– వచ్చే ఏడాది నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రవేశ పరీక్షలు
– 18 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
– వీసీ ప్రొఫెసర్ కె. రాజగోపాల్ వెల్లడి
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన ఎస్కేయూసెట్ – 2017 ఫలితాలను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ ఆదివారం విడుదల చేశారు. మొత్తం 30 విభాగాలకు గాను 6,595 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 6,186 మంది అర్హత (93.80 శాతం) సాధించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు ఆన్‌లైన్ విధానం ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇన్‌స్టంట్ పరీక్ష రాసే విద్యార్థులకు వెసులుబాటు కల్పించే నేపథ్యంలో 18 నుంచి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు.
డిగ్రీ ఇన్‌స్టంట్ పరీక్ష 10న నిర్వహిస్తారన్నారు. వెబ్ ఆప్షన్ల ద్వారా విద్యార్థులకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చునన్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఫలితాలు , ర్యాంకు కార్డులను ఠీఠీఠీ.టజుuఛీ్చౌ.జీn ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. రాత పరీక్షలు పూర్తీ అయిన 48 గంటల్లోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన డీఓఏ ప్రొఫెసర్ రాఘవులను అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్. లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణ, పీఆర్వో డాక్టర్ పి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విభాగాల వారీగా మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులు
విభాగం పేరు
అడల్ట్ ఎడ్యుకేషన్ చేతన్‌కుమార్ కురుబ
బయో కెమిస్ట్రీ లక్ష్మీ వెంకట చక్రపాణి
బయోటెక్నాలజీ గౌసియాబేగం షేక్
బోటనీ లోకనాథ్‌రెడ్డి.జీ
కెమిస్ట్రీ గోవర్ధన్.సి
కామర్స్ సంతోష్‌కుమార్.డి
కంప్యూటర్ సైన్సెస్ మనీష దిబ్బల
ఎకనామిక్స్ శ్రావణి ఎం.
మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరన్న మాణిక్యాల
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శివకుమార్ .డి
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ హర్షిత.కె
ఇంగ్లీష్ మనోజ్‌కుమార్ ఎస్
జియాగ్రఫీ దివాకర్ గొర్ల
జియాలజీ ఈశ్వరయ్య.కె
హిందీ సాయిలీల
హిస్టరీ హరికృష్ణ.వి
లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ మంగ్లేనాయక్ రమావత్
మేథమేటిక్స్ ప్రవీణ్ కుమార్ .యు
మైక్రోబయాలజీ నషీమా సయ్యద్
ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆనంద్.బీ
ఫిజిక్స్ ఇంద్రాణి. జే
పొలిటికల్ సైన్సెస్ అబ్దుల్లా షేక్
పాలిమర్ సైన్సెస్ జాహ్నవి ఘంటసాల
రూరల్ డెవలప్‌మెంట్ లక్ష్మీనారాయణ
సెరికల్చర్ దాసరి హరీష్‌కుమార్
సోషల్ వర్క్ తరుణీ ప్రియా పాటిల్
సోషియాలజీ వంశీ కృష్ణ ఎన్
స్టాటిస్టిక్స్ శ్రావణి ఇద్దే
తెలుగు శ్రావణి పులగూర
జువాలజీ దీపిక ఎం
–మొత్తం 30 విభాగాలకు గాను 12 విభాగాల్లో మహిళలు మొదటి ర్యాంకు సాధించి ప్రతిభను చాటారు.
–ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 100 మార్కులకు 99 మార్కులు సాధించిన ఆనంద్ తొలిర్యాంకు దక్కించుకొన్నాడు.
ఎస్కేయూ సెట్ ఫలితాలు విడుదల
Published Sun, Jun 4 2017 11:14 PM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement