు వచ్చాయి. ఎస్సీ విభాగంలో గుంటూరు జిల్లాకు చెందిన తురకభవన్కు తొలి ర్యాంకు వచ్చింది. ఎస్టీ విభాగంలో విశాఖ జిల్లాకు చెందిన హర్షమీనాకు తొలి ర్యాంకు దక్కింది. ఓబీసీ విభాగంలో విజయనగరానికి చెందిన సందీప్ కుమార్‌కు తొలి ర్యాంకు దక్కింది. కాగా, ఓపెన్ కేటగిరీలో ఆహ్వాన రెడ్డికి ఆరోవ ర్యాంకు, కామన నాగేందర్ రెడ్డి నాల్గోవ ర్యాంకు దక్కించుకున్నాడు. -
తెలంగాణ లాసెట్, ఐసెట్ ఫలితాల విడుదల
హైదరాబాద్: తెలంగాణలో నిర్వహించిన లాసెట్, ఐసెట్ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణ ఐసెట్‌లో కష్ణా జిల్లాకు చెందిన కృష్ణ చైతన్య తొలి ర్యాంక్ సాధించాడు. (ఐసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) (లాసెట్ ఫలితాలకు ఇక్కడ క్లిక్ చేయండి) -
మే 28 లేదా 29 తేదీల్లో టెన్త్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షా ఫలితాలను మే 28 లేదా 29 తేదీల్లో విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది కంటే ఫలితాల విడుదల ఈసారి మూడు నాలుగు రోజులు ఆలస్యం కావచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెన్త్ పరీక్షలకు సంబంధించిన 65 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ సాగుతోంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలోని 13 కేంద్రాల్లో దాదాపు 15 వేలమంది టీచర్లు మూల్యాంకనంలో పాల్గొంటున్నారు. ఈ నెల 28నాటికి మూల్యాంకనం పూర్తి కావచ్చని అంచనా. తరువాత కంప్యూటరీకరణ తదితర కార్యక్రమాలు పూర్తిచేసి మే ఆఖరుకల్లా ఫలితాలు విడుదల చేస్తామని ప్రభుత్వ పరీక్షల డెరైక్టరేట్ వర్గాలు వివరించాయి. జూన్ మూడోవారంలో సప్లిమెంటరీ పరీక్షలు టెన్త్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలను జూన్ మూడో వారంలో నిర్వహిస్తారు. టెన్త్ కామన్ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన వెంటనే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటిస్తామని, ఈ పరీక్షలకోసం ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్సెస్సీ బోర్డు వర్గాలు తెలిపాయి. జూన్ మూడోవారంలో పరీక్షలు నిర్వహించి తదుపరి త్వరగా ఫలితాలు విడుదల చేస్తామని, ఆ విద్యార్థులకు ఇంటర్లో ప్రవేశాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేపట్టామని వివరించాయి. -
లాసెట్ ఫలితాల విడుదల
తిరుపతి: లా ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఎస్వీ యూనివర్సిటీలో లాసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలన్నీ ఒకే గొడుగు కింద ఉంటాయని చెప్పారు. తిరుపతిలో ఐఐటీ, ఐటీఐఆర్, కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.